Srinivas Sarla…. అతడు, పోకిరి సినిమాలు వచ్చి ఇరవై ఏళ్ళు అవుతున్నా, నువ్ చైర్ లో కూర్చునే స్టైల్ నువ్ మాట్లాడే స్టైల్ ని అనుకరించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారని నీకు తెలుసా, తెలువదా అన్నా
I am sorry, నువ్ సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేసావ్, నాని సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఆ కాలానికి ఏ హీరో చేయని సాహసం
టక్కరి దొంగ, One నేనొక్కడినే, స్పైడర్, ఖలేజా లాంటి ఎన్నో ప్రయోగాలు చేసావ్ హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా… ఆ సినిమాలను ఇప్పటికి నేను ఇష్టపడుతుంటా
Ads
బ్రహ్మోత్సవం గురించి అయితే ఇక నేను చెప్పలేను, ఈరోజు వరకు నేను చూడని నీ సినిమా అది, మళ్ళీ ఇన్నేళ్లకు గుంటూరు కారం కూడా ఆ లిస్ట్ లో చేరింది, ప్రామిస్ చెబుతున్నా, ఇంక నేను గుంటూరు కారం సినిమా చూడను, చూసి బాధ పడలేను
అందరు హీరోలు ఈ కాలానికి తగ్గట్టు సినిమాలు చేస్తున్నా. నువ్ ఎందుకు అన్నా ఇంకా ఇలాంటి పాత చింతకాయ పచ్చడి సినిమాలు చేస్తున్నావ్
ఓపెన్ గా చెబుతున్న శ్రీమంతుడు సినిమా, భరత్ అనే నేను సినిమా, ఆ మధ్య ఇంకోటి ఏదో వచ్చింది… ఆ గుర్తొచ్చింది సర్కారు వారి పాట సినిమా.. ఈ మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోల్చుకోలేని విధంగా టీవిలో వచ్చినపుడు పేర్లు కూడా కన్ఫ్యూస్ అవుతుంటాను, ప్రపంచంలో ఎక్కడన్నా నాలుగు సినిమాలు same ఉంటాయా అన్నా…
ఈ త్రివిక్రమ్ ఈ బోయపాటీ ఈ బ్లా… బ్లా… బ్లా లాంటి సోకాల్డ్ డైరెక్టర్లు ఒక వర్గం హీరోలకు మాత్రమే హిట్స్ ఇస్తున్నారు, అది గమనించు అన్నా ప్లీజ్
తమిళ్ హీరోలు, కన్నడ హీరోలు, మలయాళ టాప్ హీరోలను గమనించు, డిఫరెంట్ సబ్జెక్ట్ లతో వచ్చి దారుణంగా హిట్స్ కొట్టి పోతున్నరు, అంత టాలెంట్ పెట్టుకుని ఇలాంటి కతలు ఇలాంటి స్క్రీన్ ప్లే లు మనకు ఎందుకు అన్నా…
ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ ఇలాంటి కొత్తోళ్లకు అవకాశాలు ఇవ్వు అన్నా
దిక్కుమాలిన outdated దర్శకులతో ఇక సినిమాలు వద్దు,.. ఈ తరానికి, నీకు తగ్గ కథలు మాకు చెప్పు,.. వినడానికి, బ్రేక్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం
నాకు coming project కూడా డౌట్ గానే ఉంది అన్నా… కావాలనే నిన్ను నీ ఇమేజ్ నీ ఎక్కడ నాశనం చేస్తారో అని ఎందుకో… i am sorry
- ప్రేమతో, నిను పిచ్చి పిచ్చిగా ఆరాధించే నీ తమ్ముడు శ్రీనివాస్ సార్ల
Share this Article