Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మా తల్లే… నోర్మూయవే… నోటి ముత్యాల్ జార్నీయకే…

April 23, 2024 by M S R

ఈమధ్య ఓ కథనం చదివారు కదా… నటి కస్తూరి నవ్వు పుట్టించే మాటల మీద… చెప్పే నోటికి వినేవాడు అలుసు అని ఇదుగో ఈమె వంటి కేరక్టర్ల వల్లే పుట్టిన సామెత… తాజాగా మళ్లీ కూసింది ఏదేదో…

అవునూ, మొన్న ఏం చెప్పిందో సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే…

  • మోహన్‌బాబుతో ఓ ప్రాజెక్టులో చాన్స్ వచ్చింది కానీ చేయలేకపోయాను…
  • రజినీకాంత్‌తో మూడుసార్లు అవకాశం వచ్చింది, కానీ మూడుసార్లూ నటించలేకపోయాను, కాలా మూవీలో కూడా చాన్స్ ఇచ్చారు కానీ మరీ యంగ్‌గా ఉన్నానని తొలగించారు…
  • జెంటిల్‌మేన్ హిందీ రీమేక్‌లో కూడా చాన్స్ వచ్చింది, కానీ ఆ టైమ్‌కు టైఫాయిడ్ రావడంతో అది మిస్సయిపోయింది…
  • చిరంజీవితో ఒక సినిమా కూడా… అంతెందుకు కల్యాణరామ్ డెవిల్ సినిమాకు సైన్ కూడా చేశాను, కానీ ఆయన పక్కన మరీ యంగ్‌గా కనిపిస్తున్నానని తీసేశారు…
  • నాకు వయస్సు పెరగదా అని నేను ఫీల్ అవుతూ ఉంటాను… నాకు ఇప్పటికీ తెల్లజుట్టు రావట్లేదు తెలుసా… మదర్ క్యారెక్టర్స్ అయితే 30 ఏళ్లు మదర్ గా ఉండిపోవచ్చు… కానీ నేను మదర్ క్యారెక్టర్స్ చేయలేను కదా, ఎవరికి చేస్తాను చెప్పండి..?
  • మహేష్ బాబు వయస్సు నా వయస్సు సేమ్, ఆయనకు మదర్ రోల్ లో ఎలా చేస్తాను..? మహేష్ నేను జోడీలా ఉంటాం కదా, తనకు నేను తల్లిలా చేసినా బాగుండదు..’’

50 ఏళ్ల వయస్సులో భలే చమత్కారాలు మాట్లాడుతోంది అనుకుంటున్నారా..? పెద్ద పెద్ద హీరోలకు తల్లిగా చేయదట, కానీ అదేదో ఇంటింటి గృహలక్ష్మి అనే టీవీ సీరియల్‌లో మాత్రం ఊరూపేరూ తెలియని నటులకు తల్లిగా చేస్తుందట…

Ads

కస్తూరి

ఇప్పుడేమంటున్నదంటే…? (అదేదో ఇంటర్వ్యూలో…)

  • మీ ప్రమేయం లేని, మీకు సంబంధం లేని అంశాల్లో కూడా వేలుదూర్చి వివాదాల్లోకి ఎంటరవుతారు దేనికి అని యాంకర్ అడిగితే… ప్రతి ఒక్కరికీ ఓపీనియన్ ఉంటుంది కదా, నాకు సామాజిక స్పృహ ఎక్కువ… స్పందించకుండా ఉండలేను అంటోంది…
  • తమిళనాడులో నన్ను నటి కస్తూరి అని పిలవరు, సోషల్ యాక్టివిస్ట్ కస్తూరి అంటారు…
  • ఏదైనా ఇష్యూ మీద మాట్లాడకపోతే, ఏమైంది, ఎందుకు మాట్లాడటం లేదు ఫలానా ఇష్యూపై అనడుగుతున్నారు…
  • టీన్స్‌లో లోకజ్ఞానం ఉండదు, 25 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నాను, చాలా లైఫ్ చూశాను, మాట్లాడకపోతే ఎలా..?
  • తెలుగులో ఎథిక్స్ లేని యూట్యూబ్ చానెళ్లు ఎక్కువ… నేను చెప్పనివీ రాసేస్తారు, ఐనాసరే, నేను మాట్లాడటం ఆపను…

Kasturi

హేమిటో… మీడియా, పబ్లిక్ అటెన్షన్ కోసం తాపత్రయం తప్ప, అక్కరకొచ్చే అంశాల మీద పెద్దగా నోరు విప్పదు… నయనతార సరోగసీ మీద మాట్లాడితే సామాజిక స్పృహ అనుకోవాలా..? సరోగసీ లీగల్ పైగా ఆ జంట ఇష్టం… గతంలో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాధాన్యం, ప్రచారం పేరిట ఒక పుస్తకం కోసం టాప్ లెస్ ఫోటోలు దిగి మీడియా తెర మీదకు వచ్చింది… బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ చెప్పాలంటే టాప్ లెస్ వేషాలు అవసరమా..? దీన్ని సామాజిక స్పృహ అనాలా..?

ఆమధ్య ఆదిపురుష్ సినిమా మీద కామెంట్ చేస్తూ… ‘‘ప్రభాస్ రాముడిలా కాదు, కర్ణుడిలా కనిపిస్తున్నాడు. ప్రభాస్‌ రాముడిగా అస్సలు సెట్ కాలేదు… అయినా రాముడికి, లక్ష్మణుడికి మీసాలు ఉండటం ఏమిటి..?’’ అని చెప్పుకొచ్చింది… ఇదా సామాజిక స్పృహ..? వనవాసంలో ఉన్న రామలక్ష్మణులకు మీసాలు ఉండొద్దట… ఉండవని ఎవరు చెప్పారు తల్లీ..?

నయనతారకి సూపర్ స్టార్ అని పిలిపించుకునే అర్హత లేదు… లేడీ సూపర్ స్టార్స్ అంటే కెపి సుందరాంబల్, విజయశాంతి మాత్రమే… కోలీవుడ్ లో అజిత్, విజయ్ లాంటి స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా రజనీకాంత్ స్థాయి మాత్రం చేరుకోలేరు… ఇలాంటి వ్యాఖ్యలా సామాజిక స్పృహ..?

ఏ ఆర్ రెహమాన్ భార్య సైరాకు తమిళం రాకపోతే అదేమైనా నష్టమా సమాజానికి..? ఎవరో ఇద్దరు అమ్మాయిలు మద్యం కొంటున్న వీడియో పెట్టి ‘బాగా తాగండి’ అని కామెంటింది… ఇదేం సామాజిక స్పృహ..? ఎవరో ఓ తెలుగు హీరో తనను బెడ్రూంకు రప్పించుకోవడానికి నానాపాట్లూ పడ్డాడని మరో వ్యాఖ్య… హేమిటో… వైరముత్తు మంచోడు, చిన్మయి మిటూ ఆరోపణలకు ఆధారాల్లేవు అని మరోసారి ఏదో కూసింది… సపోర్ట్ చేయకపోగా, ఇదేం సామాజిక స్పృహో… ఆమె వ్యాఖ్యలన్నీ ఇలాంటి అపరిపక్వ కూతలే… పైగా వీటికి సోషల్ కాన్షియస్‌నెస్ అని పూతలు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions