Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ జర్నలిస్టు అరెస్టు దుర్మార్గమే… కానీ ఆ జర్నలిజాన్ని ఏమందాం…?!

March 12, 2025 by M S R

.

జర్నలిస్టు రేవతి మీద నిన్న కేసు నమోదు చేసినట్టున్నారు… ఉదయం అరెస్టు చేశారు… వెంటనే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఖండిస్తూ పోస్టులు… ఆ వెంటనే హరీష్ రావు, కేటీయార్ ఖండనలు… సర్కారు ఫాసిజం, దుర్మార్గం అంటూ… నిజమే, అసలు ఈ సత్వర స్పందనలు హాహాకారాల వెనుక నిజమేమిటో అర్థమవుతోంది గానీ… జర్నలిస్టులపై కేసుల్ని ఖండిద్దాం గానీ… దుర్మార్గమే గానీ… కానీ..?

నిజానికి కొన్ని విషయాలు చెప్పుకోవాలి… అప్పట్లో ఈమె రవిప్రకాష్ సొంత చానెల్ మోజో టీవీని నిర్వహించేది… అప్పట్లో మై హోంకూ అనగా అప్పటి కేసీయార్ క్యాంపుకూ మోజో టీవీ, రవిప్రకాష్ అంటే పడలేదు, కేసులు పెట్టుకున్నారు, యుద్ధం నడిచింది తెలుసు కదా… టీవీ మూతపడింది… తరువాత ఏదో యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసినట్టు గుర్తు, పర్లేదు, తప్పేమీ లేదు…

Ads

అప్పుడు ఇదే సీఎం రేవంత్ రెడ్డి వాళ్లకు అండగా నిలబడినట్టు కూడా గుర్తు… కానీ అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే రేవతిని అరెస్టు చేయించాడు… ఇదీ కంట్రాస్టు… అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారికి వ్యతిరేకంగా మోజో టీవీలో కథనాలు ప్రసారం చేసినందుకు తనపై కక్షకట్టారని ఆమె చెప్పుకుంది… (అవి యాజమాన్యం బాపతు గొడవలు… వాటిల్లో జర్నలిజం వాసనలేమీ లేవు…)

2019 జనవరిలో ఆమెపై వరప్రసాద్ అనే వ్యక్తి ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెట్టగా, జులైలో ఆమెను ఇలాగే ఇంటికొచ్చి మరీ బలవంతంగా అరెస్టు చేశారు… సో, ఈమె అరెస్టు ఇది రెండోసారి… అప్పట్లో ఆమె మీద కక్షకట్టి నానారకాలుగా వేధించిన అదే బీఆర్ఎస్ ఇప్పుడు రేవతి అరెస్టును, ఆమె టీమ్ మెంబర్ తన్వి అరెస్టును ఫాసిజం అంటోంది…

అరెస్టుకు, కేసు పెట్టడానికి కారణమైన ఆ వీడియో ఏమిటబ్బా అని ఆమె ఎక్స్ ఖాతాను, పల్స్ యూట్యూబ్ చానెల్‌లో ఒక వీడియోను చూస్తే… పరమ వెగటుగా ఉంది… జర్నలిస్టు కమ్యూనిటీ, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందీ అన్నట్టు… అది జర్నలిజమా.,.? దీనికి ఓ పార్టీ మద్దతా..? (ఎవరు ఫండింగ్..?) ఆ ఇంటర్వ్యూయర్ ఎవరో రైతును ఏదో అడిగితే పచ్చి బూతులు తిడుతున్నాడు సీఎంను… మొత్తం స్క్రిప్టెడే…

సీఎంను అలా తిట్టొద్దు అంటూ నీతులు చెబుతున్న సోకాల్డ్ లేడీ జర్నలిస్టు (ఈ మాట అనడానికి గానీ, ఆ వీడియో లింక్ ఇక్కడ పోస్ట్ చేయడానికి గానీ మనసొప్పడం లేదు…) అదే వీడియోను జనబాహుళ్యంలోకి ఎందుకు తీసుకొచ్చినట్టు..? అది చూశాకే ఇది రాయాలనిపించింది… తిట్టించి, అబ్బే తిట్టడం తప్పోయ్ అంటూనే ఆ తిట్లను తెలివిగా జనంలోకి పంపించి..!!

