రేయ్, ఎవుర్రా మీరంతా..? అనే పాపులర్ డైలాగ్ మన టీవీల్లో, సినిమాల్లో వినిపిస్తూ ఉంటుంది కదా… బిగ్‌బాస్-8 షో కంటెస్టెంట్లను, వాళ్ల ధోరణి చూస్తే అలాగే అనిపిస్తోంది… ఎవరూ పెద్ద నోటెడ్ పర్సనాలిటీలు కారు… రఫ్‌గా చెప్పాలంటే, ఏదో హడావుడిగా కంటెస్టెంట్లను ఎంపిక చేసేసి, హౌజులోకి తోసేసినట్టుగా ఉంది…
ఆర్జీవీ డెన్ నుంచి ప్రతి సీజన్లో ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తారు కదా… ఆషురెడ్డి, అరియానా, ఇనయా … ఇలా… ఈసారి ఆకుల సోనియా… మంథని రైతు బిడ్డ.., బీటెక్, ఎల్ఎల్బీ… నటి… సోషల్ వర్కర్, కరాటే ఫైటర్… వాట్ నాట్..? సేఫ్ గేమ్ ఆడకుండా వాయిస్ రెయిజ్ చేస్తోంది, పాయింట్ పట్టుకుంటోంది, చెప్పదలుచుకున్నది సూటిగా చెబుతోంది, మొదటి రోజు నుంచే యాక్టివ్‌గా తెర మీద కనిపిస్తోంది… టఫ్ కంటెస్టెంట్…
నిఖిల్, యష్మి తెలుగు టీవీ సీరియళ్లు చూసేవాళ్లకు కాస్త పరిచయం తప్ప, మిగతావాళ్లలో ఎవరూ పెద్దగా తెలియదు… ఆదిత్య ఓం ఉన్నాడా అన్నట్టుగానే ఉండగా… శేఖర్ బాషా రేడియో శ్రోతలకు పరిచయం ఉన్న పేరు… మణికంఠ ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదు, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు గానీ చాన్నాళ్లు ఉండడు…
Ads
కాస్త ఏజ్ బార్ వాళ్లను మొదట్లోనే పంపించేస్తారు కాబట్టి బేబక్క కూడా టెంపరరీయే అనిపిస్తోంది… పైగా ఆమెను అందరూ టార్గెట్ చేస్తున్నారు ఎందుకో మరి..! ప్రేరణ, యష్మి, నైనిక ఎందుకలా అరుస్తున్నారో వాళ్లకే తెలియాలి… బిగ్‌బాస్‌లో గొడవపడటం అంటే అరుపులు కాదు… రెండో వారానికే ఈ షో టీఆర్పీలు దారుణంగా ఉండబోయే సూచనలే కనిపిస్తున్నాయి వీళ్ల ధోరణి చూస్తే… ప్రేరణ అరుపులైతే మరీ కుక్కల కొట్లాటలా అనిపించింది ఓ దశలో…
నిఖిల్ షోను డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు… కానీ సరైన పాయింట్లతో మాట్లాడుతున్నాడు… తను కూడా సోనియాలాగే టఫ్ కంటెస్టెంటే… విష్ణుప్రియ వంటి మిగతావాళ్లు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుంది… కానీ నామినేషన్లు అనే ప్రక్రియే అందరినీ గొడవల్లోకి లాగడం… ఒకరి మీద ఒకరిని ఉసిగొల్పడం… సో, సేఫ్ గేమ్‌తో నాలుగు వారాలు సేఫ్‌గా హౌజులో ఉండొచ్చు అనేది ఓ భ్రమ…
గత సీజన్లో ప్రియాంక, శోభ, అమర్దీప్లాగా ఈ సీజన్లో కూడా టీవీ నటులు ఓ కూటమిగా మారే సూచనలున్నాయి… ఈ పిచ్చి కేకలు కాదు, ఇంగ్లిషులో కాట్లాడుకోవడం కాదు… బిగ్‌బాస్ షో ప్రేక్షకులు వినోదాన్ని కూడా ఆశిస్తారు… గత సీజన్లో దాన్ని లేకుండా చేసి టీఆర్పీల్లో దారుణంగా భంగపడేట్టు చేసింది క్రియేటివ్ టీం… ఈసారి టీం మారిపోయి ఏదో హిందీ టీం వచ్చిందీ అంటున్నారు… వాళ్లు కూడా గత సీజన్ బాటలోనే నడిస్తే… ఈసారీ భంగపాటు తప్పేట్టు లేదు..!!
Share this Article