Bp Padala… పోస్ట్ ఏమిటంటే…? ఈ కథ రాసిన తల మాసినవాడెవడో కానీ most immature story line in decades . It deserves to be a super flop . If you don’t guess the movie name , you are unfit to be Telugoofs ….
ఇదీ పోస్టు… అవును, సినిమా పేరు మీకు ఇట్టే అర్థమవుతుంది, ఈమధ్య వచ్చిన ఓ సిల్లీ కథాచిత్రం అందరికీ తెలుసు… అసలే వరుసగా ఢక్కామొక్కీలు తింటున్న ఓ క్రేజీ హీరో ఆ కథను ఎలా యాక్సెప్ట్ చేశాడో తన ఫ్యాన్స్‌కే అర్థం కాలేదు… పైగా కొత్త దర్శకులకు చాన్స్ ఇవ్వలేను, బడ్జెట్ లెక్కలు వర్కవుట్ కావు అని మరో కంట్రవర్సీ స్టేట్‌మెంట్…
ఏ బడ్జెట్ లెక్కల్లో తేజ సజ్జు ఇమిడాడు… హనుమాన్ ఎంత సూపర్ హిట్టో తెలుసు కదా… సింపుల్ ఉదాహరణ… కథలో దమ్ముండాలి… ట్రెండ్‌కు తగినట్టు ఉండాలి… అంతేతప్ప ఏదో పిచ్చి కథను జనం మీద రుద్దుదాములే, జనం పిచ్చోళ్లు అనుకుంటే ఎహె పోవోయ్ అంటారు…
Ads
ఆ పోస్టుకు మిత్రుడు Prabhakar Jaini స్పందన ఏమిటంటే..? ‘‘ఈ మధ్య తెలుగులో వచ్చే సినిమా కథలన్నీ అంతే కదా? మరి అటువంటప్పుడు మేమనుకోవాలి? మీరు చూసిందా? మేము చూసిందా? ప్రజలు చూసిందా? క్రిటిక్స్ చూసిందా? రివ్యూయర్స్ చూసిందా? ఫ్యాన్స్ చూసిందా? హీరో ఫ్యాన్సా? హీరోయిన్ ఫ్యాన్సా? నిర్మాత ఫ్యాన్సా? మీ ఫేవరేట్ హీరోదా? మా ఫేవరేట్ హీరోదా? ఇన్ని permutations and combinations మధ్య మీరు మనసులో ఏ సినిమా గురించి అనుకుంటున్నారో మాకెలా తెలుస్తుంది సార్?
తెలుగు సినిమా కథల మీద, నాణ్యతల మీద, టేకింగుల మీద, బడ్జెట్ల మీద ఎంత నిశిత చర్చ జరిగితే అంత ఇండస్ట్రీకే మేలు… అప్పుడే హీరో, డైరెక్టర్ తమ కోట్ల రెమ్యునరేషన్ నుంచి బయ్యర్లకు రిటర్న్ ఇచ్చే దురవస్థ తప్పుతుంది…
Share this Article