.
చెప్పుకోవాలి… గంగవ్వ వంటి కంటెస్టెంట్లను నెత్తిన పెట్టి మోసినందుకు బిగ్‌బాస్ ఎలా షాక్ తిన్నాడో చెప్పుకోవాలి…
ఆమెకు ఎవరేం తక్కువ చేశారు..? గత సీజన్లలో తీసుకొచ్చారు… ఆమె అసలు బిగ్‌బాస్ వంటి షోలకు అస్సలు ఫిట్ కాదు… ఆమె వయస్సు, ఆమె ఆరోగ్యం ఆమెను అందరిలో కలవనివ్వవు… ఐతేనేం..? కొన్ని వారాలు అక్కడే ఉంది…
Ads
నాగార్జున ఇల్లు కట్టించాడు… మై విలేజ్ షో వేరు… సరిగ్గా ఆమెకు పరిపడే స్క్రిప్టులు ఉంటాయి, ఆ టీమ్ కూడా ఆమెకు సరిగ్గా షూటయ్యే ఓ పల్లెటూరి ముసలామె పాత్రనే ఇచ్చారు, దానికి ఆమె పర్‌ఫెక్ట్ ఫిట్… కానీ బిగ్‌బాస్ వేరు… (గతంలో గోగినేని బాబును ఇలాగే తీసుకొచ్చారు, ఏమైంది..?)
సరే, మళ్లీ బిగ్‌బాస్‌కు పిలిచారు… అనవసరం… ఆమె షోకు ఓ లయబులిటీ… నాగార్జున మోస్తున్నాడు కాబట్టి ఎవరూ ఆమెను నామినేషన్లలో ఉంచరు… ఏమీ అనరు, ఏ పనీ చేయదు, ఏ గేమూ ఆడదు, టాస్కులకు ఆమె అతీతం…
ఆమెతో జనరేటయ్యే వినోదం సున్నా… చివరకు సంచాలక్‌గా ఉండి కాస్త చూడమ్మా అంటే అదీ చేతకాలేదు ఆమెకు… తోటి కంటెస్టెంట్ల పేర్లనే సరిగ్గా పలకలేదు… చూసీ చూసీ ఇక ఆమెను తీసేశారు… నిజంగానే ఆమెకు చేతనైతలేదు… (అంటే ఆరోగ్యం సహకరించక తన వల్ల కావడం లేదు అని…)
కన్ఫెషన్ రూమ్‌లో నాగార్జునతో చెప్పుకున్నప్పుడు కూడా చేతులు జోడించి అదే చెప్పింది… అవన్నీ కావాలని చెప్పించినట్టు ఆర్టిఫిషియల్‌గా కూడా ఏమీ అనిపించలేదు… కానీ బయటికి వచ్చాక అదేదో యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పిందట… ‘‘వారానికి ఓసారి వండుకోవాలి, ఫుడ్డు బాగాలేదు, అటుకులతో ఏదో చేశారు, కడుపు డిస్టర్బ్ అయ్యింది… అదే సెట్ అవుతుందిలే అనుకుని మరో నాలుగైదు వారాలు ఉండాలని అనుకున్నా సరే, బయటికి పంపించేశారు… కనీసం వేదిక మీదకు కూడా పిలవలేదు’’
అసలు వారానికి ఓసారి వండుకోవడం ఏమిటి..? అటుకుల వంట (చాలా ఈజీ, సాఫ్ట్ రెసిపీ) తింటే కడుపు డిస్టర్బ్ కావడం ఏమిటి..? చేతనైతలేదని బయటికి వచ్చాక వేదిక మీదకు ఎందుకు పిలుస్తారు..? హేమిటో… ఆమెకే తెలియాలి…
పైగా ఇప్పుడు సోషల్ మీడియాలో బోలెడు కథనాలు… ఆమెను బెదిరించి మరీ పంపించేశారని కొన్ని… తన మనమరాలికీ ఇల్లు కట్టించాలని నాగార్జునను బ్లాక్ మెయిల్ చేసిందని మరికొన్ని… పది వారాలకు అగ్రిమెంట్ రాయించుకుని, అర్థంతరంగా పంపించేశారని ఇంకొన్ని… బోలెడు కథనాలు…
అవన్నీ టూమచ్… నాగార్జునను బ్లాక్ మెయిల్ చేయడం మాత్రం దండుగమారి ప్రచారాలు… ఆమె చాలాసార్లు నాగార్జునకు కృతజ్ఞతలు చెప్పింది తప్ప తన గురించి ఒక్క నెగెటివ్ మాట కూడా మాట్లాడలేదు… తనంతటతానే వెళ్లిపోతానని అడిగింది కాబట్టి తప్పక పది వారాల అగ్రిమెంట్ కూడా చెల్లదు..!!
Share this Article