సంక్షిప్తంగానే చెప్పుకుందాం… వోకే, 200 వర్డ్స్ వోన్లీ… ఆకుల సోనియా తెలుసు కదా… ది గ్రేట్, పర్వర్టెడ్ దర్శకుడు రాంగోపాలవర్మ హీరోయిన్… సరే, పర్లేదు, తన తాజా సినిమాల్లోని బూతు, అశ్లీలత, అసభ్యత, మన్నూమశానం ఏమీ లేవు ఆమె నటించిన అదేదో పిచ్చి సినిమాలో… బహుశా దిశ కావచ్చు…
ఆమె గురించి ఎందుకు చెప్పుకోవాలీ అంటే… ఆమె కరాటే ఫైటర్, లాయర్, సోషల్ యాక్టివిస్ట్, యాక్ట్రెస్… వాట్ నాట్..? కానీ తింగరి బుర్ర… ఈ మాట కూడా ఎందుకు అనుకోవాలంటే..? బిగ్‌బాస్‌లో తన యాక్టివిటీ… లేకపోతే ఆ పులిహోర కలపడం ఏమిటి ఒకేసారి నిఖిల్‌తో, పృథ్వితో… అంత కరువులో ఉందా అనడక్కండి, అది తన స్ట్రాటజీ అట… ఫాఫం…
మరీ నిఖిల్‌తో తన సీన్లు వెగటు పుట్టించాయి… ఏవగింపు బాపతు… ఎస్, రాంగోపాలవర్మ అనే వెధవ మార్క్ సినిమాల బాపతు బిహేవియర్… అవునండోయ్, ఇదే సోనియాకు అదే వర్మ బిగ్‌బాస్‌కు ఎండార్స్ చేశాడు… సరే, లోపలికెళ్లింది… తన రేంజ్ ఏమిటి..? తన ఆట ఏమిటి..? చిరాకు పుట్టించింది… వర్మ హీరోయిన్లు అంటేనే అంత కదా…
Ads
ప్రేక్షకులు తన్ని తరిమేశారు తనను… నన్ను మరీ నీచంగా చూపించారు అని బిగ్‌బాస్ మీద ఏడుస్తోంది… ఏవేవో పిచ్చి ఇంటర్వ్యూలు ఇస్తోంది… ఎవరో ఆదిరెడ్డి అట, తనను నీచంగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు, వాడి మీద కూడా కేసు పెడతాను అంటోంది… అదేదీ జరగదు… కుదరదు… అగ్రిమెంట్లలోనే అన్ని కట్టుబాట్లూ ఉంటాయి… లాయర్ కదా, ఆమెకూ తెలుసు…
ఎహె, నోర్మూసుకో అన్నట్టున్నారు… ఖామోష్… మళ్లీ కిక్కుమనడం లేదు… రీఎంట్రీ అన్నారు… చాల్లే, అసలే నీకు పెళ్లి కుదిరింది, వాడు వద్దంటే దెబ్బతింటావ్ అని బెదిరించినట్టున్నారు పేరెంట్స్… ఈమధ్య అయిదారు వార్తలూ చదివినట్టు గుర్తు… సదరు కాబోయే మొగుడు గారు భయపడిపోయి, నువ్వూ వద్దూ, నీతో పెళ్లీ వద్దూ అన్నాడని…
సరే, అది నిజం కావచ్చు, కాకపోవచ్చు… మీడియా అంటేనే బురదజల్లే యంత్రాంగం కదా… వాటిని పట్టించుకునేట్టయితే అసలు బిగ్‌బాస్ గడపే తొక్కకూడదు… అదో దరిద్రపు సంత… సరే, అయిపోయింది… ఇప్పుడామె ఎంచక్కా మాల్దీవులకు వెళ్లి ఎంజయ్ చేస్తోంది… రోజూ ఫోటోలు, పోస్టులు పెడుతోంది… ఇక్కడ సోనియా అంటే జాలి, అయిష్టత, వ్యతిరేకత కలుగుతున్నాయి మొదటిసారిగా…
మాల్దీవులతో ఇండియాకున్న వివాాదం తెలుసా తనకు..? చదువుకున్నది, లాయర్… ఈమాత్రం సోయి లేదా..? మాల్దీవుల టూరిజాన్ని సగటు భారత జాతీయుడు అసహ్యించుకునే స్థితి ఇప్పుడు… మరెందుకు పోయినట్టు..? దానికి ప్రమోషన్ దేనికి..? ఎస్, ఖచ్చితంగా సోనియా ఓ డిఫరెంట్ మనిషి… నిరభ్యంతరంగా డిస్కార్డ్ చేయదగిన మనిషి అనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే…!!
బిగ్‌బాస్ నుంచి మధ్యలోనే బయటికి తరిమేయబడటం మంచిదే… ఛ, మరీ మంథని మనిషిని అని చెప్పుకోవడానికి … డ్యాష్ డ్యాష్ ఉండాలమ్మా…!! ఇన్నాళ్లూ నిన్ను కాస్తో కూస్తో సమర్థించినందుకు సారీ… నువ్వు అర్హురాలివి కాదు… నీకు ఏ సోయీ లేదు… ఆ వర్మకు నువ్వు ఫిమేల్ రూపం..!!
Share this Article