.
ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి మరో శరాఘాతం… ప్రత్యేకించి కేసీయార్ కుటుంబానికి… మరీ ప్రత్యేకించి కవితకు… ఇరకాటంలో పడినట్టే… ఆల్రెడీ ఢిల్లీ మద్యం స్కాంలో ఆమె ఎదుర్కొంటున్న ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నట్టుగా ఉంది ఈ కేరళ మద్యం కుంభకోణం…
ఐతే రాజకీయాల్లో, ప్రజాజీవితంలో ఉన్నప్పుడు ఆరోపణలు వస్తుంటాయి… ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేస్తూనే ఉంటాయి… కానీ ఇది కాస్త భిన్నంగా ఉంది… ఎందుకంటే..?
Ads
ముందుగా ఆరోపణలు ఏమిటో చూద్దాం… కేరళలో 2023లో కొత్తగా మద్యం పాలసీని మార్చారు, వెంటనే ఒయాసిస్ అనే లిక్కర్ కంపెనీకి అనుమతులు ఇచ్చేసింది సీపీఎం పినరై విజయన్ ప్రభుత్వం… ఈ లైసెన్స్ విషయం అక్కడి ఇతర లిక్కర్ డిస్టిలరీలకు కూడా తెలియదు…
మద్యం తయారీ యూనిట్ ఏర్పాటు చేసిన చోట నీటి సమస్య… గతంలో అనేక ప్రాజెక్టులనూ వద్దన్నారు… ఐనా సీపీఎం ప్రభుత్వం ఈ ఒయాసిస్కు లైసెన్స్ అక్కడే తయారీ చేయడానికి ఇచ్చింది… ఒయాసిస్ కంపెనీకి అనుమతులు ఇప్పించడంలో కీలక పాత్ర కవితది…
…. కేరళలో విపక్ష కాంగ్రెస్ నేత VD సతీశన్ చేసిన ఆరోపణలు ఇవి… వేరే పత్రికల్లో ఈ వార్త పెద్దగా కనిపించలేదు, ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ స్టోరీ… అఫ్కోర్స్, వార్తకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఎక్కువే… నిన్న సోషల్ మీడియా కూడా దీన్ని పట్టుకున్నట్టు లేదు… ఈ ఆరోపణల్ని కవిత తీవ్రంగా ఖండించింది… నిరాధార, ఉద్దేశపూర్వక అబద్ధపు, నీచమైన ఆరోపణలపై లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించింది…
కేరళ ప్రభుత్వ ముఖ్యులు కూడా స్పందించారు, ప్రతిగా కాంగ్రెస్ నేతల మీదా విమర్శలు చేశారు… అదంతా పక్కన పెడితే… తెలంగాణ రాజకీయాలకు సంబంధించి దీనికి ప్రాధాన్యం ఎందుకు వచ్చిందంటే..?
కవిత ఢిల్లీ మద్యం స్కాంలో నిందితురాలు, బెయిల్ మీద ఉంది… కొన్నాళ్లు జైలులో ఉండి వచ్చింది… ఆ తరువాత చాన్నాళ్లు సైలెంటుగా ఉండి, ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ అవుతోంది… ఇప్పుడిక సేమ్ అలాంటిదే మద్యం స్కాంలో తన పాత్ర మీద ఆరోపణలు…
సచ్ఛీలత గురించి పదే పదే చెప్పుకునే ఒక ఆప్, ఒక సీపీఎం రెండూ ఒకేతరహా మద్యం స్కాంలో బదనాం అవుతున్నాయి… ఢిల్లీలో సీఎం జైలుకు వెళ్లాల్సి వచ్చింది… ఈ రెండు స్కాం ఆరోపణల్లోనూ కవిత పేరు వస్తోంది… సో, పినరై విజయన్, కేజ్రీవాల్ రెండూ నిప్పులేమీ కావు… తెలంగాణ రాజకీయాల్లో సీపీఎంకూ బీఆర్ఎస్కూ పొసగదు… కానీ ఇలాంటి స్కాముల్లో మాత్రం శృతి కలుస్తున్నదా..?
ఢిల్లీ స్కాం ఆరోపణలు, కేసులు బీజేపీ ఉద్దేశపూర్వకమని బీఆర్ఎస్ కొట్టిపారేస్తోంది… ఈ కేరళ స్కాం ఆరోపణలు కాంగ్రెస్ అబద్ధపు ప్రచారమనీ ఇప్పుడు కొట్టిపారేస్తుంది… సరే, కాంగ్రెస్తో ఎలాగూ తెలంగాణలో రాజకీయ వైరం తప్పదు… కానీ కేరళ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్ని తెలంగాణ కాంగ్రెస్ అందుకోలేదు ఎందుకో మరి…
బీజేపీని బజారుకు లాగి రచ్చ రచ్చ చేయడానికి కేసీయార్ ప్రయత్నించినా సరే… ఇప్పుడు ఆ పార్టీకి బీఆర్ఎస్తో కొనసాగుతున్నది వైరమో, స్నేహమో ఎవరికీ అర్థం కాదు… సూపర్ సిక్స్ హామీల అమలులో కిందామీదా పడుతున్న కాంగ్రెస్ ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి బహుశా కవిత కేరళ స్కాం మీద ఇక దాడి మొదలు పెడుతుందేమో..!!
Share this Article