Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు ఆమె ఎవరు..? ఈ పోలీస్ అతి భద్రతలు, బందోబస్తులు దేనికి..?

November 23, 2026 by M S R

.

కొన్ని వార్తల్ని నిశితంగా పరిశీలిస్తుంటే… మన వ్యవస్థల మీద మనకే ఓరకమైన ఏవగింపు కలుగుతుంది… ఉదాహరణకు… జగన్, షర్మిల ఆస్తి పంచాయితీ… ముందుగా నేపథ్యం చెప్పుకుందాం… ఆమె బిడ్డ పెళ్లిని తను ఉండే బెంగుళూరు, యలహంక ప్యాలెస్‌లో జరుపుకోవాలని అనుకుంది, గుడ్, తప్పులేదు… కానీ అది నీ ఇల్లు కాదు, పెళ్లీగిళ్లీ జాన్తానై, అడుగుపెడితే ఊరుకోను అని జగన్ తర్జని చూపించాడు…

పక్కాగా ఇది ఓ కుటుంబ తగాదా… ఆస్తి పంచాయితీ… అయ్యో, అయ్యో, మా నాన్న ఇచ్చాడు అని షర్మిల, అలాంటిదేమీ లేదు, నీకేం సంబంధం లేదుపో అని జగన్… వ్యవహారం ఎక్కడ తేలాలి..? కోర్టుల్లో తేల్చుకోవాలి… ఎస్, దేవనహళ్లి సివిల్ కోర్టు ఆ ప్యాలెస్‌లోకి వెళ్లకూడదని ఆదేశించింది… (ఇది సిలికాన్ బిల్డర్స్ దాఖలు చేసిన పిటిషన్, జగన్ వేయలేదు)…

Ads

అంటే… ఎవరికో చెందిన ఓ ప్రైవేటు ప్రాపర్టీలోకి ఎంటర్ కావద్దని కోర్టు సూచనల సారాంశం… దాన్ని షర్మిల గౌరవించాలి లేదా పైకోర్టుకు వెళ్లి పోరాడాలి… అదేదీ చేయలేదు… వేరే వేదిక (లీలా ప్యాలెస్)లో పెళ్లి తంతు జరిపిస్తామని బహిరంగంగానే ప్రకటించింది… కానీ తరువాత ఏం చేసింది..?

తల్లి విజయమ్మ, కొడుకు, బిడ్డతో కలిసి బెంగుళూరుకు వచ్చింది… విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు… లీలాప్యాలెస్ హోటల్‌ వైపు వెళ్తూ వెళ్తూ ఆమె హఠాత్తుగా వివాదాస్పద యలహంక ప్యాలెస్ వైపు వెళ్లబోయింది… పోలీసులు అడ్డుకుంటే వాళ్లతో వాగ్వాదానికి దిగింది… కోర్టు చెప్పిన తరువాత కూడా ఇదేం వైఖరి..?

షర్మిల

కాసేపు డ్రామా… ‘లీలాప్యాలెస్‌కు వెళ్లేందుకు అవసరమైన జడ్‌ ప్లస్‌ భద్రత ఏర్పాటుచేస్తాం. కానీ యలహంక ప్యాలెస్‌లోకి, ఈ మార్గంలో ప్రవేశించేందుకు అనుమతించేది లేదు’ అని పోలీసులు తెగేసి చెప్పారు… దాంతో ఆమె విధిలేక, వేరే చేసేదీ లేక లీలాప్యాలెస్‌కు వెళ్లిపోయింది… ఆ హోటల్‌లోనే పెళ్లి జరిగేది… మరి అకస్మాత్తుగా యలహంక ప్యాలెస్ వైపు వెళ్తాననే హైడ్రామా దేనికి..?

