Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనుపమ…? లేడీ అర్జున్‌రెడ్డి..? ఆమె నుంచి ఊహించని ‘సీన్’…

January 1, 2024 by M S R

ఆమధ్య యానిమల్ సినిమాలో రెచ్చిపోయిన ఓ వ్యాాంప్ కమ్ సెకండ్ హీరోయిన్ కేరక్టర్… ‘తృప్తి’గా ఓ కామెంట్ చేసింది… ‘‘అబ్బే, ఆ సీన్లు తీసినప్పుడు నలుగురమే ఉన్నాం, చాలా కంఫర్ట్ వాతావరణంలో షూట్ చేశారు, మొదట్లో మా అయ్యా అవ్వా బాధపడ్డారు…’’ అని ఏదేదో చెప్పింది… కోట్ల మంది చూసే సీన్లు వోకేనట, కాకపోతే షూటింగ్ సమయంలో కెమెరామన్, తను, హీరో, దర్శకుడు ఉంటే చాలునట… ఫాఫం…

బట్టలిప్పి బరిబాతల కనిపించినా… బోల్డ్, ఇంటిమేట్ సన్నివేశాల్లో ఇరగదీసినా… లిప్ లాకులు, హగ్గులతో రెచ్చిపోయినా… వెగటు స్టెప్పులతో ఐటమ్ సాంగ్స్ చేసినా… కథ డిమాండ్ చేసింది అని ఓ పిచ్చి సమర్థన చేసుకుంటుంటారు… అంతా డబ్బుల మాయ, రెమ్యునరేషన్ ఏ పనైనా చేయిస్తుంది… లేదంటే ఏ ఆఫర్లూ రాకపోతే ఎంతకైనా దిగొచ్చేలా చేస్తుంది… అదొక్కటే నిజం…

కానీ కొందరు ఉంటారు… నిత్యా మేనన్, సాయిపల్లవి వంటి తారలు… నథింగ్ డూయింగ్… అవసరమైతే సినిమాల నుంచే తప్పుకుంటారు గానీ వెకిలి సీన్లను అస్సలు సమ్మతించరు… నిజానికి అనుపమ పరమేశ్వరన్ కూడా బోల్డ్ సీన్లు చేసేది కాదు… లిప్ లాకులకూ నో చెప్పేది… అదేదో సినిమాలో (రౌడీ బాయ్స్‌లో ఆశిష్‌తో కావచ్చు) లిప్ లాక్‌కు వోకే అన్నది… కానీ ఆమె ఫ్యాన్స్ విపరీతంగా విరుచుకుపడ్డారు ఆమె మీద… ఎస్, ఆమెను ఓ ‘పద్ధతైన’ నటిగానే చూస్తారు ఫ్యాన్స్… కానీ..? ఈ ట్వీట్ చూడండి…

Ads

ఆమె ట్విట్టర్ అకౌంటే… వెరిఫైడ్, సర్టిఫైడ్ అకౌంటే…

If only LOOKS could KILL! 😈❤️‍🔥

Team #TilluSquare wishes you all a very #HappyNewYear2024 ✨💥

In cinemas #TilluSquareOnFeb9th 🤟#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas… pic.twitter.com/f7t9v1vEYb

— Anupama Parameswaran (@anupamahere) December 31, 2023

 

జొన్నలగడ్డ సిద్ధు మీద కూర్చున్న ఫోజు చిల్లరగా ఉంది… పైగా తనే ట్వీట్ చేసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పింది… నిజానికి ఆమె సిద్ధూతో చేయడమే చాలామందికి జీర్ణం కావడం లేదు… సిద్ధూ చాన్నాళ్లుగా ఫీల్డ్‌లో ఉన్నా సరే, ఆ డీజే టిల్లు తప్ప వేరే చెప్పదగిన సినిమాల్లేవు… రష్మితో కలిసి చేసిన ఆ గుంటూరు టాకీస్ నుంచి కూడా సిద్ధువి అదో టైపు పాత్రలు… కానీ అనుపమ రేంజ్ వేరు… సరే, రేంజులదేముంది..? ఎవరు ఎవరితోనైనా జతకట్టవచ్చు అంటారా..? సరే, కానీ సిద్దూతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా కాస్త బీభత్సంగానే ఉంటుంది…

డీజే టిల్లు ఊపులోనే టిల్లు స్క్వేర్ తీస్తున్నారుగా… తన పాత హీరోయిన్ నేహశెట్టిని కాదని అనుపమను తీసుకున్నారు… ఈ న్యూ ఇయర్ పోస్టర్ మాత్రం ఫ్యాన్స్‌కు అస్సలు డైజెస్ట్ కావడం లేదు… ఆమె ట్వీట్‌కు రిప్లయ్స్ కూడా ఫుల్లు నెగెటివ్‌గా ఉన్నయ్… సరే, ఆమెకు అవకాశాలు లేక ఇలాంటి నిర్ణయాలకు వోకే చెబుతోందా..? అనివార్యమా..? కాదు…

మంచి డిమాండ్ ఉన్న నటే… టిల్లూ స్కేర్‌తోపాటు ఈగల్ ఉంది ఆమె చేతిలో… తమిళంలో సిరెన్, మలయాళంలో ట్రుత్ షల్ ఆల్వేస్ ప్రివేల్ సినిమాలున్నయ్… ‘‘ఆఫర్లు లేకపోతే వెబ్ సీరీస్, మరీ కాదంటే టీవీ సీరియళ్లు చేసుకో, కానీ ఇదేం రోగం’’ అంటూ ఫ్యాన్సే మండిపడుతున్నారు… ఈ స్పందన ఎక్స్‌పెక్ట్ చేసి ఉండదు ఆమె… అవును మరి, ఆమె నుంచి ఆ పోజులూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా మరి…!!

#Siddu

@anupamahere
@MallikRam99
@ram_miriyala
@achurajamani
@NavinNooli

#SaiPrakash

@vamsi84

#SaiSoujanya

@SitharaEnts
@Fortune4Cinemas
@adityamusic

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions