నందమూరి సుహాసిని, కల్వకుంట్ల కవిత, వైఎస్ షర్మిలమ్మ… తమ అత్తింటి పేర్లు కాదు, పుట్టింటి ఇంటిపేర్లతోనే జనంలో పాపులర్… అలాగే అక్కినేని సుమంత్… నిజానికి తను యార్లగడ్డ సుమంత్… కానీ అక్కినేని సుమంతే అంటారు చాలామంది… అఫ్ కోర్స్, కొందరు నాగసుమంత్ అని కూడా రాస్తుంటారు… ఇదెందుకు గుర్తొచ్చిందంటే… ఆమధ్య కార్తీకదీపం ఫేమ్, కాబోయే నిర్మాత ప్రేమి విశ్వనాథ్ సుమంత్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ… ‘మై ఫేవరెట్ హీరో సుమంత్’ అని సంభోదిస్తూ తాము నిర్మించబోయే ‘అనగనగా ఓ రౌడీ’ చిత్రంలో సుమంత్ నటించబోయే వాల్తేరు శీను ఫోటోను కూడా గ్రీటింగ్స్‌కు యాడ్ చేసింది… ఇదీ ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… బహుశా సుమంత్ కెరీర్‌ను ఇటోఅటో తేల్చబోయే చివరి సినిమా అదే కావచ్చు… ఎందుకంటే..? తాజాగా విడుదలైన తన సినిమా కపటధారి కూడా పెద్దగా క్లిక్కయ్యేలా లేదు… బోల్తా కొట్టినట్టే… ఈమధ్య ‘ముచ్చట’లో ఓ స్టోరీ… 1999 నుంచీ ఓ మంచి సూపర్ హిట్ సినిమా కోసం సుమంత్ ఎలా మొహం వాచిపోయి ఉన్నాడో, ఇంత సుదీర్ఘకాలం తన్లాడిన హీరో మరొకరు లేరు అనేది ఆ స్టోరీ… కాస్త ఎక్కువ అయ్యిందేమో అనిపించింది కానీ… కపటధారి చూశాక ఆ స్టోరీ వాజీబే అనిపిస్తోంది… ఇదీ ఆ స్టోరీ లింకు…
భేష్… అలుపెరగని ఆశావాది..! అనగనగా ఈ పట్టువదలని విక్రమార్కుడు..!
Ads
నిజానికి అల్లరి నరేష్‌కూ, సుమంత్కూ తేడా అదే… ఇద్దరూ సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచే వచ్చారు… నరేష్ తనకంటూ ఓ జానర్ ఎంచుకుని కొన్నేళ్లు లైమ్ లైట్లో ఉన్నాడు… మాస్, ఇమేజీ, ఫార్ములా హీరోయిజం వైపు వెళ్లలేదు… ఇప్పుడు వరుస ఫెయిల్యూర్ల తరువాత ఆత్మవిమర్శ చేసుకుని, జానర్ మార్చుకుని, నాంది వంటి చాలెంజింగ్ రోల్ ఎంచుకుని, సవాల్‌గా తీసుకుని, నటనకు మెరుగులు పెట్టుకుని, బాట మార్చుకున్నాడు… అది తనకు ఫాయిదా ఇచ్చింది… సుమంత్ చేయలేకపోయిన పని ఇదే… ఉదాహరణ ఈ కపటధారి సినిమా… ఇందులో ఏముందని ఈ పాత్రను ఎంచుకున్నట్టు సుమంత్… ఓ సాదాసీదా హీరో పాత్ర… సుమంతే అక్కర్లేదు దానికి… మొన్నటి బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్, అభిజిత్, సొహెయిల్ కూడా సరిపోతారు…
ఏ కారణాలు అనుకూలించాయో గానీ కన్నడంలో ఇది హిట్ సినిమాయే… క్రైం ఇన్వెస్టిగేషన్ మీద ఇంట్రస్టున్న ఓ ట్రాఫిక్ పోలీసు సొంతంగా కష్టపడి ఓ నలభయ్యేళ్ల పాత కేసు చేధిస్తాడు… స్థూలంగా చూస్తే మంచి ప్లాటే… కానీ సినిమా కథనంలో బోలెడన్ని లాజిక్ లెస్ సీన్లు పంటికింద రాళ్లలా ఇబ్బంది పెడతాయి… ఓ మంచి విజయం కోసం కరువులో ఉన్న సుమంత్ ఈ పాత్ర జోలికి పోకుండా ఉండాల్సింది… ఎలాగూ రీమేకే కాబట్టి ఇంకేదైనా డిఫరెంట్ రోల్ ఉన్న సినిమాను ఎంచుకుంటే బాగుండేది… అందుకే నరేష్ నాందితో పోల్చింది… వెతికితే బోలెడు దొరికేవి… ఈ సినిమాలో హీరోయిన్ ఎందుకు ఉన్నదో, అసలు నందిత ఈ పాత్రను ఎందుకు చేసిందో ఆమెకే తెలియాలి… దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి కూడా ఆ కన్నడ కపటధారిని తెలుగైజ్ చేయడంలో చేతులెత్తేశాడు… వెరసి సుమంత్ కెరీర్లో చేరిన మరో చేదు గుళిక… అందుకే చెప్పింది, వాల్తేరు శీను తాడోపేడో తేల్చబోతున్నాడు అని…!!
Share this Article