Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ రామాయణంలో బాల రావణుడు కూడా ఉన్నాడండోయ్ !!

November 3, 2026 by M S R

.

మనకు బాలరాముడు తెలుసు… దివ్యమైన విగ్రహంతో అయోధ్యలో కోట్ల మంది మొక్కుల్ని అందుకుంటున్నాడు… మరి బాల రావణుడు..? చాలామందికి తెలియదు కదా… త్వరలో విడుదలయ్యే రామాయణ సినిమాలో బాల రావణుడూ ఉన్నాడు… అవును మరి, రాముడితోపాటు ఆ సినిమా రావణుడి కథనూ (రావణాయణం?) చెబుతుంది కదా… అందుకే బాల రాముడున్నాడు, బాల రావణుడూ ఉన్నాడు…

మరి సినిమాలో తనెవరు అంటారా..? సాక్షాత్తూ ఆ సినిమా నిర్మాత కొడుకే… నమిత్ మల్హోత్రా పెద్ద కుమారుడు రాఘవ్ మల్హోత్రా!  యశ్‌ రావణుడికి అచ్చు జిరాక్స్‌ కాపీలా ఉన్నాడట సినిమాలో!

Ads

సినిమా రంగంలో వారసత్వం కొత్తేమీ కాదు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల పిల్లలు తెరపైకి రావడం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం మరొకటి ఉంది. తండ్రి నిర్మిస్తున్న వేల కోట్ల భారీ ప్రాజెక్టులో కొడుకుకు ఓ కీలకమైన పాత్ర దక్కింది. అది కూడా రామాయణంలో అత్యంత శక్తిమంతమైన ప్రతినాయకుడైన రావణుడి బాల్య పాత్ర!

యశ్‌కు దగ్గర పోలికే ఎంపికకు కారణమట!
నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ’ సినిమాలో రావణుడి పాత్రను యశ్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రావణుడి బాల్య రూపం కూడా సినిమాలో కనిపించనుంది. ఈ పాత్ర కోసం రాఘవ్ మల్హోత్రాను ఎంపిక చేసినట్లు తాజాగా ఎన్డీటీవీ కథనం వెల్లడించింది.

దీనికి కారణం కేవలం అతను నిర్మాత కుమారుడు కావడం మాత్రమే కాదట. పెద్దయ్యాక రావణుడిగా కనిపించే యశ్‌కు, చిన్నప్పటి రూపంలోనూ సహజమైన పోలిక ఉండాలన్నది చిత్ర బృందం ఆలోచన. రాఘవ్ శరీరాకృతి యశ్‌ను పోలి ఉండటంతో అతడిని ఎంపిక చేసినట్లు సినిమా యూనిట్‌కు సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఎన్డీటీవీకి వెల్లడించాడుట.

ఆయన చెప్పిన మాటల్లోనే చెప్పాలంటే… రాఘవ్ శరీరాకృతి యశ్‌తో ఎంతగా సరిపోతుందంటే, దాదాపు యశ్‌కు బాడీ డబుల్‌లా కనిపిస్తాడట!

ఎవరీ నమిత్ మల్హోత్రా?
రాఘవ్ తండ్రి నమిత్ మల్హోత్రా సాధారణ నిర్మాత కాదు. ప్రపంచవ్యాప్తంగా విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో పేరొందిన డీఎన్‌ఈజీ (DNEG) సంస్థతో ఆయనకు అనుబంధం ఉంది. ప్రైమ్ ఫోకస్ సంస్థ ద్వారా భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయి సాంకేతికతను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు తన కలల ప్రాజెక్టుగా భావిస్తున్న రామాయణాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. ఇదంతా తెలిసిన కథే కదా…

అలాంటి నిర్మాత కుమారుడికి తన తండ్రి నిర్మిస్తున్న సినిమాలో అవకాశం రావడం సహజంగానే చర్చకు దారితీస్తుంది. అయితే ఈ సందర్భంలో రాఘవ్ ఎంపికకు యశ్‌తో ఉన్న శారీరక పోలిక కూడా కారణమని చిత్ర వర్గాల సమాచారం చెబుతోంది. కేవలం నిర్మాత కుమారుడనే కారణంతోనే పాత్ర దక్కిందని చెప్పడానికి ఆధారాలు లేవు.

.
రావణుడి పాత్రను ఎందుకు ఎంచుకున్నాడు యశ్?
ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన అంశం యశ్ ఎంపిక. కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యశ్‌కు రాముడి పాత్ర చేసే అవకాశం ఉన్నా, రావణుడిగా నటించడానికే మొగ్గు చూపాడు…

రాముడి గొప్పతనం ప్రేక్షకులకు అర్థం కావాలంటే రావణుడి ప్రతినాయకత్వం కూడా అంతే బలంగా ఉండాలని ఆయన అభిప్రాయం… రాముడి మంచితనాన్ని చూపించడానికి రావణుడి చెడుతనం అవసరమన్నది యశ్ చెప్పిన మాటల్లోని భావం… అందుకే ఈ సినిమాలో రావణుడిని కూడా ఒక శక్తిమంతమైన పాత్రగా చూపించబోతున్నారన్న ఆసక్తి నెలకొంది.

రావణుడిగా యశ్ ఎలా మెప్పిస్తాడో చూడాలి… అంతకంటే ముందు యశ్ చిన్నప్పటి రూపంలో రాఘవ్ ఎలా ఉంటాడో చూడాలన్న ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో మొదలైంది..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హైకోర్టు సూమోటోగా తీసుకుని- కలెక్టర్‌ను అడగాలి అసలు కథేమిటో…
  • ఈ రామాయణంలో బాల రావణుడు కూడా ఉన్నాడండోయ్ !!
  • రేవంత్ రెడ్డిపై BRS, BJP ఉమ్మడి పోరాటం – అమిత్ షా రాక వెనుక !?
  • ఈ ముఖ్యమంత్రి గారి రెండో పెళ్లి వెనుక చాలా పెద్ద కథే ఉంది…!!
  • తెలంగాణ కర్రసాముకు జాతీయ గుర్తింపు! ఖేలో ఇండియాలో చేర్పు!!
  • ఒకప్పుడు మద్యం మాఫియా అడ్డా… ఇప్పుడు కేసినోల జూదనగరి!
  • పోలీసు ఉద్యోగం చేస్తోంది… కానీ పోలీసులా బతకడం లేదు… మరెలా..?
  • విలన్లందరూ మంచోళ్లేనట..! మీరెక్కడ తయారయ్యారురా బాబూ..!!
  • ఇదీ సుగర్ వ్యాధిని తరిమికొట్టే దిశలో నిజమైన ముందడుగు!!
  • త్రివిక్రమ్..! ఏమాత్రం ‘గురూజీ కాదిక… ఓ సాదాసీదా దర్శకుడు మాత్రమే!’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions