Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఖలేజా ఎందుకు ఫ్లాప్..! త్రివిక్రముడు ఏం తప్పు చేశాడంటే..?

May 27, 2025 by M S R

.

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిశ్యతే ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

Ads

దేవుడూ అతని సృష్టీ పరిపూర్ణాలు, పరస్పర పూరకాలు. కావున పూర్ణంతో ఇంకో పూర్ణాన్ని కలిపినా, వేరుచేసినా, గుణించినా, పూర్ణమే మిగులుతుంది. అలా ఈ ప్రపంచమంతా భగవంతుడి స్వరూపమే అని ఈశావాన్యోపనిషత్తు లోని ఆ శ్లోకం అర్ధం.

“దైవం మానుష రూపేణ” అని చెప్పడానికి తీయాలనుకున్న కథ ఖలేజా. ఉద్దేశ్యం ఉదాత్తమైనదే..‌!

పాతిక మంది కేంద్ర మంత్రులూ, వందకు పైగా ఎంపీలూ, ఓ ‌బిజినెస్ మాగ్నెట్టూ కలిసి “పాలి” అనే గ్రామంలో ఉన్న ఇరీడియం నిక్షేపాలను కొల్లగొట్టడం కోసం ఆ ఊరి జనాభాను ఖాళీ చేయించాలనుకుని ఆ ప్రాంతాన్నంతా ‌విషపూరితం చేస్తారు. ఆ ఊరి ప్రజలు దిక్కు తోచక దేవుణ్ని వెదుకుతుంటే హీరో దొరికి, వాళ్ల పాలిటి దేవుడై ఆ ఊరినీ, జనాన్నీ రక్షిస్తాడు. ఇదీ కథ..!

కథ ఎత్తుగడ పాలి గ్రామంలో సుగ్రీవుడు హనుమంతుడిని రాముణ్ణి వెదకడం కోసం పంపుతున్నట్టుగా గొప్పగా మొదలై, పది‌నిమిషాల్లో నీరసపడిపోతుంది. డిజైనర్ బట్టలు మాత్రమే వేసుకునే హీరో ఓ క్యాబ్ డ్రైవర్. కథ శ్రీకాకుళం జిల్లా “పాలి”లో మొదలై, ఒరిస్సానో, బెంగాలో వెళ్లకుండా రాజస్థాన్ లో తేలుతుంది.

నీళ్ల సీసా కోసం పేద్ధ యుద్ధమైన మరుక్షణం కామెడీ మొదలౌతుంది. విద్యావంతురాలు, ఐశ్వర్యవంతురాలైన కథానాయిక కాలిగోటికి పనికిరానివాళ్లు ఆమెని దరిద్రం, శనీ అంటుంటారు. హీరోని సాక్ష్యం లేకుండా చంపడానికి విలన్లు ఎత్తుగడ వేసి రాజస్థాన్ పంపారని ఇంటర్వెల్ ముందు తెలుస్తుంది.

తర్వాత హీరో దేవుడని నమ్మించే ప్రయత్నం; హీరో‌ తాను ‌దేవుణ్నే అని నిర్ధారణకు రావడం అయ్యేసరికి రెండు గంటల స్క్రీన్ టైం పడుతుంది. మిగిలిన నిమిషాల్లో హీరో దుష్ట సంహారం చేసి పాలి గ్రామాన్ని విలన్ల పాలి నుండి రక్షిస్తాడు.

సినిమా కథ నిడివి సాధారణంగా ‌రెండున్నర గంటలు. మొదటి పదినిమిషాల్లో కథావస్తువు తెలియకపోతే చూసేవాడికి బుర్రకెక్కదు. దృశ్యప్రధాన మాధ్యమమైన సినిమాని కేవలం మాటలతో గట్టెక్కించాలనుకుంటే కుదరదు. అంతర్జాలపు హాస్యాన్ని యథాతథంగా కుమ్మరిస్తామంటే చూడడానికి ప్రజలు వెర్రి వెంగళప్పలు కాదు. హాస్యనటులను బఫూన్లుగా చూయిస్తే రాణించదు.

బిలియనీరు, శుద్ధవ్యాపారి ఐన ప్రతినాయకుడు, హింస లేకుండా ఊరిని ఆక్రమిద్దామనుకున్న వాడు, చివర్లో గన్నులూ, గూండాలనేసుకుని మీదడిపోవడం అసలైన కామెడీ.

****
సినిమా మొదలైన అరగంటలో హీరో దేవుడిలా ఊరిని రక్షించడానికి రంగప్రవేశం చేసి, రాముడిలా కష్టాలకోర్చి, ఒక్కొక్క ఆటంకాన్ని దాటుతూ (శివలో లాగా) చివరికి కార్యసాధన చేస్తే ఫలితం ఇంకోలా ఉండేదేమో..!

చిరుగుల పంచెకి ఎంత డాబు ఉన్న అంచు ఉంటే మాత్రం ఏం లాభం.‌.?

శ్రేష్టమైన ములక్కాడలూ, కూర ముక్కలూ, చింతపండూ, పప్పూ, ఇంగువా, దినుసులూ తీసుకుని కలిపినా రుచిలేని పప్పుచారిది…! అందుకే సినిమా యూట్యూబ్, టీవీల్లో‌ బిట్లుబిట్లుగా హిట్టై థియేటర్లలో ఫట్టుమంది….. [[  గొట్టిముక్కల కమలాకర్  ]]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!
  • ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…
  • హలో సారూ… తెలంగాణపై ఎవరికీ పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ…
  • చివరకు తోడు ఓ పడక మంచమే… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…
  • ఇది దీపిక పడుకోన్ కాలం… దీపిక చిఖిలియా రోజులు కావు తల్లీ…
  • ఉప్పుకప్పురంబు…! మహానటి బ్రాండ్ ‘కీర్తి’ పలుచన…!!
  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…
  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions