Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేవంత్ ప్రయత్నాలకు ఫడ్నవీస్ పాజిటివ్- ఇక కిషన్ రెడ్డి ఏం చేస్తాడో ..!?

October 26, 2026 by M S R

.

తుమ్మిడిహట్టి బరాజు ఎత్తు పెంపుపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఏం చేయాలి..? ప్రత్యేకించి రాష్ట్ర బీజేపీ ప్రధాన బాధ్యుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేయాలి..? ఇదీ ఓ కీలకమైన ప్రశ్న… ఇది అర్థం కావాలంటే కాస్త వివరాల్లోకి, విశ్లేషణల్లోకి వెళ్లాలి…

ముందుగా ఓ వార్త… ఈ బరాజు ఎత్తును 152 మీటర్లకు మహారాష్ట్ర అంగీకరిస్తేనే ప్రాణహిత నీళ్లను గ్రావిటీ ద్వారా ఎక్కువగా ఎల్లంపల్లికి తీసుకురాగలుగుతాం… ఆదిలాబాద్ జిల్లాలో కొత్త ఆయకట్టు మాత్రమే గాకుండా… కేసీయార్ దారుణ నిర్వాకం కారణంగా పఢావుపడిపోయిన కాళేశ్వరం మూడు బరాజులకు ఏమైనా సార్థకత తీసుకురాగలుగుతాం… అంటే, ఆ తప్పులకు తుమ్మిడిహట్టి దిద్దుబాటు…

Ads

అప్పట్లో కేవలం 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రతో ఓ ఒప్పందం మమ అనిపించి, దాన్నలా గాలికి వదిలేసి, మూడు బరాజుల పేరిట అడ్డదిడ్డమైన ప్లాన్లతో ఖజానా నుంచి లక్ష కోట్లు ఖర్చు చేస్తే, అదెలా తెల్లఏనుగు అయిపోయిందో, ఎంత దారుణమైన అవినీతి కథో చాలా చెప్పుకున్నాం…

సో, రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎత్తు పునఃసమీక్షకు అంగీకరించాడు… ఇద్దరు సీఎంల నడుమ ఇవ్వాళ ముంబైలో భేటీ జరిగింది… రెండు రాష్ట్రాల సాగునీటి బాధ్యులందరూ పాల్గొన్నారు… మన అవసరాన్ని చెప్పాం, వాళ్లు విన్నారు… ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఖచ్చితంగా అంతర్రాష్ట్ర జలాలపై ఉభయతారకం…

ఫడ్నవీస్ కూడా ముంపు, మా ప్రజలకు నష్టం లేకపోతే సహకరించడానికి రెడీ అన్నాడు… తనకు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలతో, ప్రత్యేకించి ఆదిలాబాద్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు… ముంపుకు అధిక పరిహారానికీ సిద్ధమేనని రేవంత్ రెడ్డి చెప్పాడు… రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించి, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఒక ఉమ్మడి కమిటీ (Joint Committee) ని ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది…

timmidihatti

ఇక అసలు విషయానికి వద్దాం… కిషన్ రెడ్డి తన వంతు సహకారాన్ని అందించి, చాలా పాజిటివ్ ధోరణిని ప్రదర్శించాలి… మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం… సో, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని కిషన్ రెడ్డి ఓ సీనియర్ కేంద్ర మంత్రిగా తుమ్మిడిహట్టిపై వాళ్లను ఒప్పించడానికి సిన్సియర్‌గా ప్రయత్నించాలి… బీఆర్ఎస్ ఎలాగూ కుటిల రాజకీయనీతి కనబరుస్తుంది, దాని ప్రభావానికి గురికావొద్దు…

ప్రయత్నిస్తాడా..? ఈ సందేహం రావడానికి కారణాలున్నాయి… మెట్రో, ఆర్ఆర్ఆర్ వంటి చాలా విషయాల్లో కేంద్ర సహకారం దక్కడం లేదు… తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, కావాలనే కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తోందని తెలంగాణ సమాజం భావిస్తోంది… కావాలనే కిషన్ రెడ్డి కొన్నిచోట్ల అడ్డుపడ్డట్టు సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా నిందించిన తీరు చూశాం…

tbjp

ఎందుకు..? కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రత్యేకించి రేవంత్ రెడ్డికి మంచి పేరు వచ్చే ఏ పనైనా బీఆర్ఎస్ రాజకీయ కోణంలో రచ్చ చేస్తుంది, వ్యతిరేకిస్తుంది, అది ఆ పార్టీ సహజ నైజం… బీఆర్ఎస్‌తో ఉన్న గుప్తస్నేహం కోసం బీజేపీ అది చెప్పినట్టు ఆడుతుంది… ప్లస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్, మంచి పేరు రావడం దానికి ఇష్టముండదు… కానీ తెలంగాణ సమాజం కోసం కిషన్ రెడ్డి ఆ ధోరణిని విడిచిపెట్టి, సహకరిస్తాడా..?

ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కళ్లతో కాదు, తెలంగాణ విస్తృత ప్రయోజనాల కోణంలో కిషన్ రెడ్డి ఆలోచించాలి… ఒకవేళ తుమ్మిడిహట్టిపై కేంద్ర సహకారం లభించకపోతే… రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల నెగెటివ్ పాలిటిక్స్‌ను, వాటి ‘ఉమ్మడి రాష్ట్ర వ్యతిరేక ధోరణి’ని ఎండగట్టడం ఖాయం… తేల్చుకోవల్సింది బీజేపీయే… బీఆర్ఎస్ గుప్తస్నేహంతో రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడటమా..? తన వంతు ప్రయత్నాలు చేసి, రాష్ట్రానికి మేలు చేయడమా..?!

tbjp

కిషన్ రెడ్డినే ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడానికి కారణం… గతంలో తను మెట్రో వంటి ఇష్యూల్లో ప్రదర్శించిన నెగెటివ్ పాలిటిక్స్… ఇప్పుడైనా దేవేంద్ర ఫడ్నవీస్‌తో, కేంద్ర పెద్దలతో తన సత్సంబంధాల్ని ఉపయోగించి తెలంగాణ ప్రజలకు మంచి చేయగల హోదాలో ఉండటం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ ప్రయత్నాలకు ఫడ్నవీస్ పాజిటివ్- ఇక కిషన్ రెడ్డి ఏం చేస్తాడో ..!?
  • మొద రాత్రి! ఇది కేయాస్ నేరేటివ్… అంటే గందరగోళమే కథ ముడిసరుకు!!
  • నల జిలుకర మొగ్గ – కాలంతోపాటు మారితేనే ఏ కళకైనా మనుగడ !!
  • వడివేలు వంద కోట్ల భవనం.. కుటుంబం కోసమా? సంపదకు భద్రతా?!
  • గజబ్ రాత్ ! కథ గజబ్… కథనమే గజిబిజి… అనేక మలుపుల చిక్కుముడి !!
  • అల్లుడు అలిగాడు… రచ్చకెక్కిన రాధాకృష్ణ ఇంటి కలహాలు… కానీ..?
  • చిరంజీవిని వద్దన్నారు – ఓ కొత్త నటుడిని పట్టుకొచ్చారు… కానీ..?
  • పర్లేదు.., పండించండి – మత్తు కోసం అమ్మితే మాత్రం జైలే..!!
  • కాళేశ్వరం ఓ డిజాస్టర్ – ఓ బ్లండర్ … నిజం తేల్చేసిన నిపుణుడు !!
  • కేరళ వెజ్ గవర్నర్ ! తాజాగా మరో దిక్కుమాలిన రాద్దాంతం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions