Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రతీ రాత్రి వసంతరాత్రి… సంగీత సాహిత్యాల సమ్మేళవింపు… గుబాళింపు…

February 27, 2024 by M S R

Subramanyam Dogiparthi…… సంగీత సాహిత్యాల సమ్మేళవింపు . నాకయితే ఓ దృశ్య కావ్యం . నాకిష్టమైన సినిమాలలో ఒకటి 1969 లో వచ్చిన ఈ ఏకవీర సినిమా . తెలుగులో తొలి జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి నవల . 1930s లో భారతి మాస పత్రికలో సీరియల్ గా ప్రచురితమై బ్రహ్మాండమైన పేరు వచ్చింది . 1960s లో NTR , ANR లతో ఈ నవల సినిమాగా రాబోతుందని తెగ చెప్పుకునే వారు . చివరకు సి యస్ రావు దర్శకత్వంలో NTR , కాంతారావులతో వచ్చింది . కాంతారావే కరెక్ట్ . రాముడికి లక్ష్మణుడు కదా !

విశ్వనాథ వారికి ఏకవీర అనే పేరు ఎలా స్ఫురించిందో ! అద్భుతమైన పేరు . అష్టాదశ పీఠాలలో ఒకటి ఏకవీర . అయినా ఎందుకనో చాలా చాలా అరుదుగా వింటుంటాం ఈ పేరు . నాకు ఈ పేరు కూడా చాలా ఇష్టం . మరో జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత సి నారాయణరెడ్డి గారు సంభాషణలు వ్రాసిన మొదటి చిత్రం . ఆ మాటలు సినిమా మాటల్లాగా ఉండవు . ఓ కావ్యంలోని మాటల్లాగా ఉంటాయి . ఈ సినిమాలో మెచ్చుకోవలసింది సంగీత , సాహిత్యాలు . కె వి మహదేవన్ సంగీతంలో పాటలన్నీ ఇప్పటికీ హిట్టే .

నాకు అత్యంత ఇష్టమైన పాటలు సి నారాయణరెడ్డి వ్రాసిన తోటలో నారాజు తొంగి చూసెను నాడు , దేవులపల్లి వారు వ్రాసిన ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి పాటలు . మిగిలిన పాటలు ఒక దీపం వెలిగింది ఒక రూపం వెలిసింది , కలువ పూల చెంత చేరి , నీ పేరు తలచినా చాలు , ఔనే చెలియా సరి సరి చాలా శ్రావ్యంగా ఉంటాయి . ఏ పారిజాతములనీయగలనో సఖీ పద్యం కూడా నాకిష్టం .

నాకు బాగా నచ్చిన నృత్యం రాజసులోచన భామాకలాపం కూచిపూడి నృత్య ప్రదర్శన . భామనే సత్యభామనే నృత్యం . ఈ నృత్యంతోనే ఆవిడకు బయట కూడా పేరొచ్చింది . వెంపటి సత్యం నృత్య దర్శకులు . ఇంత గొప్ప కళాఖండం ప్రేక్షకులకు ఎందుకనో నచ్చలేదు . ఫస్ట్ రిలీజ్ అప్పుడు ఆడలేదు . రిపీట్ రన్సుల్లో డబ్బులు ఎలా ఉన్నా జనం చూసారు . ఒరిజినల్ నవల నేను చదవలేదు . నవలకు సినిమాకు అనుగుణంగా చాలా మార్పులు చేసారని , ఆ మార్పుల్లో నవలకు ఆయువుపట్టులయిన కధాంశం దెబ్బ తిన్నదని అప్పుడప్పుడు సమీక్షల్లో చదువుతూ ఉంటాం .

ఇదంతా ఎలా ఉన్నప్పటికీ సినిమా ఓ దృశ్యకావ్యమే . ఏకవీరగా కె ఆర్ విజయ , మీనాక్షిగా జమున , వీరభూపతిగా కాంతారావు గొప్పగా నటించారు . ప్రత్యేకంగా చెప్పుకోవలసింది కుట్టాన్ సేతుపతిగా NTR నటన . Subdued గా , ధీరోదాత్తంగా , ప్రేమికుడిగా , భగ్న ప్రేమికుడిగా అద్భుతంగా నటించారు . చాలా అందంగా కనిపిస్తారు .

16వ శతాబ్దం , మధురై ప్రాంతం నేపధ్యంలో జరిగే కధ ఈ నవల కధ . ఈ సినిమా రూపం విశ్వనాథ వారికి కూడా నచ్చలేదని అంటారు . ఏది ఏమయినా ఇప్పటి తరంలో చూడని వారెవరయినా ఉంటే మాత్రం తప్పక చూడండి . మిస్ కానే కావద్దు . కళా పిపాస లేకపోతే ఎలా ! ముఖ్యంగా పాటలు , మాటలు . యూట్యూబులో ఉంది .

నేనీ సినిమాను గుంటూరు హరిహర మహల్లో చూసా . ఒక నరసరావుపేట మిత్రుడి పెళ్ళికి గుంటూరు రావటం జరిగింది . ఆరోజే రిలీజ్ . అందులో NTR సినిమా . చొక్కాలు చినిగినా చూడాలి కదా !

ఇంత గొప్ప నవలను ఎవరయినా ఇప్పటి సాంకేతికతో మళ్ళా ఓ దృశ్య కావ్యంగా తెలుగు ప్రేక్షకులకు చూపించాలని నా ఆకాంక్ష . ఆది పురుషుడు , శాకుంతలం లాగా చెడదొబ్బకుండా పధ్ధతిగా తీసి తెలుగు వారికి అందించటం విశ్వనాథ వారికి సమర్పించే నివాళి . ఏ నిర్మాత , ఏ దర్శకుడికి మనసు కలుగుతుందో !!

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugureels #telugucinema #TeluguCinemaNews

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions