‘‘ఏందివయా రేవంతూ… మేడిగడ్డకు, బొందలగడ్డకు పీకడానికి పోయినవా..? ఏముందక్కడ, తోకమట్ట… మన ప్రాజెక్టులను భద్రప్పల్లాగా బోర్డుకు అప్పగించిన్రు… నదుల గురించి నీకేం తెలుసు..? ఈక మందం తెల్వదు, తోకమందం తెల్వదు… నేనంటే ప్రాజెక్టుల్ని డిజైన్ చేసినోణ్ని, కట్టినోణ్ని… నన్నడిగితే నేను చెప్పనా ఏంది..? అడగటానికి సంస్కారం ఉండాలె, తెలివి ఉండాలె…
అవునవయా, ప్రాజెక్టులన్నాక కూలిపోవా..? కూరుకుపోవా..? కుంగిపోవా..? ప్రాజెక్టులంటేనే అట్లుంటయ్… గామాత్రం తెల్వదు, తెల్వి లేదు… అరె, దమ్ముంటే, చేతనైతే దబ్బదబ్బ మేడిగడ్డకు రిపేర్ చేయాలె, రైతులకు నీళ్లివ్వాలె… సింపుల్, నువ్వు అడగకపోయినా చెబుతున్న విను.,. నీకెట్లాగూ నన్నడగాలనే తెల్వి లేదు…
హైదరాబాద్ నుంచి భువనగిరి పోతుంటే కేపాల్ వస్తది… అట్లనే పోతే మా ఫామ్ హౌజ్ కూడా వస్తది, ఎడమ దిక్కు పోవాలె… కేపాల్‌ల బొక్కలు ఇరిగినోళ్లకు వైద్యం చేస్తరు… మంచిగ బొక్కలు సాఫ్ చేసి, సెట్ చేసి, మలాం పూసి, కట్టు కడతరు, బస్, ఖతం… నాలుగైదు రోజులల్ల సెట్టయితది… సేమ్, ఆ మూడో నాలుగో పిల్లర్లు పగుళ్లొచ్చినయ్ కదా, కేపాల్ టీంను తీసుకుపోవాలె, నన్ను తీసుకురమ్మంటే తీసుకొస్త, సెట్ చేస్తరు, అది ఓ పెద్ద కిరికిరా..? ఏడ్వనీకి..?
Ads
సరేపో, ఇంక మస్తు ఐడియాలున్నయ్ నా దగ్గర… ఓ నాలుగైదొందల క్విక్ ఫిక్స్ డబ్బాలు కొనుక్కొచ్చి ఆ పగుళ్లల్ల పోయాలె… సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు అదే చేయాలె… అంతెందుకు తుమ్మ బంక దొరుకుతది ఊళ్లల్ల, నాలుగైదు క్వింటాళ్లు కొనుక్కచ్చి ఆ సందులల్ల పోస్తే అతుక్కుంటయ్… గిట్ల బొచ్చెడు తెలుసు నాకు…
నాకు తుంటి బొక్క ఇరిగితే కాశీకి పొమ్మంటవా..? సవాల్ చేస్తన్నా, నువ్వేం పీకుతావో పీకి చూపించు… బరాబర్ గిట్లే మాట్లాడతం, నా భాషే గిది… నాకసలే సంస్కారం ఎక్కువ… సీబీఐకి ఇస్తవా, చెప్పు… ఢిల్లీల మా సీక్రెట్ దోస్తులే… ఊదు కాలనివ్వరు, పీరు లేవనివ్వరు… నాకేం అయితదివయా… చూస్తుండే, మళ్లీ రెట్టింపు వేగంతో అధికారంలోకి వస్తం… ఇంకా మస్తుంది తెలంగాణను ఉద్దరించే పని… గాయిగత్తర లేపుడు ఖాయం… జనం చెంపలేసుకుని లోకసభ ఎన్నికలల్ల ‘కారు, పదహారు, సారు’ అంటరు చూడు…
నువ్వు చూస్తుండు… బరాబర్ పైసలొచ్చే ఇంకో కాలేశ్వరం కడతా… ధరణిని మళ్లీ ప్రయోగిస్త రైతుల మీద… నువ్వు పీకిపడేస్తున్న మా బానిస అధికారులందరినీ మల్ల తీసుకొస్త… హరితహారం, భగీరథ, నువ్వు ఏదేది మాట్లాడుతున్నవో అన్నీ మల్ల తీసుకొస్త… నీ పార్టీలనే నావోళ్లు ఉన్నరు బిడ్డా, ఎగరకు, పైలం మల్ల… ఉన్న లాగూ కూడా ఊడబీకుతరు, నీ లంగోటీ సర్దుకోవడానికే నీకు సరిపోదు, ఏదో పీకుతానంటవ్… మల్ల మల్ల నీకు చాలెంజ్… నీకు జనం వోట్లేసి గెలిపించిన్రు కదా… పీకి చూపించు…
కాలు ఇరిగితే ఏమైంది..? గిట్లనే కట్టె పట్టుకుని కొట్లాటకు వస్త… ఈ బక్కోడిని తట్టుకుంటవా… ఆవో, దేఖేంగే… మరిశిపోయిన, ఇగో, ఈ భాషనే వచ్చేసారి తెలంగాణ అధికార భాషగ ప్రకటిస్తం.,. 80 వేల పుస్తకాలు చదివి నేర్చుకున్న హుందా భాష ఇది… ఊకుంటనా ఏంది..?’’
Share this Article