Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బుడమేరు ముంపును మించి… ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌కు బురద ముంపు..!!

September 9, 2024 by M S R

అపార్థం చేసుకోవద్దు… అది ఇప్పుడు పక్కా మడ్ హౌజ్… మొదట్లో కాస్త బాగానే ఉండేది… మరీ సీపీఐ నారాయణ పదే పదే తిట్టినట్టుగా వ్యభిచార కొంపలా కాదు గానీ… మెల్లిమెల్లిగా ఆ తరహా బూతు వైపు తీసుకెళ్తున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు… గత టీమ్స్‌కు భిన్నంగా ఈసారి ఏదో ముంబై టీమ్‌ను దింపారట కదా… థూ, పాతవాళ్లకు ఏమీ చేతకాలేదు, ఇక చూడండి, మేమెంత బురదను నింపుతామో అన్నట్టుగా వెళ్తున్నారు…

గతంలో సరయూను కూడా హౌజులోకి తీసుకొచ్చారని గుర్తు… తెలుసు కదా వెగటు ప్లస్ వెకిలి ప్లస్ బూతు ప్లస్ బురద వీడియో కేరక్టర్… ఆమెకు తోడుగా కనిపించే కిరాక్ సీతను పట్టుకొచ్చారు ఈసారి… ఆమెకు తోడుగా విష్ణుప్రియ… ఇక చూసుకొండి, ఈసారి బురద వరదై పారాల్సిందేనని ఫిక్సయినట్టున్నారు…

ఆల్రెడీ విష్ణుప్రియ మొదలెట్టేసింది కదా… పుణ్యస్త్రీ రచ్చ… ఆ మొహానికి ఏ పదాలకు అర్థాలేమిటో తెలియవు… కేరక్టర్ చర్చను కావాలనే బిగ్‌బాస్ టీమ్ ప్రవేశపెట్టినట్టుంది… కానీ ఆ డోస్ సరిపోదు కదా ప్రస్తుత టీమ్ బురద ప్రణాళికలకు… నాగార్జునతో ఓ మాట అనిపించారు… కిరాక్ సీత అంటే ఏదేదో అనుకున్నాడట తను, కానీ నిరాశపరుస్తోందట… అంటే యథేచ్ఛగా బురదను పారించు అని పరోక్షంగా చెబుతున్నాడా..? ఆల్రెడీ ఆమె బొక్క వంటి పదాల్లోకి దూకింది… ఇక్కడ విక్టిమ్ సోనియా…

Ads

ఫాఫం, నాగార్జున… చివరకు బిగ్‌బాస్ అనే వెగటు బ్యాచ్ ఏది చెబితే అది మాట్లాడుతూ తన ఇజ్జత్ తీసుకుంటున్నాడు… ఇది ఎన్ కన్వెన్షన్ హాల్ కూలిపోవడంకన్నా పెద్ద నష్టం… తనకు అర్థమవుతున్నట్టు లేదు… అదేదో పిచ్చి వెబ్ సీరిస్‌లో రానా, వెంకటేష్ కూడా బూతు డైలాగులతో పూర్తిగా పరువు పోగొట్టుకున్నారు తెలుసు కదా…

ఈసారి నామినేషన్లకు ఏదో తల మీద రంగు బురద పోయడం అట… దరిద్రపు గలీజు ఆలోచన… ఇదేం పైత్యంరా స్వామీ… సరే, దాన్నలా వదిలేస్తే ఇక రాను రాను విష్ణుప్రియ, కిరాక్ సీత వంటి కేరక్టర్లు రెచ్చిపోతే… ఆకుల సోనియా వంటి కేరక్టర్లకు ఇబ్బందే… ఇమడలేదు… తను ఫిట్ కాలేదు ఈ బురద గోతిలో… ఇక్కడ పుణ్యస్త్రీ వంటి అంచనాల్లోకి వెళ్లడం లేదు… కాకపోతే ఆమె తత్వం అలా కనిపిస్తోంది… త్వరలో ఎలిమినేట్ కావడం ఖాయమే అనిపిస్తోంది… విష్ణుప్రియ మళ్లీ ఏదో 18 ప్లస్ కామెడీ అనే పదం వాడింది… తిక్క కేసు… ఇక్కడా విక్టిమ్ సోనియానే… సీత, విష్ణుప్రియ ఇద్దరూ చెడ వాగుతున్నారు… ఇంకా పిచ్చెక్కిస్తారు, గ్యారంటీ…

తెలిసిన సమాచారం మేరకు… బిగ్‌బాస్ టీమ్ ఫేవరెట్ కేరక్టర్లలో ఆదిత్య ఓం, విష్ణుప్రియ కూడా ఉన్నారట… సో, ప్రతిసారీ కాపాడుతూ వస్తారు… వోట్లేసే జనం పిచ్చోళ్లు… అసలే మణికంఠ పిచ్చితో ప్రేక్షకులకు కూడా పిచ్చి లేస్తోంది… దానికితోడు ఇక విష్ణుప్రియ, కిరాక్ సీత కూడా ఇక రెచ్చిపోతే… నాగార్జున నిన్న మార్కులు 35 లోపు వేసి, ఇకనైనా రెచ్చిపోయి 65 మార్కులు తెచ్చుకొండి అని చెప్పాడు కదా… ఇక నైనిక, ప్రేరణ కూడా రెచ్చిపోతే… చూస్కొండి ఈసారి హౌజు బురద ముంపుకి గురికావడమే…!!

అన్నట్టు ఈసారి కూడా కన్నడ కూటమి బాగానే ప్లే చేసేట్టుగా ఉన్నారు… నిఖిల్, యష్మి ఎట్సెట్రా… విష్ణుప్రియ కూడా వాళ్లతో అటాచ్ అయిపోతుంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions