.
ఏమాటకామాట… కేసీయార్‌ది భలే ఎత్తుగడ… రాజకీయాలు అంటే యుద్ధాలే కదా… వర్తమాన రాజకీయాల్లో యుద్ధవ్యూహాలే ఉంటాయి… ఇదీ అంతే…
కేసీయార బిడ్డ కవిత ఏం చేసింది..? మళ్లీ ఫుల్లు యాక్టివ్ అయిపోయింది… మందు సీసాల కేసులో అరెస్టయి, బయటికొచ్చాక చాన్నాళ్లు అజ్ఞాతంలో ఉండిపోయింది కదా… ఇప్పుడు రంగంలోకి దిగింది…
Ads
ఏమో, కేటీయార్ ఎలాగూ అరెస్టు అవుతాడు, ఇక నువ్వు చూసుకో, కేసీయార్ వదిలిన బాణం పేరిట అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడేమో కేసీయార్.. ఎలాగూ హరీష్ బయటివాడే, అయితే కొడుకు, లేెకపోతే కూతురు… కమాన్ మై డియర్ డాటర్ అని ఆశీర్వదించాడో ఏమో…
ప్రభుత్వం నిర్దేశించిన, అధికారిక తెలంగాణ తల్లిని ఏ మార్పులతో ప్రతిష్ఠించినా, ప్రచారంలోకి తెచ్చినా శిక్షార్హులు అవుతారు అన్నాడు కదా రేవంత్ తన జీవోలో… సరిగ్గా దానిమీదే పోరాడుతోంది ఆమె ఇప్పుడు…
ఏకంగా పాత గులాబీ తెలంగాణతల్లి 22 అడుగుల విగ్రహాన్ని స్థాపించడానికి భూమిపూజ చేసింది… అంతేకాదు, గ్రామగ్రామాన ఇలాగే విగ్రహాలు పెడతాం, ఏం చేసుకుంటావో చేసుకో అని ధిక్కార ప్రకటన చేసిందామె…
తెలంగాణ అస్థిత్వం మీద దాడిని ప్రతిఘటిస్తాం అంటోంది… మంచి ఎత్తుగడ… ఎలాగూ కాంగ్రెస్ మంత్రులు, నాయకుల మధ్య ఏకత లేదు… సమన్వయం లేదు… పక్కాగా తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసే ప్రయత్నం…
కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి అల్లు అర్జున్ వంటి ఆంధ్రా ప్రాంతీయుడు కాదు వీళ్లు… నాగార్జునలు అసలే కాదు… మోహన్‌బాబు కూడా కాదు… పల్లెపల్లెనా కేసులు పెడితే అది కాస్తా ప్రభుత్వ వ్యతిరేకతలో పెట్రోల్ పోసినట్టవుతుంది… దీనికి రేవంత్ రెడ్డి దగ్గర కౌంటర్ స్ట్రాటజీ ఏముందో తెలియదు…
కానీ ఇక ఈ పార్టీ ఉంటుందా అనే స్టేజ్ నుంచి బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంది… ఫామ్ హౌజు వదిలి అడుగు బయట పెట్టకపోయినా కేసీయార్ మంచి స్ట్రాటజీలు రచిస్తున్నాడు… రేవంత్ ఎంత ప్రయత్నించినా సరే హరీష్, కేటీయార్, కేసీయార్‌లను ఈరోజుకూ ఎందులోనూ ఫిక్స్ చేయలేకపోయాడు… ఏడాది దాటింది…
ఇక రాను రాను… పరిస్థితి క్లిష్టం అవుతుంది… బీజేపీ దిక్కుమాలిన తెలంగాణ పొలిటికల్ స్ట్రాటజీలు ఆ సొంత పార్టీలోనే ఎవరికీ రుచించకపోయినా సరే, ఆ హైకమాండ్ బీఆర్ఎస్ మీద మళ్లీ సాఫ్ట్ కార్నర్ ఇప్పుడు… ఇదే కేసీయార్ బీజేపీ పరువును బజారున పడేసి ఆడుకున్నా సరే, మోడీషాలకు ఈరోజుకూ కేసీయార్ అంటే ముద్దు…
(స్పష్టంగా తెలియదు, కానీ బీజేపీ మెతక పోరాటంతో విసిగి ఓ పెద్ద మనిషి సొంత పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నాడని వార్త…) బీజేపీకి ఎలాగూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పదునైన పోరాటం చేతకావడం లేదు… కానీ బీఆర్ఎస్ సర్వ శక్తులూ కూడగట్టుకుని మరీ పోరాడుతోంది… ఏమో, రేవంత్ ఏం చేస్తాడో చూడాలిక..!!
Share this Article