Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబ్బో… ఆంటీని మునగ చెట్టు ఎక్కిస్తున్నారుగా… జెర పైలం తల్లీ…

February 8, 2024 by M S R

గంగవ్వ… బర్రెలక్క… కుర్చీ మడత పెద్దాయన… ఒక్కోసారి ఒకరు సోషల్ మీడియాలో ఫుల్లు పాపులర్ అయిపోతారు… గంగవ్వ అయితే ఓ ఇల్లు కట్టుకుంది… బిగ్‌బాస్ ఇంటికి వెళ్లొచ్చింది… బర్రెలక్క మంచి వోట్లే సాధించి రాజకీయాల్లో కొనసాగే సూచనలు కనిపిస్తున్నయ్… ఫాఫం, ఆ మడత కుర్చీ పెద్దమనిషికి పాపులారిటీ వచ్చింది గానీ ఇంకేమీ దక్కలేదు… ఇప్పుడు ట్రెండ్ కుమారీ ఆంటీ…

తెలుసు కదా… ఫుడ్ స్టాల్, ఫుల్లు గిరాకీ పెంచేసిన సోషల్ మీడియా… ఎగబడిన జనం… పోలీసుల కన్నెర్ర, అండగా నిలిచిన రేవంత్ రెడ్డి… వార్తల్లో వ్యక్తి అయిపోయింది… యూట్యూబ్ చానెళ్లయితే ఎగబడ్డయ్… ఇంటర్వ్యూలు… ఒకడైతే ఏకంగా ఫుడ్డు ఆంటీ లవ్ స్టోరీ తెలుసా అని కూడా ఓ స్టోరీ వండాడు… ఎవరికి ఏం తోస్తే అది ప్రేక్షకులకు వడ్డించేశారు…

సాధారణంగా ఇలా పాపులర్ కాగానే… శ్రీదేవి డ్రామా కంపెనీకి తీసుకొస్తుంటారు ఈటీవీలో… నెక్కిలేసు దుర్గారావు, లోకులు పలుకాకులు ఆంటీ ఎట్సెట్రా బోలెడు ఉదాహరణలు… ఈసారి స్టార్ మాటీవీ ముందుకొచ్చింది… కుమారి ఆంటీని రెండు ఫుడ్ డబ్బాలతో సహా వేదిక ఎక్కించేసింది… బీబీ ఉత్సవం అని ఓ షో చేస్తున్నారు కదా… బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో ఓ సరదా షో… అక్కడికి కుమారి ఆంటీని తీసుకొచ్చారు… ఇంకేం… స్రీముఖి ఆమెను అక్కా పిలుస్తూ హత్తుకుంది…

Ads

food aunty

హేమిటో… అందరూ ఆంటీ అని పాపులర్ చేస్తే ఈమెకేమో అక్క… సరే, దాదాపు సేమ్ వయస్సు కాబట్టి వోకే అనుకుందాం… ఆమె మీద అర్జున్ జోకులు, నవ్వులు… అదేనండీ… రెండు లివర్ ఎక్సట్రా కదా, మీది వెయ్యిరూపాయలు అనే పాపులర్ డైలాగ్ ఒకటి ఉందిగా… అదన్నమాట…

ఎవరో ఆమె మీద ఓ డీజే సాంగ్ కూడా చేశాడు… అయిపోలేదు, యాంకర్ సుమ ఆ సాంగ్ వాడేసుకుని తనే ఆంటీలా మారిపోయి ఓ రీల్ కూడా చేసేసి తన సోషల్ మీడియాలో పెట్టేసింది… (కాకపోతే సుమ రీల్ అస్సలు బాలేదు…)

View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma)

వెళ్లమ్మా వెళ్లు… ఇంకా చాలా టీవీలు పిలుస్తాయి… నీ పాపులారిటీ వాళ్ల రేటింగ్స్ కోసం వాడేసుకుంటాయి… కానీ మరిచిపోకు, నువ్వూ నీ ఫుడ్ స్టాల్… అదే నీ కడుపు నింపేది… నాలుగు రోజులైతే వీళ్లలో ఒక్కడూ మళ్లీ నీ దగ్గరకు రారు, నీ మొహం చూడరు… అప్పటికి మరో ఫుడ్ ఆంటీ లేదంటే మరో మడత కుర్చీ అంకుల్…

సోషల్ మీడియాలో అప్పుడే ఆమె పాపులారిటీ మీద జోకులు, మీమ్స్ స్టార్టయ్యాయి… చూడబోతే వచ్చే ఎన్నికల్లో ఏదో ఓ పార్టీ ఆమెకు టికెట్టు ఇస్తుందని కొందరు… ఎహె, ఎమ్మెల్సీ ఇస్తారని మరికొందరు… వచ్చే బిగ్‌బాస్ సీజన్‌లో ఆమె ఎంట్రీ మస్ట్ అంటూ ఇంకొందరు… అంతేనా… మొన్న కొందరు రాసిపారేశారు కదా… నెట్‌ఫ్లిక్స్ వాడు ఆమె మీద ఏకంగా ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేశాడని…! ఎస్, కొన్నాళ్లు అలా ఆమె చుట్టూ ఈ టీఆర్పీలు పైత్యం ప్రవహిస్తుంది… తరువాత మళ్లీ ఆమె ఫుడ్ స్టాల్, ఆమే… అంతే… ఎస్, రెండు లివర్స్ ఎక్సట్రా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions