Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేసీయార్ మీద ఏదో బురద జల్లబోయి… చివరకు కాంగ్రెస్‌కే భంగపాటు…

January 30, 2025 by M S R

.

హబ్బ… ఎట్టకేలకు ఆ పోల్ ట్వీట్ ఆగిపోయింది… దాని 24 గంటల గడువు అయిపోయి ఆగిపోయిందో… లేక ఎట్టకేలకు సిగ్గూశరం గుర్తొచ్చి డిలిట్ కొట్టారో… ఆ పిన్‌డ్ పోస్టు మాత్రం మాయమైంది… ఈలోపు తెలంగాణ కాంగ్రెస్ ఇజ్జత్ కచరా అయిపోయింది…

నిజానికి ఆ తెలంగాణ కాంగ్రెస్ పేరిట వెక్కిరింపులకు, వెటకారాలకు గురైన ఆ ట్వీట్ నిజమో కాదో మొదట డౌటొచ్చింది…. తీరా ఎక్స్‌లో చెక్ చేస్తే అది అధికారిక అకౌంటే అని తేలింది… పైగా ఆ పోల్ పిన్ చేసి మరీ చంకలు గుద్దుకున్నారు… తీరా ఏమైంది..? బీఆర్ఎస్‌ను వెకిలి చేయబోయి తనే వెల్లకిలా పడిపోయింది…

Ads

ముందు నుంచీ అనుకుంటున్నదే కదా… పేరు గొప్ప సునీల్ కనుగోలు… తీరా తన టీమ్ పర్‌ఫామెన్స్ ఇదీ… సరే, విషయం ఏమిటంటే..? ఈ ఎక్స్ పోల్ చూడండి…

inc telangana

ఫామ్ హౌజ్ పాలన బెటరా..? ప్రజల వద్దకు పాలన బెటరా..? అని ఆ పోల్..! సరే, ఏదో ప్రయత్నం చేశారు, కేసీయార్ ఫామ్ హౌజు నుంచి పాలించిన తీరును జనంలోకి తీసుకుపోదామని అనుకున్నారు… కానీ ఇక్కడే బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్‌ను అండర్ ఎస్టిమేట్ చేశారు…

అది వరల్డ్ మొత్తానికే నొటోరియస్… ఈ పోల్‌ను హైజాక్ చేసి పారేసింది… తీరా చూస్తే ఓ దశలో బీఆర్ఎస్‌కు అనుకూలంగా 73.5 శాతం, వ్యతిరేకంగా 26.5 శాతం… ఇవే స్క్రీన్ షాట్లు తీసి ఫేస్‌బుక్కులో ఆడుకుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్… ముందే చెప్పుకున్నాం కదా, అది పరమ భీకర నొటోరియస్ అని… అది అసలే గాలి పోగేసి బదనాం చేసే బ్యాచ్…

ఐనా సరే, కాంగ్రెస్ ఐటీ సెల్‌కు సోయి లేదు… సీఎం మీడియా సెల్‌కు కూడా లేదు… ముందు నుంచీ చెప్పుకుంటున్నదే కదా… సీఎం, తెలంగాణ కాంగ్రెస్ మీడియా, సోషల్ మీడియా విభాగాలు పరమ వేస్ట్ అని… వాటికి బీఆర్ఎస్ మీద, బీజేపీ మీద అటాక్ చేతకావడం లేదు…

పైగా బీఆర్ఎస్ చేసే దాడులకు కౌంటర్లూ చేతకావడం లేదు… అంటే అఫెన్స్ లేదు, డిఫెన్స్ లేదు… పైగా ఏదో అఫెన్స్‌కు ప్రయత్నించి, చివరకు డిఫెన్స్ కూడా చేతకావడం లేదు… పైగా భంగపాట్లు… ఫాఫం రేవంత్ రెడ్డి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Rahen na rahen hum… remembering great singer suman kalyanpur…
  • ఆక్రమణ దురుద్దేశాలు లేకపోతే… చెరువులో ఈ కంచె ఏమిటయ్యా…!?
  • దుష్ట శిక్షకుడు పబ్లిక్ రౌడీ… చెడ్డ పనుల దుష్ట రౌడీ… బోత్ ఆర్ నాట్ సేమ్…
  • అప్పట్లో జోసెఫ్ విజయ్ మహా సిగ్గరి… చిన్న కళ్లు, బక్కగా, నల్లగా… కానీ..?
  • బాల్క సుమన్‌పై తెలంగాణ సర్కారు సీరియస్… దేశద్రోహం కేసు..!!
  • తుమ్మిడిహెట్టి… రేవంత్ సీరియస్ టోన్… ఫడ్నవీస్ వింటున్నావా..?
  • తెలంగాణపైకి వలసవాదం ముంచుకొస్తోంది అనడమే పెద్ద వంచకభాష..!
  • The Scape Goat… అదే ఆ పాత కథే… అనేక భాషలు… వందల సినిమాలు…
  • షర్మిలకు రాజ్యసభ సీటు..! ఏపీ కాంగ్రెస్ పార్టీకి ఫాయిదా ఏమిటట..!?
  • blood money … క్లౌడ్ ఫండింగ్‌తో ఒక ప్రాణం నిలబడింది …

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions