ఒక్క స్విచ్ నొక్కితే రెండు లైట్లు ఆరిపోయాయి!
మొదటి బల్బు కవిత! రెండో బల్బు కేజ్రీవాల్!
తనని అరెస్ట్ చేయటం అక్రమం అంటూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.
మొన్న రాత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయక ముందే ఆప్ నాయకులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అంటూ!
నిన్న ఉదయం సెషన్ లో కవిత పిటిషన్ సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది.
కపిల్ సిబాల్ కవిత తరపున వాదిస్తున్నాడు.
కపిల్ సిబాల్: ఈ రోజు మీరు ఇచ్చే తీర్పు సుప్రీం కోర్టు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది.
సుప్రీం కోర్టు: డబ్బు, రాజకీయ పలుకుబడి ఉంది కదా అని ఇలాంటి కేసుని సుప్రీం కోర్టులో వేయటం దేనికోసం? రాజ్యాంగ బద్ధమైన ప్రోసీజీర్ ను విస్మరించి మేము చట్టాలను బై పాస్ చేయలేం. మీరు ట్రయిల్ కోర్టులో అపీల్ చేసుకోండి!
కవితకి 60 లక్షలు నష్టం! నిజం చెప్పుకోవాలి!
2015 నుండి ప్రతిపక్షాల తరపున అన్ని కేసులూ కపిల్ సిబాల్ వాదిస్తున్నారు కానీ ఒక్క కేసులో కూడా విజయం సాధించిన పాపాన పోలేదు! కానీ అన్ని కేసులూ కపిల్ సిబల్ దగ్గరకే వెళ్తున్నాయి!
ఇప్పుడు కవిత ట్రయల్ కోర్టులో కేసు వేయాలి. అక్కడ ఎటూ అనుకూల తీర్పు రాదు. ట్రయల్ కోర్టుకి సిబాల్ వెళ్ళడు! హై కోర్టు, సుప్రీం కోర్టులో కేసు అప్పీల్ చేసుకోవడానికి మళ్లీ కవిత సిబల్ కే కేసు అప్పచెబుతుంది.
డబుల్ కాదు ట్రిపుల్ ధమాకా కపిల్ సిబాల్ కి.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి కంటే గత పదేళ్లలో ఎక్కువ సంపాదించాడు సిబాల్!
********
సుప్రీం కోర్టు ఉదయం సెషన్ లో కవిత పిటిషన్ పై వచ్చిన తీర్పు చూసి ఆప్ నాయకులు తమ పిటిషన్ ఉపసంహరించుకున్నారు! అలా రెండో బల్బు ఆటోమేటిక్ గా ఆరిపోయింది!
Ads
**********
మొన్న కేజ్రీవాల్ ఇంట్లో పోలీసులు తనిఖీ చేసిన సమయంలో 150 పేజీల డాక్యుమెంట్స్ దొరికాయి.
ఆ డాక్యుమెంట్స్ లో ఇద్దరు సీనియర్ ED అధికారులకి సంబంధిచిన సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది!
సదరు అధికారులు లిక్కర్ స్కాం మీద గత రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్నారు!
అఫ్కోర్స్ ED ఆర్థిక నేరాల మీద దర్యాప్తు చేస్తుంది కాబట్టి IRS (Indian Revenue Service) అధికారులని డిప్యుటేషన్ మీద నియమిస్తుంది.
కేజ్రీవాల్ కూడా మాజీ IRS అధికారి కాబట్టి ED లో పనిచేస్తున్న IRS అధికారుల మీదా నిఘా పెట్టినట్లుగా డాక్యుమెంట్స్ ను చూసిన తరువాత అర్థం అయ్యింది.
ED లో పనిచేస్తున్న ఇద్దరు అధికారుల ఆస్థుల వివరాలు, సర్వీస్ లో చేరక ముందు ఎంత? ప్రస్తుత ఆస్థుల విలువ ఎంత? ఇతర కుటుంబ సభ్యుల మీద ఏమన్నా ఆస్థులు ఉన్నాయా? ఇలా వివరాలు ఉన్నాయి ఆ 150 పేజీల డాక్యుమెంట్స్ లో!
