Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాకిస్థాన్‌కే ‘ట్రంపు’ కార్డు…! అతనెప్పుడూ ఇండియాకు ‘అమిత్రుడే’…

June 12, 2025 by M S R

.

పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు… పాకిస్థానీ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌ను అమెరికా తన ఆర్మీ డే ఉత్సవాలకు ఆహ్వానించిందనేది వార్త… ఇందులో ఆశ్చర్యపడటానికి ఏమీ లేదు… ట్రంపుకీ పాకిస్థాన్‌కూ నడుమ బలమైన ఆర్తిక, హార్దిక సంబంధాలున్నయ్…

ట్రంపు ఎప్పుడూ ఇండియాకు అమిత్రుడే… మోడీ వెళ్లి కౌగిలించుకున్నా, తనకు ప్రచారం చేసినా… ట్రంపు చెబుతున్నట్టుగానే వింటున్నా సరే… ఎప్పుడూ ట్రంపు ఇండియాకు దోస్త్ కాదు… పైగా మనకు నష్టదాయకుడు…

Ads

కాస్త వివరంగా చెప్పుకుందామా..? ట్రంపు ఎంతటి డబుల్ గేమ్ ప్లేయరో… పైపైన మనకు అర్థమైనకాడికి.., పెద్ద లోతుల్లోకి కూడా వెళ్లాల్సిన పనిలేదు…

pak

తెర మీద వేరు… తెర వెనుక వేరు… మన ప్రధాన శత్రువులు పాకిస్థాన్, చైనా మాత్రమే కాదు.., మాల్దీవులు, టర్కీ, అజర్‌బైజాన్ ఎట్సెట్రా… మరి మన మిత్రులు, కాలపరీక్షకు నిలిచింది రష్యా, ఇజ్రాయిల్… అంతే… మరి అమెరికా..?

సరళంగానే చెబుతాను, వాణిజ్య, యుద్ధ పరిభాషలో కాకుండా…. ‘‘ట్రంపు కుటుంబానికి ఓ కంపెనీ ఉంది, అది భవిష్యత్ క్రిప్టో కరెన్సీకి సంబంధించింది… పేరు ఫిన్‌టెక్ కంపెనీ… ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో పాటు ఆయన అల్లుడు జెరెడ్ కుష్నర్‌లకు మొత్తం 60 శాతం వాటా అందులో… అంటే దాదాపు వాళ్ల సొంతం…

దక్షిణాసియాలోనే పాకిస్థాన్‌ను క్రిప్టో కేపిటల్ చేయాలని అమెరికా ప్లాన్… దానికి ఈ ట్రంపు కుటుంబ కంపెనీ ఫిన్‌టెక్ కంపెనీకి ప్లస్ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే కంపెనీతో పొత్తు… దానికి క్రిప్టో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన బైనాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావోను తమ సలహాదారుగా నియమించారు… మరి క్రెడిబులిటీ కావాలి కదా…

మరి పాకిస్థాన్..? ఇటీవలే ఏర్పాటు చేసింది పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్… దీంతో సదరు ట్రంపు ఫ్యామిలీకి చెందిన క్రిప్టో కంపెనీతో ఒక ఒప్పందం కూడా జరిగింది… అందులో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ రాజకీయ, వ్యాపార ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నట్టు సమాచారం…

అంటే అంతిమంగా అర్థమైంది ఏమిటి..? ట్రంపుకూ, క్రిప్టో కరెన్సీకి, పాకిస్థాన్ ముఖ్యులకూ నడుమ ఆర్థిక, హార్దిక సంబంధాలు… పాకిస్థాన్ వైపు లీడర్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్… ఆర్మీ చెప్పినట్టే కదా పాకిస్థాన్ వినేది… ఓసారి ట్రంపు టీమ్ పాకిస్థాన్ వస్తే ఏకంగా మునీర్ స్వాగతం పలకడమే కాదు, ప్రధానితో భేటీ కూడా…

ఈ బృందానికి నేతృత్వం వహించిన వ్యక్తి జెకరీ విట్‌కాఫ్ ట్రంప్‌కి వ్యాపార భాగస్వామిగా పనిచేసిన స్టీవ్ విట్‌కాఫ్ కుమారుడు… స్టీవ్ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్ ప్రత్యేక రాయబారిగా ఉన్నాడు… (టైమ్స్ పబ్లిష్ చేసిన స్టోరీయే ఇది…)

అర్థమైంది కదా… పాకిస్థాన్‌కూ ట్రంపుకీ నడుమ ఎలాంటి బంధాలున్నాయో… ఇక చదవండి, ఒక్కో వార్తనూ విడిగా కాదు, క్రోడీకరించుకుంటూ…. కలిసి చదువుకుంటూ…

… ట్రంపు రాగానే ఇండియన్ ఉద్యోగులు, వలసదారులు, విద్యార్థులపై పిడుగులు కురిపిస్తున్నాడు…

