రెజీనా కసాండ్రా… మెరిట్ ఉన్న నటే గానీ కావల్సినంతగా పాపులర్ కాలేకపోయింది ఇండస్ట్రీలో… అందగత్తే… సాయిధరమ్‌తేజ… ఈ మెగా క్యాంపు హీరో కేరక్టర్ ఇతర హీరోలకు కాస్త భిన్నం అంటుంటారు… తనకూ ఓ పెద్ద హిట్ దక్కాల్సి ఉంది… వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొన్నాళ్లుగా బోలెడు వార్తలు… వస్తూనే ఉన్నాయి…
అబ్బే, అదేమీ లేదోయ్ అని నిజానికి వీళ్లు ఖండించాలి… కానీ ఇంకా లేదు… ఎహె, రాసుకునేవాళ్లు రాసుకోనీలే అనుకుని ఉంటారేమో… లేదా భలే పట్టేశారే వీళ్లు అనుకుని ఉండాలి… ఇండస్ట్రీలో సహనటుల నడుమ ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్పులు చాలా సాధారణమే కదా… వాళ్లిద్దరి ప్రేమ పెద్ద ఆశ్చర్యమేమీ కాదు…
అది పెద్ద డిబేటే కాదు… కాకపోతే సెలబ్రిటీలు కాబట్టి, జనం చదువుతారు కాబట్టి, ఓ వార్త… ఏమో, వీళ్లు కూడా మొన్నమొన్న వరుణ్‌తేజ, లావణ్య జంటలాగా హఠాత్తుగా తమ ప్రేమను, తమ పెళ్లిని ప్రకటించేస్తారేమో… ఐతే సరదాగా చెప్పుకోవాలంటే… రెజీనా అని చదవగానే ఓ బూతు జోకు గుర్తొస్తుంది అందరికీ…
Ads
ఆమధ్య నివేదా, రెజీనా కలిసి శాకిని ఢాకిని అని ఓ సినిమా చేశారు గుర్తుంది కదా… ఆ ప్రమోషన్ మీట్లలో ఓచోట రెజీనా ఓ వ్యాఖ్య చేసింది… అనాలోచితంగా ఏమీ కాదు… తన సొంత అభిప్రాయమని కాదు… ఒక జోక్ చెబుతున్నాను సుమా అంటూనే వదిలింది…
‘‘మగాళ్లు, మ్యాగీ ఒకటే… జస్ట్, రెండు నిమిషాలు’’ ఇదీ ఆ జోకు… బహుశా తారల నడుమ తరచూ వినిపించే జోకేమో… ఆ వ్యాఖ్య మీద బోలెడు మీమ్స్, విమర్శలు, జోక్స్ నెట్లో, సోషల్ మీడియాలో పోటెత్తాయి… అమ్మో, రెజీనా నెరజాణే సుమీ అన్నట్టుగా వెటకారాలు కూడా..!
అదే సినిమా ప్రమోషన్‌కు అతిథిగా హాజరైన అడివి శేషు కూడా రెజీనాను ఆటపట్టిస్తూ… ఆ రెండు నిమిషాలపై క్లారిటీ కావాలి అంటూ ఆటపట్టించాడు… రెండు నిమిషాలాగి చెబుతా అని నవ్వుతూ దాటేసింది… అదంతా ఓ సరదా వార్త…
రెజీనా పక్కా మద్రాసీ… 33 ఏళ్ల ఈమె 2005 నుంచీ ఇండస్ట్రీలో ఉంది… తమిళ, తెలుగు సినిమాలే ఎక్కువ… సాయిధరమ్‌తేజ గురించి చెప్పాల్సిన పని లేదు… 37 ఏళ్ల ఈయన చిరంజీవి చెల్లెలు విజయదుర్గ కొడుకు… 2014 నుంచీ ఇండస్ట్రీలో ఉన్నాడు… తనకన్నా రెజీనాయే సీనియర్…
వీళ్లిద్దరూ ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘నక్షత్రం’ వంటి సినిమాల్లో కలిసి నటించారు… ‘పిల్లా నువ్వు లేని జీవితం’ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం చిగురించి, అది ప్రేమగా మారిందని ప్రచారం జరిగింది… చాలా వార్తలు వచ్చాయి, కొన్నాళ్లుగా సైలెన్స్… మళ్లీ ఇప్పుడు తాజా ప్రచారం… కల్యాణమస్తు…! ఆల్రెడీ కొందరు స్టార్ట్ చేశారు ఇలా… ‘‘రెండు నిమిషాల రెజీనాకు నచ్చాడంటే సాయిధరమ్‌తేజ మ్యాగీ బాయ్ కాదన్నమాట…’’
Share this Article