.
ఇదొక కొత్త దరిద్రం మనకు…. సినిమా సెలిబ్రిటీలు తమ డొల్ల మెదళ్లతో… శుష్క పాండిత్యంతో… అర్ధ జ్ఞానంతో… ప్రతినాయకుల్ని, ప్రతినాయికల్ని కూడా కీర్తించడం… తాము పోషించిన పాత్రలకు ఏదో పిచ్చి, తలతిక్క పాజిటివ్ గుణాల్ని ఆపాదించే విపరీత పోకడ…
.
Ads
దీనికి ఆద్యురాలు… ఓ తలతిక్క సాయిపల్లవి… రావణుడు మరీ అంత చెడ్డవాడు కాదని తీర్పు చెప్పింది కదా పిచ్చిది… మరి తనెందుకు వెనుకబడాలని అనుకుందేమో… ది గ్రేట్ రకుల్ ప్రీత్ సింగ్ అనబడే తెలంగాణ మార్క్ ‘కేరక్టర్’… సేమ్, తనకు నప్పినట్టుగానో, నచ్చినట్టుగానో…
అబ్బే, శూర్పణఖను మనం అపార్థం చేసుకున్నాం అంటోంది… ఇది తన గుణ ప్రదర్శనా..? లేక తన పాత్రకు విశిష్ట లక్షణాల్ని ఆపాదించడమా..? అవసరమా..? ఈ పిచ్చి కూతలకు ఎవడు పర్మిషన్ ఇచ్చారు..? రామాయణ దర్శకుడేనా..?

రకుల్ ఇటీవల PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది: “శూర్పణఖ చాలా అపార్థం చేసుకున్న, అనేక కోణాలున్న పాత్ర… అసలు యుద్ధం జరగడానికి కారణం ఆమెనే… ఇలాంటి అనేక షేడ్స్ ఉన్న పాత్రను పోషించడం ఆసక్తికరంగా అనిపించింది…”
అంతకుముందు ఓ అభిమాని రాసిన లేఖకు స్పందిస్తూ కూడా ఆమె ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది… చరిత్ర ఆమెను ఒకే ఒక్క సంఘటనతో గుర్తుపెట్టుకుందని, కానీ ఆమె కథలో ఇంకా చాలా ఉందని పేర్కొంది…
అసలు వివాదం ఏమిటి? ఇక్కడే రెండు వాదనలు మొదలయ్యాయి… ఒక వర్గం అభ్యంతరం…: రామాయణంలో శూర్పణఖ పాత్ర ఏమిటో అందరికీ తెలుసు… రాముడిపై మోహం పెంచుకోవడం, లక్ష్మణుడి చేతిలో ముక్కు కోయించుకోవడం, ఆ తర్వాత రావణుడిని రెచ్చగొట్టడం… ఇవన్నీ కథలోని కీలక పరిణామాలు… అలాంటి పాత్రను ‘అపార్థం చేసుకున్న వ్యక్తి’గా చిత్రీకరించడం ఎందుకు? ప్రతినాయక పాత్రలను సమర్థించే ప్రయత్నం జరుగుతోందా? అన్నది వారి ప్రశ్న…
మరో వాదన…: ఒక పాత్రను పోషించే నటిగా దాని మానసిక స్థితిని, నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం తప్పేమీ కాదు… శూర్పణఖ పాత్రను కేవలం ముక్కు కోయించుకున్న సంఘటనకే పరిమితం చేయకుండా, ఆమె వ్యక్తిత్వంలోని ఇతర కోణాలను కూడా చూపించవచ్చని కొందరి అభిప్రాయం….
ఇది ఒక్క రకుల్ వ్యాఖ్యతో మొదలైన వివాదం కాదు!
.
ఇటీవల సాయిపల్లవి కూడా రావణుడి గురించి మాట్లాడుతూ ఆయన పూర్తిగా చెడ్డవాడేమీ కాదన్న అర్థంలో వ్యాఖ్యానించింది…. అలాగే రావణుడి పాత్ర పోషిస్తున్న యశ్ కూడా ఒక పాత్రను పోషించేటప్పుడు ఆ వ్యక్తి కోణంలో ఆలోచించాల్సి ఉంటుందని చెప్పాడు…
దీంతో రామాయణంలోని రావణుడు, శూర్పణఖ వంటి ప్రతికూల పాత్రలకు కొత్త భాష్యం చెప్పి వాటిని సమర్థించే ప్రయత్నం జరుగుతోందా? అనే చర్చ మొదలైంది…
నిర్మాత లగడపాటి శ్రీధర్ కూడా ఈ వివాదంపై స్పందించాడు… రామాయణంలో మంచి, చెడుల మధ్య స్పష్టమైన విభజన ఉందని, ప్రతినాయక పాత్రల దుష్కార్యాలను సమర్థించేలా చిత్రీకరించకూడదని అభిప్రాయపడ్డాడు…
నా పరిశీలనలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… ఒక నటుడు తాను పోషిస్తున్న రావణుడి పాత్రను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వేరు… రావణుడు చేసిన పనులను సమర్థించడం వేరు… అలాగే శూర్పణఖ పాత్రలోని మానసిక కోణాలను అన్వేషించడం వేరు, ఆమె చర్యలను సమర్థించడం వేరు…
సినిమా విడుదల కాకముందే ఈ వ్యాఖ్యల ఆధారంగా సినిమా ఎలా ఉండబోతోందో నిర్ణయించలేం… అయితే రామాయణంలోని ప్రతికూల పాత్రలకు కొత్త కోణాలు చూపిస్తామంటున్నప్పుడు, ఆ ప్రయత్నం ఎంతవరకు సృజనాత్మక స్వేచ్ఛ, ఎంతవరకు మూల ఇతిహాసానికి భిన్నమైన వ్యాఖ్యానం అన్న చర్చ రావడం సహజమే…
Share this Article