విదేశీ భావజాలం, మద్దతు… విదేశాల కనుసన్నల్లో పార్టీల అడుగులు… ప్రత్యేకించి శత్రుదేశం ఆదేశాలకు అనుగుణంగా ఓ పార్టీ ఆలోచనలు… పడికట్టు పదాలు… వృద్ధనాయకత్వం… పట్టించుకోని కొత్తతరం… దేశీయ పరిస్థితులకు అనుగుణంగా మారని, మార్చుకోలేని అవే పాచినీటి సిద్ధాంతాలు… వెరసి లెఫ్ట్ వెలిసిపోతోంది…
ఒకప్పుడు కాంగ్రెస్‌కు దీటైన ప్రత్యామ్నాయం లెఫ్ట్… తరువాత చీలికలు పేలికలై… ఇప్పుడు ఉనికి కోసం తన్లాట… కాస్తో కూస్తో త్రిపుర, బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కనిపించేది… మమత రౌడీ దెబ్బలకు బెంగాల్ సీపీఎం కకావికలై, ఇక కోలుకోలేని స్థితికి చేరుకుంది… మమతకు ప్రత్నామ్నాయం అక్కడ బీజేపీయే… కానీ సీపీఎం కాదు…
త్రిపుర ఎప్పుడో పోయింది, ఇక లెఫ్ట్ చేతికి రాదు… కేరళలో మాత్రం రెండోసారి అసెంబ్లీ అధికారంలోకి వచ్చి కాస్త వెలిగింది… కానీ సీఎం కూతురు, అల్లుడి ఆర్థిక వ్యవహారాలు, బంగారం స్మగ్లింగులో సీఎంవో అధికారి హస్తం, అడ్డదిడ్డం నిర్ణయాలు, ఇక్కడి ప్రజల మనోభావాలను పట్టించుకునే దురుసు ధోరణితో… కేరళలోనూ ప్రభ కొడిగట్టుతోంది… కేవలం ఒక్క సీటు గెలుచుకుంది లెఫ్ట్ ఈ ఎన్నికల్లో…
Ads
18 సీట్లతో యూడీఎఫ్ మళ్లీ పుంజుకోగా, ఎన్నడూ లేనిది ఈసారి బీజేపీ కూడా ఓ సీటు గెలుచుకుంది… లెఫ్ట్ చట్రం బద్దలవుతోంది… పేరుకు ఇండికూటమిలోనే ఉంటారు, కానీ కాంగ్రెస్- లెఫ్ట్ కేరళలో కొట్టుకుంటారు… ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ… క్రెడిబులిటీ లేని రాజకీయం… అదేమంటే బీజేపీని నిలువరించడానికి అనే ఓ సాకు… ఎత్తుగడ అంటారు, వ్యూహం అంటారు, జనం ఇలాగే గుడ్ బై చెప్పేస్తుంటారు…
మిత్రుడు Nationalist Narasinga Rao చెబుతున్న కొన్ని వివరాలు చూడండి ఓసారి… బీజేపీ బలం తగ్గింది, మోడీని జనం తిరస్కరించారు అనే మాటలు గాకుండా… మన గోచీబట్ట ఊడిపోతుందనే నిజాన్ని గ్రహించండి… అంగీకరించండి…
1952 -16
1957-27
1962-29
కమ్యూనిస్టులు సీపీఐ సీపీఎం గా చీలిపోయారు….
1967- (23+19)
1971 (23+25)
1977 (7+22)
1980 ( 10+37)
1984 (6+22)
1989 (12+33)
1991 (14+35)
1996 (12+32)
1998 (9+32)
1999 (4+33)
2004 (10+43)
2009 (4+16)
2014 (1+9)
2019 (2+3)
2024 (2+4)
2004లో ఏకంగా 53 స్థానాలు… తక్కువ ఫిగరేమీ కాదు… ఇప్పుడు ఏకంగా జాతీయ పార్టీలనే గుర్తింపును కూడా కోల్పోయే దురవస్థ… సీపీఐ ఆల్రెడీ ఆ ప్రమాదంలో పడగా, ఇప్పుడు సీపీఎం కూడా అదే బాటలో ఉంది… ఈసారి సీపీఎం గెలిచిన నాలుగు స్థానాల్లో రెండు తమిళనాడు, డీఎంకే వోట్ల పుణ్యం… ఒకటి కేరళ… మరొకటి రాజస్థాన్ (?)…
ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కేరళలో దారుణమైన ఓటమిని చవిచూడాల్సిందే… తెలుగు రాష్ట్రాలకు వస్తే తెలంగాణలో సీపీఐ ఒక సీటు, అదీ కాంగ్రెస్ వోట్ల పుణ్యమే… ఏపీలో పొత్తు ఆటలు ఆడటానికి ఇప్పుడు ఏ పార్టీ దొరకడం లేదు… ఎస్, ఇదే దురవస్థ… ఎంతసేపూ ఎవరికి తోకలుగా మారిపోదామనే తపన తప్ప… ప్రక్షాళన, మథనం, మార్పులతో మారాలనే సోయి మాత్రం తప్పింది… వెరసి లెఫ్ట్ ఉనికే ప్రశ్నార్థకమవుతోంది… స్వయంకృతం..!! వామపక్ష అభిమానులకు ఇదంతా హార్ష్‌గా అనిపించినా సరే, రియాలిటీ మాత్రం ఇదే, నిజమెప్పుడూ నిష్టురమే..!!
Share this Article