Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పటి సంచలనం… ఇప్పటి మీడియాకూ తెలియదేమో ఈ కథ…

July 21, 2024 by M S R

సంచలనాల చిరునామా 1974 లో వచ్చిన ఈ తాతమ్మ కల సినిమా . తెలుగు సినిమా రంగంలో నిషేధానికి గురయిన మొదటి సినిమా కూడా ఇదేనేమో ! నారు పోసిన వాడే నీరు పోస్తాడు అనే నమ్మకం ఇప్పటికీ చాలామందికి ఉంటుంది . ఒకప్పుడు భగవంతుడు ఇచ్చే సంతానాన్ని నియంత్రణ చేయటానికి మనమెవరం అనే భావన ఎక్కువగా ఉండేది .

ఆ బాటలోనే ఈ సినిమాలో కుటుంబ నియంత్రణకు , భూసంస్కరణలకు వ్యతిరేకంగా డైలాగులు ఉండటం పెద్ద దుమారమే లేచింది . ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సైతం చర్చించబడింది . నిషేధానికి గురయింది . చిత్ర నిర్మాత కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇవ్వటం , మరల అనుమతి పొందటం , రెండవసారి విడుదల కావటం సంచలనమే ఆరోజుల్లో . యాభై రోజులు ఆడాక ప్రదర్శన నిలపబడటం అదే మొదటిసారేమో ! (కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న అంశాల్ని కాస్త మార్చి, మళ్లీ సెన్సార్ అనుమతి తీసుకుని రీరిలీజ్ చేశారు)

ఆ సంచలనాన్ని పక్కన పెడితే , బాలకృష్ణ నటించిన మొదటి సినిమా ఇదే . NTR అంతటి మహా నటుడు ఉన్నా , ఆయనే నిర్మాత దర్శకుడు అయినా సినిమాకు భానుమతి షీరో కావడం , ఆమెకు అంత స్పేస్ ఇవ్వటం గొప్ప విశేషమే . Hats off to NTR .

Ads

గ్రామాల్లో పెద్ద పెద్ద ఆసాములు వ్యవసాయం చేయలేక , కనీసం పిల్లలకు విద్యాబుద్ధులు అయినా ఏర్పడతాయని బస్తీలకు చేరటం చుట్టూ ఉంటుంది సినిమా . దానికి మించి తాతమ్మ సెంటిమెంట్ . తాతమ్మ కల అంటే భానుమతి సినిమాయే .

భానుమతి పక్కన ఎవరు నటించాలన్నా బిక్కుబిక్కుమంటూ నటించాల్సిందే . ఒక్క NTR మాత్రమే ఢీ అంటే ఢీగా నిలపడగలడు . ఈ సినిమాలో కోరమీసం కుర్రోడా పాటలో ఆ కెమిస్ట్రీ కనిపిస్తుంది . ఇద్దరూ పోటాపోటీగా నటించారు ఈ పాటలో .

యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టయ్యాయి . సినిమా ప్రారంభంలోనే కొసరాజు విరచిత భానుమతి పాడే ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు పాట చాలా బాగుంటుంది . ఆయన వ్రాసిందే మరో పాట అయ్య లాలీ ముద్దులయ్య లాలీ పాట కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది .

NTR – కాంచనల మీద చిత్రీకరించబడిన శెనగపూల రెయికాదానా జారుపైటా చిన్నదానా చాలా బాగుంటుంది . కొసరాజు గారి జానపద , గ్రామీణ , రొమాంటిక్ స్పృహకు ప్రతీక . ఏమండీ వదిన గారు చెప్పండి కాస్త పాట వదిన మరదళ్ళ సరసాన్ని చక్కగా చూపించారు .

రాజబాబు మీద హరే రామ హరే కృష్ణ హిప్పీ పాట విజయవాడ సంగ్రామ చౌక్ సెంటర్లో షూట్ చేయబడింది . సినిమాలో విజయవాడ లొకేషన్స్ చాలా ఉంటాయి . NTR , భానుమతి , కాంచన , హరికృష్ణ , బాలకృష్ణ , రోజారమణి , రమణారెడ్డి , శుభ , కాశీనాధ్ తాతా , మాడా , విజయలలిత , రాజబాబు ప్రభృతులు నటించారు .

సినిమా కధాంశం మీద అంత వివాదం ఏర్పడినా , ఉత్తమ కధగా నంది అవార్డు రావటం విశేషమే . NTR తాతమ్మకు బైరాగుల్లో కలిసి మళ్ళా వెనక్కు వచ్చే భర్తగా , మనమడిగా రెండు పాత్రల్ని ధరించారు . సంగీతపరంగా , భానుమతి నటనాపరంగా ఓ గొప్ప సినిమాయే .

మాతరంలో చూడనివారు ఎవరూ ఉండరు . ఈతరంలో ఎవరయినా ఉంటే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . టైం లేకపోతే భానుమతి-NTR కోరమీసం కుర్రోడా పాట వీడియో వరకయినా ఆస్వాదించండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…………….    ( By    దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రోహిణి సింధూరి..! చీట్… నో క్లీన్ చిట్…! శుద్ధపూస ఏమీ కాదట..!!
  • యువ సన్యాసి విషాదకర మరణం… విషాదంలో జైన సమాజం…
  • అందరూ ఆడుకునేవాళ్లే..! అమరావతి రాజధాని ఓ విషాదగాథ…
  • శని అంటే శని… అంతే… ఎవరూ అతీతులు కాదు… ఐదూళ్ల కథ కూడా…
  • మోటోక్రాస్ రేసింగ్..! టెక్నికల్లీ హైస్టాండర్డ్స్… ఎమోషనల్లీ వీక్…!!
  • పాండవులు అడిగారు ఐదూళ్లు… ఇప్పుడు తెలంగాణ అడుగుతోంది…
  • రకాస ముచ్చట… దెయ్యాల కోటలో పెళ్లి ఆపిన పెళ్లికాని ప్రసాదు..!
  • హిందీ రాముడికన్నా మన తెలుగు రాముడే బాగున్నాడు..!!
  • హీరో రాజేంద్రప్రసాద్ మరో పెళ్లాం… కానీ పెద్దగా అచ్చిరాలేదు పాపం…
  • ఇప్పుడంటే సిలిం‘డర్’… కానీ అప్పట్లో బాబును గెలిపించిన గ్యాస్ బుడ్డి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions