Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ అందగత్తె… హీరోయిన్‌గా వెలుగుతుందీ అనుకుంటే తల్లిగా సెటిలైంది..!

February 11, 2024 by M S R

Subramanyam Dogiparthi……  మా నాన్నగారితో కలిసి చీరాలలో నాజ్ థియేటర్లో చూసా ఈ సినిమాను . 1968 లో బ్లాక్ బస్టర్ . 15 కేంద్రాలలో వంద రోజులు , విజయవాడ దుర్గా కళా మందిరంలో 186 రోజులు ఆడింది . ఎన్నో సినిమాల్లో NTR కు తల్లిగా నటించిన పుష్పలతకు ఈ సినిమా మొదటి సినిమా . NTR కు భార్యగా నటించింది . చాలా అందంగా , చక్కటి నటన కలిగి ఉంది, పెద్ద హీరోయిన్ అవుతుందని అనుకున్నారు . కానీ , తల్లిగా స్థిరపడిపోయింది .

రాము సినిమా అనగానే శ్రావ్యమైన పాటలు గుర్తుకొస్తాయి . వాటిల్లో ముందుగా గుర్తుకొచ్చేది దాశరధి గారు వ్రాసిన రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్య పాట . మిగిలిన వాటిల్లో మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే, మాటలు రాని కోయిలమ్మ కూయునులే , పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు , మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనమూ నీకేల పాటలు కూడా ఇప్పటికీ గొప్ప హిట్ సాంగ్సే . ఆర్ గోవర్ధనం సంగీత దర్శకులు .

pushpalatha

Ads

NTR నటనను ప్రత్యేకంగా మెచ్చుకోవాలి . రొటీన్ పాత్రలకు భిన్నంగా మాట కోల్పోయిన రాము తండ్రిగా , అగ్ని ప్రమాదంలో ఎంతగానో ప్రేమించిన చనిపోయిన భార్యను మరచిపోలేని భర్తగా , ఇలా వేర్వేరు షేడ్స్ కలిగిన పాత్రలో సమర్ధవంతంగా నటించారు . జమున అందంగా , బాధ్యత కలిగిన మహిళగా చాలా బాగా నటించింది . ఆ తర్వాత చెప్పుకోవలసింది SVR .., రాము పాత్ర వేసిన మాస్టర్ రాజకుమార్ . రేలంగి , రాజనాల , పద్మనాభం , సూరేకాంతం , గీతాంజలి , సత్యనారాయణ , రమణారెడ్డి , నాగయ్య ప్రభృతులు నటించారు .
May be an image of 2 people, people smiling and text that says "రాము RAMU"

కిషోర్ కుమార్ హిందీలో దూర్ గగన్ కి ఛావ్ అనే టైటిల్ తో సినిమా తీసారు . హిందీలో బాగా ఆడలేదు . AVM వారు కొద్ది మార్పులు చేర్పులతో ముందు తమిళంలో తీసారు . అక్కడ సక్సెస్ అయ్యాక తెలుగులో తీసారు . తెలుగులో సూపర్ సక్సెస్ అయింది . రెండు భాషల్లోనూ A C త్రిలోక్ చందరే దర్శకుడు .

మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో కూడా ఓ రెండు మూడు సార్లు చూసా . టి విలో వచ్చినప్పుడల్లా కాసేపు చూస్తా . యూట్యూబులో ఉంది . తప్పక చూడతగ్గ సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #TeluguCinemaNews #telugucinema

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions