ఇదే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో వచ్చిన చిక్కు… భారతీయుడు-2 సినిమాకు ఆంధ్రలోనే అదనపు ఆటలు, అదనపు రేట్లకు పర్మిషన్ దొరకలేదట… సినిమా కుటుంబానికి చెందిన సీఎం, డిప్యూటీ సీఎం ఉన్న ఆ రాష్ట్రమే ఆ దరఖాస్తును తిరస్కరిస్తే… మరి తెలంగాణ ప్రభుత్వం ఆ తమిళ సినిమాకు (తమిళ సినిమాయే, తెలుగులోకి కేవలం డబ్డ్ వెర్షన్ మాత్రమే వస్తోంది…) ఎందుకు అడ్డగోలు రేట్ల పెంపుదలకు పర్మిషన్ ఇచ్చినట్టు… ఎందుకు అదనపు షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు..?
అసలు సినిమాలకు అదనపు టికెట్ రేట్లు పెంపు, అదనపు షోలకు పర్మిషన్ ఇవ్వడమే ప్రేక్షకుడి కోణంలో తప్పు… మరి ఒక ప్రభుత్వం ఆ తప్పుని సపోర్ట్ చేస్తూ జీవోలు ఇవ్వడం ఏమిటి..? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించడం లేదా…? తనను బ్యూరోక్రాట్లు పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారా..? లేక ఇండస్ట్రీ అడిగిన ప్రతి గొంతెమ్మ కోరికను నెరవేర్చకపోతే ఇండస్ట్రీ ఏపీకి తరలిపోతుందని కేసీయార్‌లాగే తప్పుడు సందేహాల్లో ఉన్నాడా సీఎం..?
ఇండస్ట్రీ ఏపీకి తరలిపోయేంత సీన్ లేదు… టాలీవుడ్‌కు హైదరాబాదే సేఫ్ అడ్డా… అన్ని సౌకర్యాలు పుష్కలం… స్టూడియోలు సహా అన్నిరకాల చిత్రీకరణ సౌకర్యాలున్నయ్ ఇక్కడ… ఏ అవసరానికీ ఎక్కడికీ పోనక్కర్లేదు… నిజానికి ఈ భారతీయుడు సినిమా అప్పుడెప్పుడో స్టార్టయింది… ఆగిపోయింది…
Ads
కమలహాసన్‌ను నానారకాలుగా బతిమిలాడి, ఒప్పించి, తిరిగి షూటింగ్ చేయించి, ఎలాగోలా నానా కష్టాలూ పడి రిలీజు దాకా తీసుకొచ్చారు… నిజానికి కమలహాసన్ మీడియా మీట్ మాటల్లోనే తనకు పెద్ద ఇంట్రస్టు లేనట్టు అనిపించింది… అసలు తమిళనాడులో సినిమా పట్ల హైప్ లేదు, అడ్వాన్స్ బుకింగులు చాలా పూర్… ఇప్పటికిప్పుడు కల్కి విజృంభణ నేపథ్యంలో భారతీయుడు అనే అవినీతి పట్ల జీరో టాలరెన్స్ ఓ పాత కాన్సెప్టు క్లిక్కయ్యే సూచనలు కూడా లేవు…
ఓకే, మౌత్ టాక్ బాగుంటే ఏమైనా క్లిక్కయ్యే చాన్సులు ఉండొచ్చు… కానీ ట్రెయిలర్లు, పాటలు ఆ దిశలో ఆశలు రేకెత్తించడం లేదు… దర్శకుడు కూడా ఏదో ఇస్తినమ్మ వాయినం అన్నట్టుగా పూర్తి చేశాడంటున్నారు… ఈ సినిమాకు ఏపీలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఆసియన్ సునీల్, సురేష్ బాబు, శిరీష్ తీసుకున్నారట, సురేష్ బాబు నైజాం తీసుకున్నాడు… నిజానికి సురేష్ బాబుకూ చంద్రబాబుకూ నడుమ సత్సంబంధాలే ఉండేవి…
విశాఖలో సురేష్ ప్రొడక్షన్స్‌కు భారీ విస్తీర్ణంలో భూములిచ్చాడు చంద్రబాబు… రామానాయుడు కూడా గతంలో టీడీపీ నాయకుడే… మరి సురేష్ బాబు దరఖాస్తు కూడా తిరస్కరణకు గురికావడం ఏమిటో ఇండస్ట్రీ సర్కిళ్లలో అంతుపట్టడం లేదు… ఏమో, చంద్రబాబుకూ సురేష్ బాబుకూ నడుమ ఎందుకో దూరం పెరిగినట్టుంది… జగన్ చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు నెగెటివ్ గా స్పందించడమా..?! పోనీలే, ఇలాగైనా ఏపీ ప్రేక్షకుడి పర్సు సేఫ్ తాత్కాలికంగా..!!
Share this Article