.
హాశ్చర్యం వేసింది… రేవంత్ రెడ్డి గత పాలకులకన్నా భిన్నం కాదు, మరింత అధ్వానం అనిపించింది…
ఒకవైపు పుష్ప2 ప్రీమియర్ షోలో తొక్కిసలాటలో రేవతి అనే యువతి మరణించింది, ఆమె కొడుకు చావుబతుకుల్లో నుంచి ఇంకా బయటపడలేదు… కేసులు, సెటిల్మెంట్లు, అరెస్టులు, పెద్ద రచ్చ, ఇండస్ట్రీ ఉలిక్కిపాట్లు గట్రా బోలెడు…
Ads
అయిపోయిందా..? గేమ్ చేంజర్ సినిమా ప్రిరిలీజు ఏదో పెట్టారు ఏపీలో… డిప్యూటీ సీఎం, అంతకుమించి స్టార్ హీరో పవన్ కల్యాణ్, ఓహ్, పవర్ కల్యాణ్ అనాలట కదా… ఆ సినిమా హీరో బాబాయ్ కూడా హాజరై ఏవేవో చెప్పాడు… సైలెన్సర్లు పీకేయడం, చొక్కాలు చింపుకోవడం, యువత ఆదర్శాలు, స్టంట్ స్కూళ్లు అని… తన అధికారం, జనం ప్రాప్తం…
కానీ ఇద్దరు అభిమానులు ఇంటికెళ్తూ మరణించారు… దిల్ రాజు కదా నిర్మాత చెరి 5 లక్షలు ఇస్తానని ప్రకటించాడుట, ఖతం, కేసు క్లోజ్… అరె, ఎందుకురా ఈ ప్రిరిలీజులు, ఈ ఫంక్షన్లు, ఫ్యాన్ గ్యాదరింగులు, ఎవడిని దేవుడిని చేయడానికి ఈ ప్రాణత్యాగాలు, బలితర్పణాలు అని ఎవడూ అడగడు…
ఇప్పుడు ఏమైంది,… బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు, అడ్డగోలు షోలు, టికెట్ రేట్ల పెంపులు జాన్తానై అని గర్జించాడు కదా రేవంత్ రెడ్డి… కానీ దిల్ రాజు మన వాడాయె… మనమే ఏరి కోరి, అంతకు మించిన అద్భుతమైన సినిమా వ్యక్తి లేడని ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇచ్చాడాయె… పుష్ప వివాదాన్ని కూడా సెటిల్ చేశాడాయె…
అందుకే, తను అడగ్గానే ఏకంగా దిల్ రాజు జిల్లా నిజామాబాద్‌లో తన ఇంకో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రిరిలీజ్ షోకు పర్మిషన్లు ఇచ్చేశాడు… సరే, పేరుకు ట్రెయిలర్ లాంచింగ్ అట… ట్రెయిలర్ లాంచింగ్‌కు బహిరంగ సభ ఏమిటోయ్ అని ఎవడూ అడగకూడదు కదా…
టీవీ9, ఎన్టీవీ ప్రత్యక్ష ప్రసారం అట… దిల్ రాజు కటౌట్… హీరో అంటే తనే కదా, ఆఫ్టరాల్ వెంకటేష్ ఎంత..? కాదంటే అసలే రేవంత్ రెడ్డి సర్కారు, ఎక్కడ బుక్ చేసి చంచల్‌గూడ జైలుకు పంపిస్తారో అనే భయం… అదే నిజామాబాద్‌కు చెందిన శ్రీముఖి ప్రత్యక్ష ప్రసారంలో గొంతు చించుకుని అరుస్తూ ఉంది… పరమ చెత్తా హోస్టింగు… ఆ అరుపులేమిటో, ఆ కేకలేమిటో… ఇదొక విషాదం…
అసలే రోజులు బాగాలేవు, సీఎం స్వయంగా చెప్పాడు కదా, ఈ పిచ్చి ధోరణులను అరికడతానని… మళ్లీ ఇదేమిటి..? మన దిల్ రాజు రెడ్డి కాబట్టి ఈ సడలింపులా..? మళ్లీ ఎవడికైనా ఏమైనా అయితే 5 లక్షలు తనే పారేస్తాడులే అనే భావనా..? ఎంత దుర్మార్గం…!? రేవతి కుటుంబానికి 2 కోట్లు, తరువాత ఇక ఎవరు మరణించినా 5 లక్షలు… అంతేనా..?
తెలంగాణలో కూడా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల మీద దిల్ రాజు అపారమైన నమ్మకాన్ని వ్యక్తం చేశాడని ఏవో వార్తలు కనిపిస్తున్నాయి… అదే జరిగితే రేవంత్ రెడ్డి ఇంకా తెలంగాణ జనంలో భ్రష్టుపట్టడం ఖాయం… ఫాఫం, రేవంత్ రెడ్డి… జనం నమ్మి అధికారాన్ని అప్పగించారు… కానీ తన ధోరణేమో ఇది…! తెలంగాణ సమాజానికి నిజమైన లీడర్ అనేవాడే దొరకడా..!!
Share this Article