#Isupportdamagundem #Isupportnavyradar ….. ఇదే డిస్‌క్లయిమర్… ఈ దామగుండంలో నేవీ రాడార్ ఏర్పాటు విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు అడుగులు, ఆలోచనలను సంపూర్ణంగా సమర్థిస్తున్నాను… ఈ మాట చెప్పడానికి సందేహం అక్కర్లేదు, తడబాటు అక్కర్లేదు… స్ట్రెయిట్ స్టేట్‌మెంట్…
ఎందుకు..? ఎందుకంటే..? దేశరక్షణ అత్యంత ప్రాధాన్యాంశం కాబట్టి… అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి మరీ కేంద్రం రక్షణ అంశాల్లో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి కాబట్టి… రేవంత్ రెడ్డి సర్కారు అనివార్యంగా తన కర్తవ్యాన్ని తను కొనసాగిస్తున్నది కాబట్టి… కొనసాగాంచాల్సిందే కాబట్టి…
ఇప్పుడు బీఆర్ఎస్ గాయిగత్తర చేస్తోంది… కానీ నిర్ణయం జరిగింది కేసీయార్ హయాంలో కాదా..? ఆ సానుకూల నిర్ణయం తీసుకోకపోతే మోడీ ప్రభుత్వం ఏం చేసి ఉండేది అనేది వేరే చర్చ… కేసీయార్ మెడలు వంచేవాడా మోడీ అనేది వేరే చర్చ… కేసీయార్ ఎన్ని దొంగదెబ్బలు తీస్తున్నా భరించాడు కదా మోడీ…
Ads
ఈరోజుకూ ప్రధాన ప్రజాసమస్యల మీద ఒక్క మాట లేదు, ఫామ్ హౌజ్ వీడడు, స్పందించడు… జనం పిచ్చోళ్లు… అదే కేసీయార్ ధీమా… కేటీయార్‌లు, హరీశ్‌లు కాదు, కేసీయార్ మాట్లాడాలి… నిజంగా నువ్వు దామగుండం నేవీ రాడార్‌ను వ్యతిరేకిస్తున్నావా..? ఆ ప్రకటన చేయి, మోడీ స్పందన చూద్దాం… ప్రధాని కావాలని కలలు గన్న కేసీయార్ మాత్రం కిక్కుమనడు… తన పార్టీ మాత్రం రాజకీయం చేస్తుంది… యాంటీ నేషనల్స్‌తో మాట కలిపి… అచ్చు అదే తరహాలో…
కొత్త కాదు కదా… తను అధికారంలో ఉన్నప్పుడు చేసినవన్నీ పర్‌ఫెక్ట్… చివరకు తెలంగాణ ద్రోహుల్ని నెత్తిన ఎత్తుకుని మోయడంతోపాటు అన్నీ… తను తీసుకున్న నిర్ణయాల్ని ‘ప్రభుత్వం అంటే అది ఓ కంటిన్యుటీ ప్రాసెస్’ అనే భావనతో రేవంత్ రెడ్డి సర్కారు కొనసాగిస్తే మాత్రం అనవసర రచ్చ… ఇప్పుడు ప్రజాస్వామిక హక్కులు, మానవహక్కులు సహా చాలా కనిపిస్తున్నాయి ఆ పార్టీకి…
హైదరాబాద్‌కు ఆక్సిజెన్ ఉండదు, జనం చచ్చిపోతారు, ఔషధ మొక్కలు మటాష్, లక్షల చెట్లు నేలమట్టం… జీవజాతులన్నీ నశించిపోతాయి… అసలు మనిషి మనుగడే ప్రమాదం అన్నట్టుగా…. దిక్కుమాలిన అనేక కథనాలతో ఆమధ్య బీఆర్ఎస్ మౌత్ పీస్ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించింది… ఒక్క ప్రశ్న… తమిళనాడులో ఉన్న ఇదే తరహా నేవీ రాడార్‌తో అక్కడ సంభవించిన ఉపద్రవాలు ఏమిటో చెప్పగలదా..? కేటీయార్ చెప్పగలడా..?
ఇక్కడ మరో విషయం మరిచారు… నేవీ అనేది ఈ దేశ రక్షణ వ్యవస్థ… విదేశీ శక్తి కాదు… అది ఈ దేశం గురించి, ఈ ప్రభావాల గురించి ఆలోచించదా..? అరకొర జ్ఞానం, గాయిగత్తర రాజకీయంతో బీఆర్ఎస్, ఇతర యాంటీ నేషనల్ శక్తుల్లాగా ఆలోచించదు కదా అది… అక్కడ ఇచ్చేది 2900 ఎకరాలు, 1500 ఎకరాల గ్రీన్‌బెల్ట్ యథాతథంగా ఉంటుంది… 1400 ఎకరాల్లో చెట్లు మొత్తం కూల్చేయడం కాదు, అవసరమైనంత మేరకు చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేస్తారు, కొత్త ఏరియాల్లో చెట్లు పెంచుతారు…
మొత్తం 2900 ఎకరాల్లో ఉన్నవే 1.95 లక్షలు… మరిక పదీఇరవై లక్షల చెట్ల నరికివేత అనే మాటెలా వచ్చింది..? భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలంలోని కొన్ని వందలు, లేదా, వేల చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేస్తామని నేవీ చెబుతోంది… నేవీ రాజకీయం చేయదు… అది బీఆర్ఎస్ పార్టీ కాదు… యాంటీ నేషనల్ ఫోర్స్ కాదు…
నిజంగానే అది అంత ప్రమాదకరమైన ప్రాజెక్టు అయితే కేంద్రం ఎందుకు అనుమతిస్తుంది..? అదేమైనా చైనా ప్రభుత్వమా..? పాకిస్థాన్ ప్రభుత్వమా..? ఈ కామన్ సెన్స్ కూడా లోపించింది దామగుండం వ్యతిరేక గొంతులకు..! బీఆర్ఎస్ నెత్తిమాసిన రాజకీయంలో ఈ విచక్షణను ఆశించలేం… కానీ రేవంత్ రెడ్డి సర్కారు తరఫున ఓ తప్పు ఉంది…
ఇది బీఆర్ఎస్ నిర్ణయమే, మేం అమలు చేస్తున్నాం అనే ప్రకటనలు దేనికి..? అంటే, అదేదో తప్పు, కాకపోతే మేం చేస్తున్నది కాదు, బీఆర్ఎస్ చేసిందే అనే సమర్థన దేనికి..? ఎస్, దేశరక్షణకే మా ప్రాధాన్యం కూడా… బీఆర్ఎస్ నిర్ణయాన్ని మేం కొనసాగిస్తున్నాం… మాకు ఆ విజ్ఞత ఉంది కాబట్టి అని కదా చెప్పాల్సింది… అదుగో ఆ సోయి మాత్రం లేదు రేవంత్ రెడ్డి సర్కారుకు… అంతే…
Share this Article