Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అర్ధరాత్రి… ఆ శ్మశానంలో హఠాత్తుగా కెవ్వుమని ఓ పసిగొంతు ఏడుపు…

January 31, 2025 by M S R

.

ఈనాడులోని ఓ వార్త దగ్గర చూపు అలా కాసేపు నిలిచిపోయింది… ఆలోచనల్లో ముంచేసింది… ఆ వార్త హెడింగ్, రచన శైలి, ప్రయారిటీలతోపాటు కంటెంట్ కూడా…

శ్మశానాన శైశవగీతి… చాలా బరువైన శీర్షిక… నిజానికి శైశవగీతి అనే పదాన్ని అందులో వాడొచ్చా అనే సందేహాన్ని పక్కన పెడితే… వార్త ఉన్నదే పదీపదిహేను లైన్లు… అందులో సగం ఉపోద్ఘాతమే… ఏదో జీవించబోయారు రిపోర్టర్, సబ్‌ఎడిటర్… కానీ ఒక వేదనను ఆవిష్కరించడంలో సక్సెస్ కాలేదు…

Ads

విషయం ఏమిటంటే..? ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలం… ఒకామె ఆర్టీసీ డిపోలో కంట్రాక్టు కార్మికురాలు… ఇద్దరు ఆడపిల్లలు… మొదటి అమ్మాయికి బిడ్డ పుట్టింది… కానీ మానసికంగా ఎదగలేదు… రీసెంటుగా రెండో అమ్మాయికి మగబిడ్డ పుట్టాడు… కానీ..? yard

ఆ పసిగుడ్డు తలపై పెద్ద బొడిపె… మెదడులోనే ఏదో లోపం ఉన్నట్టు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే స్కానింగు ద్వారా డాక్టర్లు కనిపెట్టారు, చెప్పారు… అసలే ఒక బిడ్డతో అవస్థలు పడుతున్నారు, మళ్లీ ఇప్పుడు మరొకరు… అందుకని తాడేపల్లిగూడెం వచ్చి, అక్కడ రాత్రిపూట ఓ శ్మశానంలో పూడ్చేయడానికి సిద్ధపడ్డారు…

ఓ మానవత సంస్థ ప్రతినిధి అదే సమయంలో అటువైపు వెళ్తూ కనిపెట్టాడట… అంత రాత్రి ఆయన శ్మశానం వైపు ఎందుకు తిరుగుతున్నాడో తెలియదు గానీ… ఇంత రాత్రి గొయ్యి దేనికి అని దబాయించి అడిగాడట,.. ఈలోపు పిల్లాడు ఏడ్చాడుట… దాంతో బతికి ఉండగానే పూడుస్తున్నారని ఆయన కంప్లయింట్ చేశాడు… పోలీసులు ఐసీడీఎస్ సిబ్బందితో వచ్చి శిశువును హాస్పిటల్‌లో చేర్చారు… ఇదీ కంటెంట్…

ఎస్, ఒక ప్రాణాన్ని సజీవంగా పూడ్చటం చట్టరీత్యా నేరం… ఘాతుకం… అమానవీయం… నిజమే… కానీ కన్న ప్రాణాన్ని బతికుండగానే పూడ్చటానికి ప్రయత్నించారంటే వాళ్లు అనుభవించే వేదన మాటేమిటి..? పైకి క్రూరత్వమే కనిపించేది, కానీ దాని వెనుక ఉన్న కన్నీళ్లు..? అది కూడా ఫోకస్ కావాలి కదా… నిజానికి ఆ బాధే అసలు వార్త కావాలి… సంఘటనతోపాటు..!

తరువాత ఏం జరుగుతుంది..? ఎవరైతే పూడ్చేయడానికి ప్రయత్నించారో వాళ్ల మీద కేసు పడుతుంది… హత్యాయత్నం కేసు,.. అదీ పెద్ద కేసే… ఇప్పటికే ఇంట్లో మానసిక వైకల్యంతో ఉన్న ఓ చిన్న పిల్ల… ఇప్పుడు ఇది… ఆ పిల్లాడి పరిస్థితి ఏమిటి..?

ఐసీడీఎస్ పనితీరు ప్రపంచం మొత్తానికి తెలుసు… అసలే పుట్టుకతో వచ్చిన అనారోగ్యంతో ఆ పిల్లాడికి నరకం… ఇక సర్కారీ మార్క్ ట్రీ‌ట్‌మెంట్‌తో మరో నరకం… రేప్పొద్దున ఆ పిల్లాడి బాగోగులు చూడాల్సింది ఎవరు..? జీవితకాలం శిక్ష పిల్లాడికి, భరించేవారికి..? అసలే బొటాబొటీ సంసారం, ఈ కేసులు, సామాజికంగా ఇప్పుడు ఎదుర్కునే నిందలు… ఆ కుటుంబం అనుభవించే వేదన విదారకం…

పిల్లాడిని బతికి ఉండగానే చంపే ప్రయత్నం చేసిన వాళ్లకు ఇదేమీ అమానవీయ మద్దతు కథనం కాదు… యాంటీ సెంటిమెంట్ కూడా కాదు… కాకపోతే నాణేనికి మరోవైపు ఉండే కన్నీటి తడిని కూడా ఆ వార్త చూపి ఉంటే… ఆ స్టోరీ మరింత బాగుండేది కదానే భావన… అంతే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Rahen na rahen hum… remembering great singer suman kalyanpur…
  • ఆక్రమణ దురుద్దేశాలు లేకపోతే… చెరువులో ఈ కంచె ఏమిటయ్యా…!?
  • దుష్ట శిక్షకుడు పబ్లిక్ రౌడీ… చెడ్డ పనుల దుష్ట రౌడీ… బోత్ ఆర్ నాట్ సేమ్…
  • అప్పట్లో జోసెఫ్ విజయ్ మహా సిగ్గరి… చిన్న కళ్లు, బక్కగా, నల్లగా… కానీ..?
  • బాల్క సుమన్‌పై తెలంగాణ సర్కారు సీరియస్… దేశద్రోహం కేసు..!!
  • తుమ్మిడిహెట్టి… రేవంత్ సీరియస్ టోన్… ఫడ్నవీస్ వింటున్నావా..?
  • తెలంగాణపైకి వలసవాదం ముంచుకొస్తోంది అనడమే పెద్ద వంచకభాష..!
  • The Scape Goat… అదే ఆ పాత కథే… అనేక భాషలు… వందల సినిమాలు…
  • షర్మిలకు రాజ్యసభ సీటు..! ఏపీ కాంగ్రెస్ పార్టీకి ఫాయిదా ఏమిటట..!?
  • blood money … క్లౌడ్ ఫండింగ్‌తో ఒక ప్రాణం నిలబడింది …

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions