.
మరీ సీపీఐ నారాయణ అన్నట్టుగా… బిగ్‌బాస్ హౌజ్ ఓ వ్యభిచార కొంప అనే స్వీపింగ్ కామెంట్లు చేయలేను గానీ…
డెఫినిట్‌గా అవాంఛనీయ కేరక్టర్లను … ఒరేయ్, నువ్వు తోపు, నువ్వు తురుమ్ అనే ముద్రవేసి సమాజం మీదకు వదులుతున్నది మాత్రం నిజం…
Ads
అందులో ఫస్ట్ పర్సన్… పల్లవి ప్రశాంత్… గత సీజన్ విజేత… తనేమైనా ఎంటర్‌టెయినరా కాదు, మంచి గేమరా, అస్సలు కాదు, పోనీ, ఏమైనా ఓ రీతి కలిగిన కంటెస్టెంటా… కానేకాదు… ఆ శివాజీ అనబడే మరో సిమిలర్ కేరక్టర్, అంతకుమించిన యావర్ అనే ఇంకో కేరక్టర్‌తో కలిసి, ఓ గ్రూపుగా ఏర్పడి… నానా అబద్ధాలకు దిగారు…
ఇతర కంటెస్టెంట్లకు వెక్కిరింపులు, బెదిరింపులు… ఓ పరమ అనారోగ్యకరమైన వాతావరణం… ఎప్పటిలాగే బిగ్‌బాస్ టీమ్ రాసిచ్చే స్క్రిప్టు ప్రకారం కాసేపు నటించే నాగార్జున ఈ కేరక్టర్లను సపోర్ట్ చేస్తూ మరింత కలుషితం చేశాడు గత సీజన్‌ను…
ఇదే పల్లవి ప్రశాంత్ నేను రైతు బిడ్డను, గెలుచుకున్న ప్రతి రూపాయి రైతులకు పంచుతాను అని నానా అబద్ధాలను అలవోకగా ఆడేశాడు… పిచ్చి జనం నమ్మేశారు,.. నమ్మడమే కదా జనం బలహీనత… ఎక్కడైనా…
గెలిచాక సోకాల్డ్ తన మూర్ఖ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన విధ్వంసం సమాజ హానికరం… తరువాత ఎవడికైనా ఒక్క రూపాయైనా ఇచ్చాడా..? బహుశా రెండు లక్షలలోపే అనుకుంటా… అదే స్టార్‌మా షోలలో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాడు…
జీరో… సొసైటీ కన్సర్న్ అనే మాటే తెలియదు తనకు… ఏదో గేమ్ స్ట్రాటజీగా ఇష్టారాజ్యం అబద్ధాలు ఆడి గెలిచాను, అందరూ చేసేదీ అదే కదా అంటాడేమో… ఇంకానయం, అదే డబ్బుతో ‘రైతుపక్షపాతి’ అనే సినిమాను సొంతంగా నిర్మించడం లేదు తనే హీరోగా… థాంక్ గాడ్…
రైతులు అంటేనే అందరితోనూ మోసగించబడేవారని కదా అర్థం… తనేమీ మినహాయింపు కాదు… ఇప్పుడు కార్లు కథాకమామిషూ బాగా పెరిగింది కథ… తాజాగా ఓ సినిమా హీరోలాగా ఫోజులు పెట్టి ఫోటో సెషన్ చేశాడు… ఇన్‌స్టాలో పెట్టాడు, జనమెల్లరూ చూసి తరించుమని…
ఏమాటకామాట… మొన్నటి సీజన్ విజేత నిఖిల్ కూల్‌గా, హుందాగా గెలిచాడు… అంతకుముందు రేవంత్, అభిజిత్, సన్నీ ఎట్సెట్రా ఎవరూ కథలు పడలేదు…
హబ్బా… ఓ రైతు బిడ్డ నాలుగు మంచి డ్రెస్సులు వేసుకుని, ఆ ఫోటోల్ని ఇన్‌స్టాలో పెడితే సహించలేరా అంటారా..? ఆ ఫినాలే రోజున జరిగిన దాడులకు, బాధితులైన సహ కంటెస్టెంట్లలో ఒక్కరికైనా సారీ చెప్పాడా..? ఆ ధూర్త వ్యక్తిత్వాలకు బిగ్‌బాస్ వేదిక కావడం, పాపులర్ చేయడమే దుర్మార్గం…!!
ఈ సందర్భంగా ఓ తాజా వార్త చెప్పుకుందాం… హిందీ బిగ్‌బాస్ ఓ కంటెస్టెంట్ పేరు పునీత్ సూపర్ స్టార్, అసలు పేరు ప్రకాష్ కుమార్… విమానం దిగి వస్తుంటే ఓ తోటి ప్రయాణికుడు చితకబాదాడు… గతంలో ఓసారి ఇదే హీరో, ఇదే సూపర్‌స్టార్‌తో సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ ప్రదీప్ గొడవపడ్డాడు… అప్పుడు కూడా ఈ సూపర్‌స్టార్‌ను జనం ఉతికేశారు…
Share this Article