IRS అధికారులు కేంద్ర సర్వీస్ పరిధిలోకి వస్తారు కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి పరిధి కాదు కాబట్టి నిఘా పెట్టడం నేరం అవుతుంది!
*******
కేజ్రీవాల్ ఇంట్లోకి ప్రవేశిస్తూనే ED అధికారులు కేజ్రీవాల్ తో పాటు అతని కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు! ప్రస్తుతం కాల్ డేటా విశ్లేషిస్తున్నారు!
SO! ఇంత ఆలస్యంగా అరెస్ట్ చేసి తనిఖీలు చేస్తే ఏం దొరుకుతాయి అన్న విశ్లేషణలకి సమాధానం వచ్చింది.
ఇప్పటికే 328 కోట్ల రూపాయలకి సంబంధించి నేరం నిరూపించడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి ED దగ్గర! హై కోర్టులో ED చూపించిన ఆధారాల కారణంగానే కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది!
********
మరి కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నవి.
1. ఢిల్లీ జల్ మండల్ (Water Board).
2. మొహల్లా క్లినిక్స్.
3. మందుల కొనుగోళ్లలో అక్రమాలు.
********
ప్రస్తుతం ED ఆఫీస్ లో ఉన్న లాకప్ గదిలో ఉన్నాడు క్రేజీవాల్. ED ప్రత్యేక న్యాయస్థానం 7 రోజుల రిమాండ్ విధించింది.
ఒక దిండు, దుప్పటి, మందులు సమకూర్చారు అధికారులు
కాకపోతే 78 వేల ఖరీదయిన సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ మాత్రం ఇవ్వరు. అది లేకపోతే నిద్ర పట్టదు ఆమ్ ఆద్మీ సారుకి.
***********
ఎవరి లెక్కలు వారివి! బీజేపీ లెక్క వేరు!
కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం వల్ల అనవసర సానుభూతి వస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!
అది తరువాత సంగతి!
ముందు జైల్లో నుండి బయటకి వచ్చిన తరువాత సంగతి కదా?
విజయ్ నాయర్ అధికారికంగా అప్రూవర్ గా మారాడు.
ఇప్పుడు కవిత జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చి అప్రూవర్ గా మారనుంది
గోవా ఎన్నికలప్పుడు లిక్కర్ లాబీ నుండి డబ్బులు తీసుకున్న ఇద్దరు ఆప్ MLA లు అప్రూవర్లుగా మారి సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
కేజ్రీవాల్ లిక్కర్ స్కాం నుండి నిర్దోషిగా బయటకు రావడం అనేది జరగదు! హీన పక్షం 5 ఏళ్లు జైలు శిక్ష పడడం ఖాయం!
**********
కేజ్రీవాల్ అరెస్ట్ తరువాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్!
నకిలీ రైతులు తట్టాబుట్టా సర్దుకొని చల్లగా జారుకున్నారు!
అమిత్ షాకి కావాల్సింది ఇదే!
మిషన్ ఇంపాజిబుల్ కాస్త పాజిబుల్ అయ్యింది!
కాంగ్రెస్ ఎకో సిస్టమ్ కి పెద్ద దెబ్బ!
తమ పని ఇన్నాళ్ళూ కేజ్రీవాల్ చేసిపెడుతూ వచ్చాడు కానీ ఇపుడు కుదరదు!
అసలు జనరల్ ఎలక్షన్స్ కి ముందు ఏదన్నా పెద్దది చేయాలన్న ఆప్, కాంగ్రెస్ ల ప్లాన్ ఆగిపోయింది.
ఢిల్లీలో ఓట్లు పడకపోయినా ఫరవాలేదు కానీ రైతుల పేరుతో విధ్వంసం సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలను వమ్ము చేశారు అమిత్ షా!
