.
కుహనా సెక్యులరిస్టులు… ఈ పదం వాడినందుకు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయట… ట్రోలింగ్… వాళ్లలో ఎవరికీ నిజమైన సెక్యులరిజానికి, ఫేక్ సెక్యులరిజానికీ తేడా తెలియదు… సరే, అలాంటోళ్లు చాలామంది ఉన్నారు, ఉంటారు…
మన దాకా వస్తే గానీ తెలియదు సమస్య తీవ్రత ఎంతో… బెంగాల్‌లో ఇలాంటి సెక్యులరిస్టులు చాలామంది ముర్షీరాబాద్ వదిలి, ప్రాణాలు అరచేత్తో పెట్టుకుని వలసపోతున్నారు… సరే, ఆ డీప్ చర్చ వదిలేసి విషయానికి వద్దాం…
Ads
రాబర్డ్ వాద్రా… ఈ దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన నెహ్రూ కుటుంబపు అల్లుడు… హర్యానాలో కొన్ని వందల ఎకరాల్ని కాజేసిన కథల్ని పక్కన పెడితే… తను ఇప్పుడు ఏమంటున్నాడు..?
ఈ దేశంలో ముస్లింలు వీక్ అయిపోయామని అనుకుంటున్నారట, అందుకని పహెల్‌గాం చర్యతో మోడీకి సంకేతాలు, సందేశాలు ఇచ్చారట… హిందూ ముస్లిం విభజన కారణంగా మతగుర్తింపుతో మరీ చంపేసి మోడీకి మెసేజ్ ఇచ్చారట… ఉగ్రవాదానికి ఇంతకు మించి పాకిస్థానీయుల నుంచి కూడా సపోర్ట్ లభించదేమో…
సో, అందుకని పాకిస్థాన్ నుంచి వచ్చి మరీ హిందూ పర్యాటకుల మతాన్ని నిర్ధారించుకుని మరీ చంపారన్నమాట… తప్పేమీ లేదన్నమాట… ఇది దేశం మీద ఉగ్రవాదుల, పాకిస్థానీ ముష్కరుల దాడి కాదు, జస్ట్, మోడీకి ఓ సందేశం అన్నమాట…
అర్థమైంది కదా… ఇదీ రాబర్ట్ వాద్రా నైజం… ఇదీ సెక్యులరిజం… సంఘటనను యాంటీ బీజేపీ కళ్లతో మాత్రమే చూసే మూర్ఖత్వం… దాన్నే సూడో సెక్యురిజం, ఫేక్ సెక్యులరిజం, కుహనా సెక్యులరిజం అంటే అందులో తప్పేముంది…?
దేశం వేరు, పార్టీ వేరు… ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండవచ్చుగాక… కానీ దేశం మీద దాడిని కూడా, ఉగ్రవాద చర్యలను కూడా ఒక పార్టీ కోణంలోనే చూస్తూ… పరోక్షంగానో, ప్రత్యక్షంగానో బీజేపీని నిందిస్తే చాలుననే పోకడల్ని ఏమనాలి..? ఫేక్ సెక్యులరిజాన్ని నిందిస్తే ఇక బీజేపీ మనిషేనా..?
దేశం మీద దాడిని, ఉగ్రవాద చర్యల్ని కూడా యాంటీ బీజేపీ కోణంలో చూస్తూ… ఏదోరకంగా ఉగ్రవాద దుశ్చర్యను సమర్థించే పోకడలను ఏమందాం..? ఈ దేశంలో ఇలాంటి భావజాలమున్న కేరక్టర్లు కోకొల్లలు…
ఇక్కడ ఓ విషయం చెప్పాలి… అసదుద్దీన్ ఒవైసీ… తను పక్కా ముస్లిం వాయిస్… కీలకమైన అనేక అంశాలపై జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తుతాడు… గుడ్… తప్పులేదు… ఈ ఉగ్రవాద చర్య మీద కూడా ఏమాత్రం తొట్రుపాటు, తడబాటు, అస్పష్టత లేకుండా క్లియర్ కట్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు…
గతంలో ఐసిస్ వంటి ఉగ్రవాదాన్ని కూడా ఖండించాడు… ఇప్పుడు కూడా దేశం కోణంలోనే చూశాడు… అది ఖచ్చితంగా మత ఉగ్రవాదమే అన్నాడు… మోడీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశాడు… ఎస్, ఒవైసీ,… ఈ సోకాల్డ్ రాబర్ట్ వాద్రా వంటి సూడో సెక్యులర్, ఉగ్రవాద సమర్థకులకన్నా వేలరెట్లు బెటర్, బెటర్…
అవునూ, నెహ్రూ కుటుంబపు అల్లుడు రాబర్ట్ వాద్రా వైఖరే ఆ కుటుంబం వైఖరా..? ఆ కుటుంబం లీడ్ చేస్తున్న పార్టీ వైఖరా..? యావత్ దేశం క్లారిటీ కోరుకుంటున్నది…!!
Share this Article