ఇక్కడ మరో ప్రధాన ప్రశ్న… ఆమెకు జడ్ ప్లస్ భద్రత ఏర్పాటు చేయటానికి పోలీసుల సంసిద్ధత… అసలు ఎవరు ఆమె… ఒక రాష్ట్రంలో ఉందో లేదో తెలియని పార్టీకి అధ్యక్షురాలు, అంతేకదా… కనీసం వార్డు సభ్యురాలు కూడా కాదు, ఎప్పుడూ పోటీ చేయలేదు, ఆమె ఎప్పుడూ ఏ స్థాయిలోనూ ప్రజాప్రతినిధి కాదు… మరెందుకయ్యా జెడ్ ప్లస్ భద్రత..?

ఆమెకు బెంగుళూరు నివాసం కావచ్చుగాక… కానీ స్థూలంగా చూస్తే అవుట్ సైడర్… వోటు హక్కు ఎక్కడ ఉందో క్లారిటీ లేదు… కానీ రేపో ఎల్లుండో బిడ్డ పెళ్లి పెట్టుకుని, ఆ పనులు చూసుకోకుండా ఈ కైలాట్కం ఏమిటి..? అదీ పొరుగు రాష్ట్రంలో..? ఈ వివాదంలో కర్నాటక ప్రభుత్వం ఓవరాక్షన్ ఏమిటి..?

(ఓ దశలో సీఎం డీకే ఎంటరై జగన్‌కు కాల్ చేసి, అవసరమైతే ఆ ప్యాలెస్‌లో నీ నివాసానికీ, పెళ్లి జరపాలని అనుకునే షర్మిల నివాసానికీ నడుమ గోడ కట్టిస్తా, అంగీకరించు అని అడిగాడట… జగన్ మహా మొండి, ముదురు కదా… కుదరదు, థాంక్స్ అని డీకేకు చెప్పేశాడు… అసలు ఈ పంచాయితీలోకి ఆ సీఎం ఎందుకు ఎంటర్ కావాలి..? ఆమె ఒక రాష్ట్ర కాంగ్రెస్‌కు అధ్యక్షురాలు కావచ్చుగాక, కానీ బహిరంగంగా ఈ లొల్లి దేనికి..? పోలీసుల మొహరింపులు దేనికి..? బెంగుళూరు, కర్నాటక సమాజాలకు సంబంధించి ఆమె ఎవరు..?)

తన మధ్యంతర తీర్పుపై అభ్యంతరాలను వినేందుకు డిసెంబరు 19న హాజరుకావాలని షర్మిల తరఫు న్యాయవాదులను దేవనహళ్లి సివిల్‌ కోర్టు ఆదేశించింది… ప్యాలెస్‌ వాటాలపై వాదనలు వినేందుకు సోమవారం అవకాశం కల్పించింది… సో, యలహంక ఇంటి పంచాయితీ ఇంకా ముదరనుంది… జగన్ అంత తేలికగా వదిలేరకం కాదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలు ఆమె ఎవరు..? ఈ పోలీస్ అతి భద్రతలు, బందోబస్తులు దేనికి..?
  • ఓ మలయాళీ హీరోకు తెలుగులో ఇంత మంచి స్పేస్ ఎలాగంటే..?
  • ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ… ఆ పొగల చాయ్ తాగితేనే కదా అసలు మజా !!
  • కులగణన, స్కిల్ డెవలప్మెంట్… మోదీ నోట రే-రె (Re-Re) మాట..!!
  • ఎఐ రంగులు అద్దుకుని కొత్తగా వినిపిస్తున్న ఆపాత మధురాలు !
  • రాధికా ఆప్టే ఎద్దేవా నుంచి- సుప్రీంకోర్టు దాకా…. మేనరికాలు!!
  • తెలంగాణ కవితకు సహజమైన ఈ స్థానిక వాడుక భాష అర్థం కాలేదా..?!
  • ముఖ్యమంత్రి కాదు… మఠాధిపతి కాదు… ఆ అమ్మకు మాత్రం కొడుకే!
  • అడ్డంకులు తొలిగాయి- రేవంత్ కొరడా ఝళిపించాలి ఇక…
  • అయ్యా, న్యాయమూర్తి గారూ… రాజీనామా చేస్తే నేరం రద్దయిపోదు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions