Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబ్బో… ఆ పిచ్చి కూతలు ప్రేమతో చేశాడట, సారీ చెప్పడట…

May 29, 2025 by M S R

.

మొన్ననే చెప్పుకున్నాం కదా… కమలహాసన్ గొప్ప నటుడు అని… ఎవరికీ డౌట్ లేదు… అది తెర మీద కనిపించేది… ఇండియా గర్వించదగిన హీరో… రైట్… కానీ ఒక మనిషిగా మూర్ఖుడు అనిపించుకుంటూ గతంలో బోలెడు వ్యాఖ్యలు చేశాడు…

ఏదో పార్టీ పెట్టాడు… ఆ సినిమా అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్… సరే, మక్కల్ నీది మయ్యం అనే తన పార్టీకి ఓ సిద్ధాంతం, ఓ ఎజెండా ఏమీ ఉండదు… నేను మోస్ట్ పాపులర్ నటుడిని, నాకు వోట్లేయాలి, అంతే… అర్జెంటుగా పాలిటిక్స్ అనే సినిమా కూడా హిట్టయిపోయి ఎంజీఆర్, ఎన్టీఆర్‌లాగా సీఎం అయిపోవాలనే కోరిక… అత్యాశ…

Ads

సరే, రాజకీయాల్లోకి వచ్చాక కమిటెడ్‌గా జనం సమస్యల మీద వర్క్ చేస్తూ, పొలిటికల్ బేస్ విస్తరించుకుంటూ, ప్రజల ఆదరణ, నమ్మకం పెంచుకుంటూ… జనంలోనే ఉంటారా..? నో… ఏ ఎన్నికలో వచ్చినప్పుడు రాజకీయ తెర మీదకు రావడం, తరువాత తమ కమర్షియల్ సినిమాలేవో తాము చేసుకోవడం…

ఇదీ సరే అనుకుందాం… పార్ట్ టైమ్ పాలిటిక్స్… అది ప్రజాజీవితం కాదు, ఐనాసరే, సగటు సినిమా సెలబ్రిటీలాగే పిచ్చి కూతలకు దిగినప్పుడు, ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు కాస్త బేసిక్ మానవసహజమైన విచక్షణ ఉపయోగించాలి కదా… ఆ సోయి కూడా లేదు ఈ మనిషికి…

ఎందుకంటే..? కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అనే థగ్‌లైఫ్ సినిమా ప్రమోషన్ సందర్భంగా అన్నాడు… అజ్ఞానం… తనకు ఏమీ తెలియదు… చివరకు పిచ్చి కూతలకు దిగొద్దు అనేదీ తెలియదు… సరే, కర్నాటక సీఎం, కర్నాటక బీజేపీ ముఖ్యులు సహా కన్నడ భాషా ప్రేమికుల సంఘాలతో సహా అందరూ భగ్గుమన్నారు…

కాస్త విజ్ఞత ఉన్నవాడైతే లెంపలేసుకోవాలి, ఎందుకంటే తనకు భాష గురించి ఏమీ తెలియదు, పైగా తనే చెబుతున్నాడు… చెబుతూ అదే పొగరు… ‘‘ఆ వ్యాఖ్యలు ప్రేమతో చేసినవి, ప్రేమ క్షమాపణ చెప్పదు’’ అట… నా వ్యాఖ్యల్లో వేరే ఉద్దేశం లేదని అంటూనే భాష గురించి వ్యాఖ్యలు చేసే అర్హత రాజకీయ నాయకులకు లేదంటాడు…

మరి తనకు ఏ అర్హత ఉంది, తమిళాన్ని ఎత్తుకుని కన్నడాన్ని కించపరచడానికి..? పైగా కన్నడ భాష గురించి నిరంతరం తపన పడిన నాటి కన్నడ సూపర్ స్టార్ రాజకుమార్ కొడుకు శివ కూడా అక్కడే ఉన్నాడు ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు… తన సంస్కారం రీత్యా కమలహాసన్‌ను అక్కడే ఖండించలేదేమో గానీ… భాష గురించి పిచ్చి కామెంట్స్ చేయడానికి అదేం సందర్భం అసలు..?

ఇవన్నీ సరే, కనీసం తను ఓ పాన్ ఇండియా స్టార్‌గా ఆలోచించాడా..? అదీ లేదు… తన వెర్రి వ్యాఖ్యలతో అసలే ప్రస్తుతం భాషోన్మాదంలో ఉన్న కన్నడిగులు తీవ్రంగా ప్రతిస్పందిస్తారనే సోయి కనిపించలేదు… తనది డీఎంకే భావజాలం, పక్కా హిందీ వ్యతిరేకత…

ముంబైలో ఇదే సినిమాకు ప్రమోషన్ మీట్ పెడితే, ప్రెస్ మీట్ పెడితే అక్కడ హిందీ వ్యతిరేకత మీదో, తాజా కన్నడ వివాదం మీదో ప్రశ్న ఎదురైతే ఈ లోకనాయకుడు ఏం జవాబు చెబుతాడో చూద్దామని ఉంది… పైగా ఇప్పుడు కాబోయే రాజ్యసభ సభ్యుడు, డీఎంకే భిక్ష..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కరప్ట్ కాళేశ్వరం…! నిధి నిక్షేపంగా తవ్వుకున్నారు… దొరికితే వందల కోట్లే..!!
  • ‘‘లోకేష్‌తో కేటీఆర్ గుప్తబంధం దేనికి…, చీకటి కలయికల కుట్రలేమిటి..?’’
  • ‘‘గలీజు పోరి… అప్పుడప్పుడూ స్నానం చేయాలమ్మా నిత్యామేనన్…’’
  • వావ్… బనకచర్లపై జగన్ కూడా మాట్లాడుతున్నాడు గ్రేట్…
  • బనకచర్లపై ఇన్నాళ్ల తెలంగాణ పకడ్బందీ వ్యూహానికి ఆ లేఖతో నష్టం!
  • న్యాయానికి న్యాయం మన సినిమాల్లోనే దొరుకుతూ ఉంటుంది..!
  • ఆహా రష్మిక… అనాలనిపించింది ఈ ‘నదివే’ పాట చూడగానే…
  • రజినీ- కమల్ భేటీ… ఆకర్షించింది ఆ వెనుక ఉన్న ‘ఆపనా ముద్ర’…
  • కేఏ పాల్‌కు అంత సీన్ లేదులే… బిడ్డ కోసం ఆ ‘అమ్మ’ పోరాటం…
  • కేసీయార్ తప్పిదం సరిదిద్దే దిశలో… కృష్ణా పాయింట్లలో టెలిమెట్రీలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions