మిగతా టీవీలు, మిగతా పత్రికలకు ఈ వార్త ప్రాముఖ్యత అర్థమైందో లేదో తెలియదు గానీ… ఈనాడు మెయిన్ పేజీలో కనిపించింది… భలే పట్టుకుంది ఈ వార్తను…! ‘‘మంత్రి హరీష్ రావు అయోధ్య రాముడికి లక్ష రూపాయల విరాళం ఇచ్చాడు… ఈ విరాళం ఇవ్వడం తన అదృష్టం అన్నాడు… రామజన్మభూమి తీర్థ ట్రస్టు ప్రతినిధులు ఆయన్ని కలిసి అడిగిన వెంటనే ఆయన స్పందించాడు…’’ ఇదీ వార్త సారాంశం… దానికి ఒక ఫోటో… అంతే… సైజు రీత్యా పెద్ద వార్తేమీ కాదు… కానీ ఈ వార్తకు పెద్ద విలువే ఉంది… ఎందుకంటే..? టీఆర్ఎస్ అయోధ్య రాముడి విరాళాల్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ముద్రపడిన నేపథ్యంలో… ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకులు పోటీలుపడి మరీ అయోధ్య చందాలపై ఉరుముతున్నవేళ….. పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ టాప్ త్రీ, టాప్ ఫోర్లో ఒకడైన హరీషే ఓ లక్ష రూపాయల్ని చందా ఇవ్వడం అసలైన ట్విస్టు… తెలంగాణలో అయోధ్య చందాల సేకరణ ముగిసిన రోజే హరీష్ దీనికి అసలైన ముక్తాయింపు ఇచ్చినట్టు లెక్క…
గుర్తున్నాయి కదా… కోరుట్ల విద్యాసాగర్ నుంచి పరకాల ధర్మారెడ్డి దాకా… బోలెడు మంది బీజేపీ వాళ్లు అయోధ్య పేరిట బిచ్చమెత్తుకున్నారు, వాటికి లెక్కాపత్రం లేదు, రశీదుల్లేవు, అసలు మా భద్రాద్రి రాముడు ఉండగా, ఈ అయోధ్య రాముడు దేనికి..? వంటి వ్యాఖ్యలతో… అయోధ్య గుడి చందాలకు టీఆర్ఎస్ వ్యతిరేకం, అసలు అయోధ్య రాముడికే వ్యతిరేకం అన్నంతగా ఓ సీన్ క్రియేట్ చేశారు… అర్జెంటుగా అందరికీ భద్రాద్రి రాముడు గుర్తొచ్చాడు… అవునులే, మజ్లిస్ చెప్పినట్టు ఆడే టీఆర్ఎస్ ఇంతకు భిన్నంగా ఎందుకు ఉంటుంది అని బీజేపీ వైపు నుంచి కౌంటర్లు… హన్మకొండలో ఉద్రిక్తత, కేసులు, దాడులు, బందుల దాకా వెళ్లి…. కడియం శ్రీహరి వంటి సీనియర్ నేత సైతం ‘‘ఇది పార్టీ వైఖరే’’ అని ముద్ర వేశాడు… ఈరోజుకూ సోషల్ మీడియాలో టీఆర్ఎస్ బ్యాచ్ అయోధ్య మీద సెటైర్లు, పోస్టులు కొనసాగిస్తూనే ఉంది… ఇదుగో ఈ స్థితిలో హరీష్ చందా ఇవ్వడమే అసలు వార్త… ఆ వార్తకున్న ఇంపార్టెన్స్ అదీ…
Ads
కానీ ఎందుకు..? మొత్తం పార్టీ ఆ బాటలో వెళ్తే, హరీష్ ఈ బాటలో ఉన్నాడేం..? ఇదేకదా ప్రశ్న… తనకు తెలుసు, తెలంగాణ నియోజకవర్గాల్లో హిందూ వోటును బీజేపీ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నదో… మొన్న దుబ్బాకలో ఆ సెగను తనే స్వయంగా ఎదుర్కొన్నాడు… తన స్వస్థానం సిద్దిపేటలో కూడా ఈ హిందూ ఫీలింగ్ మరీ ఎక్కువ… రాముడికి వ్యతిరేకం, హిందుత్వకు వ్యతిరేకం అనే ముద్రలు పడితే తనకు రాజకీయంగా నష్టం… అందుకని జన్మభూమి తీర్థ ట్రస్టు వాళ్లు అడగ్గానే ఓ లక్ష రూపాయలు ఇచ్చి, దండం పెట్టేశాడు… తెలివైనవాడు… (ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మొదటి నుంచీ ఈ విషయంలో సరైన పంథాలో ఉన్నాడు…) అవునూ, గ్రేటర్ ఎన్నికల్లో హిందూ సెగను తనూ ఫీలైన కేటీయార్ దగ్గరకు ఈ రామజన్మభూమి తీర్థ ట్రస్టు వాళ్లు ఎవరూ చందా కోసం వెళ్లలేదా..? అసలు జన్మభూమి ట్రస్టు, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు ఏకంగా కేసీయార్ దగ్గరకు అయోధ్య చందా కోసం వెళ్లే ప్రయత్నం చేస్తే ఎలా ఉండేదో..?! అన్నట్టు, టీఆర్ఎస్ లో మరో కీలక నేత ఈటెల కూడా రాముడికి విరాళం ఇచ్చిన వార్తని ఓ మిత్రుడు షేర్ చేసుకున్నాడు… శుభం…
Share this Article