.
Some in the media stay busy watching other houses Ignoring what is happening inside their own… అంటే, “కొంతమంది మీడియా వారు పక్కింటి విషయాలు చూడటంలో బిజీగా ఉంటూ, తమ సొంతింట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదు”… చాలా పదునైన వ్యాఖ్య… ఇది ట్వీట్ చేసింది ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అల్లుడు కోగంటి భాను… అసలు ఏం జరుగుతోంది..? ఇదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది…
ఓ మిత్రుడు ఏమంటాడంటే..? రాధాకృష్ణ ఇంట్లో కలహాల కథ కేవలం ఓ కుటుంబ అంతర్గతం, వ్యక్తిగతం… దానికి ఓ పాత్రికేయ విలువ ఏముంది..? కానీ అదేసమయంలో నిజం ఏమిటంటే..? సెలబ్రిటీలు, అంతకు మించి సమాజాన్ని ప్రభావితం చేసే కీలక కుటుంబాల్లోని కలహాలు, వివాదాలు, పరిణామాలు అంతర్గత వ్యవహారాలే అయినా సరే వాటికి వార్తల విలువ ఉంటుంది… రాధాకృష్ణ కూడా అంగీకరించి, ఆచరించేదే ఇది…
Ads
అన్నింటికీ మించి… నాలుగు గోడల నడుమ జరిగేది సమాజానికి తెలియాల్సిన పని లేకపోవచ్చు… కానీ సోషల్ మీడియాకు ఎక్కాక, పది మందీ పదిరకాలుగా మాట్లాడుకుంటారు… వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల్ని వార్తలుగా వ్యాప్తి చేసిన ఏబీఎన్- ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబమే ఇలా ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది…
మరో మాట కూడా నిజం… కలహాలు, వివాదాలు, మనస్పర్థలు, రాజకీయాలు అన్ని కుటుంబాల్లోనూ ఎంతోకొంత ఉంటాయి… కానీ కీలకమైన మీడియా, పొలిటికల్ కుటుంబాలు, సంస్థల్లో జరిగేవి ఆసక్తికరం… ఈరోజుల్లో అవీ వార్తలే… ఎందుకంటే, అవి సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి… విషయానికొస్తే…

తన భార్య మరణించాక ఆయన ఇంకెవరినో పెళ్లి చేసుకున్నాడనీ, అది కుటుంబంలో మనస్పర్థలకు దారితీసిందనే ప్రచారం కూడా కొన్నాళ్ల క్రితం సాగింది… కానీ ఇప్పుడు కొన్ని పరిణామాలపై అల్లుడు ‘ఎక్స్ బజారు’కెక్కాడు…
‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ (ABN Andhra Jyothy) మాతృసంస్థ ఆమోద బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలో (Aamoda Broadcasting Company Pvt. Ltd) చోటుచేసుకున్న టాప్ మేనేజ్మెంట్ మార్పులు ఇప్పుడు రాజకీయ, మీడియా వర్గాల్లో ఓ హాట్ టాపిక్…
అక్టోబర్ 9, 2026న ఏబీఎన్ సంస్థ ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్ ద్వారా వెలువరించిన వివరాల ప్రకారం… సంస్థ అధినేత వి. రాధాకృష్ణ (V. Radhakrishna) ఇప్పటివరకు నిర్వహిస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ (MD) హోదా నుంచి చైర్మన్ స్థాయికి మారాడు… కుమారుడు ఆదిత్య వేమూరి (Aditya Vemuri) కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా, కుమార్తె అనూష వేమూరి (Anusha Vemuri) జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా (JMD) నియమితులయ్యారు…
అయితే, అక్టోబర్ 9 నాటి ఈ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా ఇన్నాళ్లూ డైరెక్టర్‌గా కొనసాగిన ఆర్కే అల్లుడు కోగంటి భాను ప్రకాష్‌ను ఆ పదవి నుంచి తప్పించి, ఆయన స్థానంలో శ్రుతి కీర్తికి డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు… అక్టోబర్ 11 నుంచి అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలన్నీ కొత్త ఎండీ ఆదిత్య వేమూరి పేరు మీదే జరగాలని సంస్థ స్పష్టం చేసింది…
కుటుంబ సంస్థలో జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో కోగంటి భాను ప్రకాష్ ఎక్స్ (X) వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇది… “కొంతమంది మీడియా వారు పక్కింటి విషయాలు చూడటంలో బిజీగా ఉంటూ, తమ సొంతింట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదు” అని సారాంశం… ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది… ఏబీఎన్ వందల కోట్ల రూపాయల కొత్త భవనం ప్రారంభోత్సవానికి అల్లుడు దూరంగా ఉండటం, మేనేజ్మెంట్ పదవుల నుంచి తప్పించడం వల్లే ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడంటూ సోషల్ మీడియాలో చర్చ నడిచింది…

ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చెలరేగడంతోపాటు ఇంట్లో ఏం జరిగిందో గానీ అల్లుడు కోగంటి భాను ప్రకాష్ తను చేసిన పాత ట్వీట్‌పై క్లారిఫికేషన్ ఇస్తూ మరో పోస్ట్ పెట్టాడు…
“సోషల్ మీడియా అనలిస్టులు, వెబ్సైట్లు, పొలిటికల్ ఆసక్తిపరులు అందరికీ ధన్యవాదాలు… నేను ఇప్పటికీ ఆమోద బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ABN) లో భాగస్వామినే… కేవలం హైరార్కీ (నిర్మాణ క్రమం) మాత్రమే మారింది… నా గత ట్వీట్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు… దాని ఉద్దేశం వేరు… అది మా మీడియా గురించి కాదు… ఏ మీడియా సంస్థకు చేరాల్సి ఉందో ఆ సందేశం అక్కడికి చేరింది…” ఇదీ తన వివరణ…
ఏపీ రాజకీయాల్లో, తెలుగు మీడియాలో ‘ఇంటి కలహాలు’ వేరే కుటుంబాల్లో ఏమున్నాయి ఇప్పుడు..? జగన్ చెల్లెలు షర్మిల కూతురి వివాహం- పెళ్లివేదిక వివాదానికీ ఆయన ట్వీట్లు వర్తించేలా లేవు… మరి పక్కింటి విషయాలు చూస్తూ బిజీగా ఉంటూ సొంతింటి విషయాల్ని విస్మరించిన ప్రముఖ మీడియా కుటుంబం వేరే ఏముంది..? ఏమో మరి… ఆయనే చెప్పాలి..!!
- ఎప్పుడూ జగన్ ఫ్యామిలీ, పార్టీ, రాజకీయాలు, పాలన ఎట్సెట్రా అన్ని విషయాలపై ఘాటుగా నోరుపారేసుకుంటుంది కదా ఏబీఎన్, ఆంధ్రజ్యోతి… రీసెంటుగా షర్మిల బిడ్డ పెళ్లిపై కూడా… మరిప్పుడు సాక్షి ఈ రాధాకృష్ణ సొంతింటి కలహాలపై ఏం రాస్తుందో చూడాలని ఉంది..!!
Share this Article