మొత్తం ఆ చానెల్ వీడియోలన్నీ సీఎంను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెల్ చేస్తున్నాయి… ప్రభుత్వ వ్యతిరేక కథనాలు ప్రజల్లోకి తేవడం తప్పుకాదు, సీఎంను కార్నర్ చేయవద్దనీ అనడం లేదు, నిజానికి అవసరమే… కానీ ఆ వీడియోలు ఏ ప్రమాణాల్లో ఉన్నాయనేదీ ముఖ్యమే… రేవతిని, ఆమె టీమ్‌ను సపోర్ట్ చేసేవాళ్లు ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి….

ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేస్తే కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అనే ప్రశ్నే కరెక్టు కాదు… ఒక జర్నలిస్టుపై కేసు, అరెస్టు దుర్మార్గం, పైగా లేడీ జర్నలిస్టులు… కానీ జర్నలిస్టులుగా మనమేం చేస్తున్నాం..? ఒక్కసారి పాఠకులు (సజెస్ట్ చేస్తున్నందుకు సారీ) ఆమె ఎక్స్ ఖాతాలోకి వెళ్లి పల్స్ వీడియో చూడండి… ఎలపరం అంటారు కదా, అదీ కలిగేది…

(పైగా ఈ వీడియో ఎవరూ షేర్ చేయొద్దు, కేసులపాలవుతారు అని ఓ ట్వీట్ హెచ్చరిక కూడా చేసింది… అవును, అదే జరిగింది… ఏయే నెలల్లో సీఎం ఎలాంటి బూతులు వాడాడో ఓ క్రోడీకరణ వీడియో చేసినట్టున్నారు… సో, మేం కూడా బూతుల్ని ప్రయోగిస్తాం అనే సమర్థనా ఇది..?)

(పైగా అది తన సహజ భాషలో చెబుతున్నాడు అని ఓ చెత్తా సమర్థన… అంటే తెలంగాణ రైతు భాష వెగటు బూతు భాషా..? దరిద్రపు, నీచపు, థర్డ్ రేట్, వల్గర్, చెత్తా జర్నలిజం… ఇది తెలంగాణ రైతాంగాన్ని అవమానించడమే… శుష్క రాజకీయాల కోసం…)

(కావాలనే కేటీయార్ రాహుల్‌ను ట్యాగ్ చేశాడు… కానీ నెటిజనం ఫుల్లు నెగెటివ్‌గా రియాక్టవుతోంది… కౌంటర్ ప్రొడక్ట్…)

రేవతి

https://muchata.com/wp-content/uploads/2025/03/WhatsApp-Video-2025-03-12-at-09.46.09.mp4

@revathitweets అని ఖాతా… ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులతో ఆమె ఇంటికి వచ్చారు… రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్‌లను బలవంతంగా లాక్కెళ్లారు… రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్‌ను సైతం సీజ్ చేశారు… ఆ వెగటు పెయిడ్ వీడియో చేసిన తన్విని కూడా అరెస్టు చేశారు…

ఎస్… ప్రభుత్వం లేదా అధికార పార్టీ రియల్ జర్నలిజం నోరు మూయడాన్ని ఖండించడం ఎంత అవసరమో… ఇలాంటి జర్నలిజాన్ని ఖండించడం కూడా అంతే అవసరం… యూట్యూబ్ భాష, పరిమితులు, కంటెంటు, ద్వేషవ్యాప్తి తదితరాలు విపరీతంగా విమర్శలకు గురవుతున్న నేపథ్యంలో… డిబేట్ అవసరమే… నియంత్రణ ఎలా..!?

.

.

సారీ, సారీ, మరిచిపోయాను… కోట్లాది మంది భక్తుల విశ్వాసాల్ని పాతరేస్తూ ఇదుగో ఈ రేవతి టీమ్ శబరిమలలోకి రుతు మహిళల్ని ప్రవేశపెట్టబోయింది… ఎస్, రేవతీ… నీ ప్రజెంట్ స్పాన్సర్స్ ఎవడు నిన్ను సపోర్ట్ చేసినా సరే… వాడికీ, నీకూ అయ్యప్ప ‘ఆశీస్సులు’ లభించాయి…. గుడ్… ఇంకా బాకీ ఉందేమో…

.

.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions