Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉలగనాయగన్ కమలహాసన్… అంతుపట్టని బిరుదు హఠాత్ త్యాగం..!!

November 12, 2024 by M S R

ఉలగనాయగన్… అంటే లోకనాయకుడు..? కమలహాసన్‌కు ఈ బిరుదు అభిమానులు ప్రేమగా ఇచ్చుకున్నదే… బహుశా దశావతారం సినిమాలో లోకనాయకుడా అనే పాట విన్నాక దీన్ని బహుళ ప్రచారంలో పెట్టారేమో… విశ్వం మెచ్చిన హీరో అని వాళ్ల అభిమానం…

తను హఠాత్తుగా ఆ పేరుతో నన్ను పిలవకండి… జస్ట్, కమలహాసన్ లేదా కేహెచ్ అని పిలిస్తే చాలు అన్నాడు… ఇన్నాళ్లూ అభ్యంతరం లేనిది అకస్మాత్తుగా ఈ మార్పు ఏమిటి..? ఈ అప్పీల్ ఏమిటి అనేది ఎవరికీ అర్థం కాలేదు… తమిళ మీడియా రకరకాల ఊహాగానాలు చేస్తుంది కానీ ఏవీ కన్విన్సింగుగా లేవు…

తను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కూడా ఏదో మార్మికంగా చెప్పాలనుకున్నట్టుగా ఉంది గానీ సగటు అభిమానికి ఏమీ అర్థమయ్యే భాష కాదు అది… తన రాజకీయ పార్టీ ఎంఎన్ఎం మనుగడలాగే…

Ads

ఫ్యాన్స్ రకరకాల పేర్లు పెట్టుకుంటారు… అవేమీ గెజిట్‌లో పబ్లిషయిపోయి, తన పేరు మారిపోదు కదా… పైగా సఫిక్సులు, ప్రిఫిక్సులు కేవలం అభిమాన ప్రకటనలే తప్ప వాటికేమీ సాధికారత ఉండదు… మరి ఎందుకు కమలహాసన్ ఈ పిలుపు ఇచ్చినట్టు..?

ఈ బిరుదులు ప్రభుత్వం ప్రకటించే పురస్కారాలు ఏమీ కాదు… యూనివర్శిటీలు ఇచ్చే గౌరవ డాక్టరేట్లు కూడా కాదు… సీనియర్ నరేష్ అయితే ఏకంగా హిజ్ ఎక్సలెన్సీ అని రాసుకుంటాడు… ఏమిటీ అంటే, వాళ్లెవరో ఇచ్చారట… ఏమో, కొన్ని అలా చదివేసి, నవ్వేసి ఊరుకోవడమే…

రాజకీయంగా ఫెయిల్యూర్ కానీ… తన ఒరిజినల్ వృత్తిలో ఆమధ్య ఆర్థికంగా దెబ్బతిన్నా మళ్లీ ఈమధ్య పుంజుకుని, పాత నష్టాలన్నీ పూడ్చుకున్నాడని అంటారు… హీరోగా ఈరోజుకూ డిమాండ్ ఉంది, ఇంకా రోల్స్ చేసే సత్తా ఉంది… ప్రయోగాలు చేయగల సాహసమూ ఉంది… అమరన్ వంటి సినిమాలు నిర్మించే టేస్టూ ఉంది… ఏ పాత్రయినా మెప్పించగల మెరిట్ ఉంది…

కానీ తగ్గించుకుంటున్నాడు తనే… బిగ్‌బాస్ హోస్టింగును కూడా వదిలేశాడు… నిజానికి తన సుదీర్ఘ కెరీర్‌లో రజినీకాంత్ స్థాయిలో డబ్బు వెనకేసుకుని ఉండాలి తను… మరి ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు… పదేళ్ల సీనియర్ హీరోలే వందలు, వేల కోట్ల ఆస్తుల్ని పోగేసుకున్నారు కదా… ఏమో, కమలహాసన్‌లో ఓరకమైన వైరాగ్యం కనిపిస్తోంది… ఆ క్రమంలో వచ్చిందేనేమో ఈ అభిమాన బిరుదుల త్యాగం కూడా..!!

తనకు ఈ లోకనాయకన్ బిరుదే కాదు ఆండవార్ అని కూడా ఫ్యాన్స్ పిలుస్తుంటారు… బాస్ అని అర్థం… గతంలో హీరో అజిత్ కూడా తనను థళ అని పిలవొద్దని కోరుకున్నాడు, ఫ్యాన్స్‌కు అప్పీల్ చేశాడు, కానీ ఎవరూ వినలేదు… అభిమానం అంటే అలాగే ఉంటుంది… గతంలో ఎంజీఆర్‌ను పురుచ్చి థలైవార్ అనీ, జయలలితను పురుచ్చి థలైవి అనేవారు… శివాజీ గణేషన్‌ను నడగర్ తిలగం అనేవారు…

ఇదంతా తమిళ ఇండస్ట్రీకి సంబంధించి… రజినీకాంత్ సూపర్ స్టార్… తెలుగులో కూడా బోలెడు స్టార్ బిరుదులున్నాయి… అవి చెబితే ఇక్కడ స్పేస్ సరిపోదు… కానీ ఎటొచ్చీ కమలహాసన్ బిరుదుత్యాగం కథే ప్రస్తుతానికి ఓ మిస్టరీ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగ్ గీతం – బోలెడు బ్లండర్స్, అది ఎక్కడెక్కడ దెబ్బతిన్నదంటే..?
  • కాళ్లల్లో కట్టెలు – ఆత్మరక్షణలో కిషన్‌రెడ్డి – తేలిపోయిన పేలవ వివరణ
  • BRS + Janasena + BJP … తెలంగాణ ద్వేషి పవన్ గోకుతూనే ఉన్నాడు…
  • అంతటి సిల్క్ సయ్యా అనడిగితే… నై అనే బావమరిది ఎవడుంటాడు..?
  • అనుకున్నదే – రక్తికట్టని ‘సింగ్ గీతం’ – మరీ దయనీయం వసూళ్లు
  • A Global Traveller — మోడీ టూర్ల సెంచరీ — 78 దేశాల పర్యటనలు
  • రాజకీయ కలకలం – ఠాక్రేకు మరో భంగపాటు? – జార్ఖండ్‌లో మరో ఘట్టం
  • BJD — పట్నాయక్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం — వారసుల్లేరు, నాయకుల్లేరు
  • Pepsi Blunder — ఓ మార్కెటింగ్ తొందరపాటు — దేశమంతా అల్లర్లు
  • ఆరుట్ల స్కూల్ — ప్రతి సర్కారు బడి ఇలా మారిపోతే ఎంత బాగుండు..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions