మిత్రుడు Nationalist Narasinga Rao పోస్టు ఒకటి రీడబుల్…
‘‘2009 సెప్టెంబర్ లో YS రాజశేఖర్ రెడ్డి చనిపోయిన దగ్గర నుండి ఓదార్పు యాత్ర… YSRCP ఏర్పాటు… ఉప ఎన్నికల ప్రచారం నుండి అనేక మంది కీలక నాయకులు జిల్లాల ముఖ్యులు జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచారు..
ఆయన జైల్లో ఉన్న 16 నెలలు కూడా ఆయన కుటుంబం వెనుక వెన్నుదన్నుగా నిలబడ్డారు…… సీబీఐ జగన్ మీద కేసులు పెడుతున్నా కూడా ప్రజల్లోకి ఇవన్నీ అక్రమ కేసులు అని బలంగా తీసుకెళ్లారు… వీరిలో కొంతమంది మీద CBI కేసులు పెట్టినా కూడా ధైర్యంగా జగన్ మోహన్ రెడ్డి పక్కనే ఉండి ప్రజల్లో తిరిగారు…
Ads
మరికొంత మంది 2013/14 లలో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీ ఉనికి కష్టం అని భావించి జగన్ పక్కన చేరారు….. వీళ్లంతా 10-14 ఏండ్ల నుండి జగన్ మోహన్ రెడ్డి పక్కన ఉండి ఆయన కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నారు…
2014 లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీయడం, ప్రజా సమస్యలను ఎత్తుకోవడం .. పాదయాత్ర సమయంలో కూడా జగన్ తో నడవడం, సన్నిహితంగా ఉండి పార్టీ అధికారంలోకి రావడంలో ఆయా నియోజకవర్గంలో, జిల్లాలో వారు కొంత పాత్ర పోషించారు…
2019 నుండి 2024 వరకు మంత్రులుగా వివిధ జిల్లాల్లో సీనియర్లుగా అనేక బాధ్యతలు నిర్వహించారు మంచి పోజిషన్ లో….. వాళ్ళ మాట వేదంలా కూడా చెలాయించుకున్నారు ఆయా జిల్లాల్లో…… కానీ వీళ్ళల్లో ఎవరూ కూడా తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టి జనాల్లోకి వచ్చిన దాఖలాలు లేవు… కారణం ఏమిటి?…
వాళ్ళు కూడా జరిగింది వాస్తవం అని మౌనంగా ఉండటం వల్ల అంగీకరిస్తున్నారా? సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవిసుబ్బారెడ్డి, అంబటి రాంబాబు లాంటి వాళ్ళే ఈ వారం నుండి మీడియాలో కనిపించారు …. కానీ జిల్లాల వారీ కీలక నాయకులైన ధర్మాన ప్రసాదరావు కృషదాస్.. బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్ నాథ్… ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి.. పిల్లి సుభాష్ చంద్ర బోస్.. కన్న బాబు… చెల్లుబోయిన….. గ్రంధి శ్రీనివాస్, చెరుకువాడ, శ్రీ రంగనాధ రాజు, కొడాలి నాని, పేర్ని నాని.. కాసు మహేష్ రెడ్డి…. ఆది మూలపు సురేష్…. అనిల్ కుమార్ యాదవ్…. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…. రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి…. అనంత వెంకట్రామరెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ సైలెంట్ గానే ఉన్నారు….. ఒక్కరు కూడా ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి కి మనో ధైర్యం ఇచ్చే ప్రకటన అయితే చేయలేదు…… కారణం ఏమిటి?…
ఇక మన వెర్షన్‌లోకి వద్దాం… భూమన ఏదో తిరుమల వెళ్లి ప్రమాణం అంటూ ఏదో ప్రహసనం క్రియేట్ చేయబోయాడు గానీ… తిరుమలను నానావిధాలుగా అపచారాలపాలు చేసిన అపఖ్యాతిలో తనదే ఎక్కువ పాత్ర… తరువాత సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి… వాళ్లు ఏం జెప్పినా ఎవరూ నమ్మే సిట్యుయేషన్ లేదు… ఇక తప్పనిసరై జగనే తిరుమలకు బయల్దేరాడు…
అప్పుడే కూటమి నుంచి అటాక్ స్టార్ట్… జగన్ అధికారంలో ఉన్నప్పుడు వేరు… ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చి కదులు అంటోంది బీజేపీ పురంధేశ్వరి… ఇక పవన్ కల్యాణ్ ఎదురుదాడి ఎలా ఉండబోతున్నదో చూడాలి… నిజానికి తనే చంద్రబాబుకన్నా బలంగా డిఫెండ్ చేస్తున్నాడు కొవ్వు నూనెల లడ్డూ వివాదంలో… చంద్రబాబు మొన్న కూడా ఎక్కడో అన్నాడు, జగనూ, నువ్వెందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు అని… ఇప్పుడు జగన్ వస్తున్నాడు, చంద్రబాబు డిక్లరేషన్ విషయంలో గట్టిగా పట్టుదలతో వ్యవహరిస్తాడా..? తెలుగు జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..! శ్రీవారి దగ్గరకు రాకుండా గేట్లు మూస్తావా..?
Share this Article