… వాడు మనపై టారిఫ్ వేస్తాడట గానీ ఇండియా జీరో టారిఫ్ అమలు చేయాలట…

…. వాణిజ్యం పేరు చెప్పి నేను పాక్, ఇండియా నడుమ కాల్పుల విరమణకు ఒప్పించాను అంటున్నాడు…

…. యాపిల్ వంటి సంస్థలు ఇండియాలో ఉత్పత్తిని పెంచకూడదట…

అంతెందుకు… పాకిస్థాన్‌కు మత దోస్తు తుర్కియేకు ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లు అమ్మాలని అమెరికా నిర్ణయించింది… విలువ 2000 కోట్లు… ఇది తాజా నిర్ణయం…

కొలువులు, వీసాలు, చదువులు, గ్రీన్ కార్డులు, బై బర్త్ సిటిజెన్ షిప్ అన్నింట్లోనూ ట్రంపు ధోరణి ఇండియన్లకే అధిక నష్టం… చివరకు మనవాళ్లు మనకు డబ్బు పంపితే 5 శాతం కట్ చేస్తాడట… ట్రంపు గురించి చెబుతూ పోతే ఎన్నెన్నో ఇలా…

…. 1000 డాలర్లు కడితే తక్షణ ఇంటర్వ్యూలు అట… అంత కట్టినా వీసా ఇస్తారని కాదు, జస్ట్, ఇంటర్వ్యూకు చాన్స్…

…….. ఎస్, ట్రంపుడు పక్కా భారత వ్యతిరేకి… ఎందుకు..? అమెరికా మొదటి నుంచీ అంతే… జస్ట్, మధ్యలో చైనాకు అనుకూలంగా కాస్త రష్యా తోక జాడించింది గానీ అది ఇప్పటికీ మన నిజమైన మిత్ర దేశం… దాన్ని మించిన మిత్రుడు ఇజ్రాయిల్… అంతే… (అమెరికాతో ఎంత దోస్తానా ఉన్నా సరే, మనం పాలస్తీనాను సపోర్ట్ చేస్తున్న కాలంలోనూ… ఇజ్రాయిల్ ఎప్పుడూ ఇండియా పట్ల అమిత్ర భావనతో లేదు, సహకరించేది కూడా…)

మరి అమెరికా..? దానికి ఇండియా పెద్ద వినిమయ మార్కెట్ కావాలి, ఆయుధాలు అమ్ముకోవాలి… చైనాతో వైరానికి ఓ అడ్డా కావాలి… ఇలా… అమెరికా ఆలోచనలు, అడుగులు ఎప్పుడూ ఇండియాకు వ్యతిరేకమే… ఈ పహల్‌గామ్స్, ఈ ఆపరేషన్ సిందూర్స్… అది ఏవో బెదిరింపులతో కట్టడి చేస్తుంది.,.

వాడికి పాకిస్థాన్ సుభిక్షంగా ఉండాలి… అందుకే మనం వద్దంటున్నా వాడికి ఐఎంఎఫ్ రుణమిస్తుంది… విచిత్రం ఏమిటంటే… పాకిస్థాన్ చైనా తొత్తు… ఆ చైనాకూ అమెరికాకూ పడదు… ఓ సంక్లిష్ట అంతర్జాతీయ రాజకీయ సమీకరణం… ఎస్, చైనా మాత్రమే కాదు, పాకిస్థాన్‌‌కు అమెరికా కూడా ‘ట్రంప్’ కార్డే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ ఒక్కడి ఆ బలహీనత- చైనా హానీట్రాప్- కుప్పకూలిన ‘బ్లూచిప్’…
  • G O A T … అనగా మేక, అనగా బకరా… అనగా తెలుగు ప్రేక్షకుడు..!!
  • పాపం రెహమాన్ ! కచేరీలకు ఆదరణ కరువు ! చుట్టూ బోలెడు నెగెటివిటీ !!
  • Overhauling Telangana’s Schooling: A Bold Step Toward Educational Equity
  • పాఠశాల విద్య సంస్కరణలు- బీఆర్ఎస్‌కు చేతకానిది, రేవంత్ సంకల్పించినది!
  • 3200 కోట్ల మంది హిందూ దేవతలట… మమత పార్టీ ఎంపీ పిచ్చి కూతలు!!
  • పార్టీ పేరు దగ్గర మొదలైన కసరత్తులోపం… ఆవిర్భావ ప్రసంగం దాకా..!!
  • టీవీకే ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ రహస్య భేటీలు- దేనికంటే..?
  • పక్కా అర్హుడు! ప్రణబ్ ముఖర్జీ ప్రధాని పదవి ఆశించి ఉంటే తప్పేముంది…!
  • కావ్య అనిరుధ్ పెళ్లి … కరుణానిధి – రజినీకాంత్ కుటుంబాల వియ్యం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions