.జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. ఓ అభిమాని తల్లి ఆవేదనక్యాన్సర్‌తో బాధపడుతూ చెన్నై అపోలోలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్’దేవర’ సినిమా చూసి చనిపోవాలని, తన చివరి కోరిక అదే అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టుఅబ్బాయి చికిత్సకు అవసరమైన ఖర్చు భరిస్తానంటూ గతంలో కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్కానీ, ఇప్పుడు అటు నుంచి ఎలాంటి స్పందన లేదంటున్న అభిమాని తల్లి సరస్వతిమరో రూ. 20 లక్షలు ఆసుపత్రి ఫీజు చెల్లించాల్సి ఉండడంతో అవస్థలు పడుతున్న బాధిత కుటుంబం………ఇదీ కనిపించిన వార్త… ఎస్, అల్లు అర్జున్ వివాదం మొదలైనప్పటి నుంచీ మనం చెప్పుకుంటున్నది అదే… ఏ స్టార్ హీరో అయినా సరే… బయటికి కనిపించేది వేరు… అసలు గుణాలు వేరు…వాళ్లకు డబ్బు, తద్వారా వచ్చే విలాసాలు, అట్టహాసాలు, ఆడంబరాలు, సాధన సంపత్తి, ఆస్తులు కావాలి… తొక్కలో ఫ్యాన్స్ ఎవడు చస్తేనేం..? అల్లు అర్జున్ అత్యంత మూర్ఖ బాధ్యతారహిత ప్రవర్తన చూశాక కూడా ఈ సోకాల్డ్ ఉన్మాద ఫ్యాన్స్‌కు అర్థమైతే బాగుండు…బన్నీ కాదు, జూనియర్ కాదు… ఎవడైనా సరే… ఫ్యాన్స్ అంటే ఎవరు..? వాళ్లేమైనా చుట్టాలా..? దోస్తులా..? పెంట మీద పురుగులు… చస్తేనేం, బతికేనేం… మాకు జై కొట్టారా లేదా… తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోయినా సరే ఈ చెత్త దేవుళ్ల సేవలో బతికి చస్తున్నారా లేదా…ఎస్, దేవుళ్లది కాదు తప్పు… ఎవడికైనా ఈ పూజలు అందుకోవాలనే ఉంటుంది… అది ఇండస్ట్రీ ఇచ్చిన బలుపు… సోయి ఫ్యాన్స్‌కు ఉండాలి…
చాలామంది చెబుతున్నది నిజమే… ఈ ఫేక్ దేవుళ్ల వెంట అభిమానాల్ని పెంచుకుని, కెరీర్లు నాశనం చేసుకుని, ఎటూ గాకుండా భ్రష్టుపట్టిపోవడం యువత తప్పు… ఈ ఫేక్ హీరోలు కూడా ఫేక్ బాబాల బాపతే… ఎవడూ పైసాకు సాయం రాడు… అంతెందుకు..? ఇదే శ్రీతేజ విషయంలో మేమున్నాం అని డొల్ల కబుర్లు చెబుతున్న సోకాల్డ్ అర్జునుడు, అరవిందుడు ఎట్సెట్రా బాపతు గాళ్లు నిజంగా ఏం సాయం చేశారో తెలుసా..?జీరో… కోమటిరెడ్డి తన మరణించిన కొడుకు పేరిట నెలకొల్పిన ట్రస్టు పేరిట సాయం చేస్తున్నాడు… అంతే… తెల్లారిలేస్తే లక్ష నీతులు చెప్పే దరిద్రులు ఒక్కరూ ఒక్క పైసా సాయం చేయలేదు, చేయరు… వాళ్ల గుణమే అది…. మరోసారి చెప్పుకుందాం… ఒరే, ఫ్యాన్సూ…. వాళ్లు దేవుళ్లు కాదురా ఇడియెట్స్… సకల అవలక్షణాల పిశాచాలు… ధనపిశాచాలు… బహుపరాక్…
Share this Article
Ads