*****
జార్జ్ సోరోస్ జెర్మనీ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే!
కేజ్రీవాల్ అరెస్ట్ తరువాత జెర్మనీ విదేశాంగ శాఖ వివాస్పద వ్యాఖ్య చేసింది: ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంలో తమని తాము రక్షించుకునేందుకు చివరి దాకా అవకాశం ఇవ్వాలి అని…
EVM జై శంకర్ తీవ్రంగా ప్రతిస్పందించారు.
ఇది మా దేశ అంతర్గత విషయం.ప్రజాస్వామ్యం గురించి మీరు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు! మా దేశ అంతర్గత విషయంలో మీ జోక్యం అనవసరం అంటూ స్పందించారు.
జై శంకర్ అక్కడితో ఆగిపోలేదు!
న్యూ ఢిల్లీలోని జర్మన్ రాయబారిని పిలిచి క్లాస్ తీసుకున్నారు ఈ రోజు.
So! ఇప్పటి వరకూ కేజ్రీవాల్ వెనుక జార్జ్ సోరోస్ ఉన్నాడు అనే అనుమానాన్ని జెర్మనీ అనాలోచితంగా చేసిన వ్యాఖ్య నిజం చేసింది.
దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కేజ్రీవాల్ చేత ఇంకెన్ని ఘోరాలు చేయించాలని విదేశీ శక్తులు ప్లాన్ చేశాయో అని!
ఢిల్లీ, పంజాబ్ లలో సీట్లు కాదు బిజేపికి ముఖ్యం!
పంజాబ్ సరిహద్దు రాష్ట్రం. ఢిల్లీ దేశ రాజధాని!
రెండూ భద్రతాపరంగా సున్నితమయిన ప్రాంతాలు కానీ ఢిల్లీ త్రాచు పాము కంటే ప్రమాదకరమైన కేజ్రీవాల్ చేతిలో ఉండగా పచ్చి తాగుబోతు అయిన భగవంత్ సింగ్ మాన్ చేతిలో పంజాబ్ ఉంది.
పాముని బుట్టలో పెట్టారు ఇక తాగుబోతు పని పట్టాలి.
ఇంకా ఉంది!
CAA అమలుని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాము అంటూ ప్రకటన చేసింది అమెరికా!
దీని మీద EVM జైశంకర్ ఘాటుగా వ్యాఖ్యానించారు!
మీ ఇంటిని చక్కపెట్టుకొండి ముందు అంటూ నెలకి ఒక కాల్పుల సంఘటన జరుగుతున్న వైనాన్ని ఎత్తి చూపారు.
హర్ష మందర్ మిగిలి ఉన్నాడు ఇంకా CAA నిప్పును రాజేయడానికి! CIA కి మిగిలిఉన్న రెండు తురుపు ముక్కలు హర్ష మందర్, ఖలిస్థాన్ టెర్రరిస్ట్ గురు పత్వంత్ సింగ్ పొన్ను.
RAW దెబ్బకి CIA ను నమ్ముకోకుండా సొంతంగా ఐదుగురు బాడీ గార్డులతో భయంభయంగా తిరుగుతున్నాడు గురు పత్వంత్ సింగ్ పొన్ను… అది కెనడా అయినా అమెరికా అయినా సరే!
*****
అన్నా హజారే మాత్రం కొంచెం నిజాయితీగా స్పందించాడు కేజ్రీవాల్ అరెస్ట్ మీద: కేజ్రీవాల్ చేతులారా చేసుకొని ఇప్పుడు అనుభవిస్తున్నాడు అని.
లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే కేజ్రీవాల్ కుర్చీలో కూర్చొని అతని భార్య వీడియో మెసేజ్ రిలీజ్ చేసింది.
చాలా స్పష్టంగా ఉన్నాడు కేజ్రీవాల్. లాలూ గారి రబ్రీ దేవి మోడల్ ను అమలుచేస్తున్నాడు!
Share this Article