Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాటి జతొజడ జమజచ్చ జంట… ప్లెయిన్, ఫెయిర్ మూవీ…

May 31, 2025 by M S R

.

రాజేంద్ర ప్రసాద్ ఏదో ఓ పాత్రలో నటిస్తూనేే ఉన్నాడు… చిన్నాచితకా పాత్రలతో సహా… కానీ అర్చన చాన్నాళ్లయింది తెర మీద కనిపించక… అప్పుడెప్పుడో లేడీస్ టైలర్‌ సినిమాలో జతొజడ, జమజచ్చ అంటూ అల్లరి చేశారు…

డ్యూయెట్లు, రొమాన్స్ లేకపోయినా ఆ జంట అప్పుడు బాగానే అనిపించింది… మళ్లీ ఇన్నేళ్లకు, అంటే దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత… ముసలోళ్లయ్యాక మళ్లీ జతకలిశారు… వయస్సుకు తగిన పాత్రలే… ఇద్దరూ ఆ పాత్రలకు న్యాయం చేశారు… హుందాగా…! ఎమోషన్స్ బేస్డ్ పాత్రలు కదా ఇద్దరూ తమ అనుభవాన్ని రంగరించారు…

Ads

ఇక్కడ షష్టిపూర్తి అనే ఈ సినిమాకు సంబంధించి మెచ్చుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది… అసలు తెలుగులో కుటుంబంతోసహా థియేటర్ వెళ్లి చూడగల సినిమాలే రావడం లేదు… బీభత్సమైన యాక్షన్, రక్తపాతం, హింస, ప్రతీకారాలు, స్మగ్లింగులు ఎట్సెట్రా… విత్ ఐటమ్ సాంగ్స్… డర్టీ స్టెప్పులు…

కానీ ఈ సినిమా ఫ్యామిలీతో వెళ్లదగిన సినిమా… ఎక్కడా వెగటు కామెడీ లేదు, అశ్లీలం లేదు, అసభ్యత లేదు… హీరో రూపేష్ తనే నిర్మించాడు… తన అభిరుచికి అభినందనలు… కానీ నటనలో మాత్రం ఇంకా మెరుగుపడాలి… మరికొన్ని సినిమాలు చేస్తే అలవాటైపోతాడేమో… హీరోయిన్ ఆకాంక్షసింగ్ అందంగా ఉంది, తన పాత్రకు తగినట్టుగా నటించింది…

చాలాామంది నటీనటులున్నారు, కానీ హీరోహీరోయిన్లు ప్లస్ పేరెంట్స్‌గా నటించిన రాజేంద్ర ప్రసాద్, అర్చనలే మెయిన్… మరొకటీ చెప్పుకోవాలి… ఈ సినిమాకు అసలైన హీరో ఇళయరాజా అన్నారు కదా… తను కూడా సినిమా కథ నచ్చి ఈ సినిమాకు పనిచేశానని చెప్పుకున్నాడు కదా…

కానీ పాత ఇళయరాాజా లేడు ఇప్పుడు… పాటలు అంత ఇంప్రెసివ్‌గా ఏమీ లేవు… ఒక పాటకు రచయిత పేరు కీరవాణి అని కనిపించింది… ఇంట్రస్టింగు కానీ, తన మాటల్లాగే తన పాట కూడా అర్థం కాదు… ఇళయరాజా సంగీతం అన్నాక సింగర్ కార్తీక్ పాట ఉంటుంది కదా, ఉంది… ఒకటేమో ఎస్పీ చరణ్ పాడాడు… బీజీఎం పర్లేదు… సీన్లకు తగినట్టుగా ఉంది…

ఎటొచ్చీ తీసుకున్న స్టోరీ పాయింట్ పాతది… తల్లిదండ్రులు, పిల్లల నడుమ సంబంధాలు, వారి భావోద్వేగాల మీద చాలా సినిమాలొచ్చాయి… పోనీ, కథాగమనం ఏమైనా ఆసక్తికరంగా ఉందా అంటే అదీ తక్కువే… స్లో… పైగా కొన్నిచోట సీన్లు పెద్దగా పండలేదు… కొన్నిచోట్ల మాత్రమే ఆకట్టుకున్నాయి…

ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లు, రొమాంటిక్ ట్రాక్ కొన్నిచోట్ల ప్రేక్షకులను నవ్వించాయి… కానీ అవి కథకు పెద్దగా ఉపయోగపడలేదు… కొన్ని సన్నివేశాలు రిపీటయినట్టు కనిపిస్తాయి… దర్శకుడు పవన్ ప్రభ భావోద్వేగాలను పండించడానికి ప్రయత్నించినా.., అవి కొన్నిచోట్ల మరీ నీతిబోధల్లా అనిపించాయి… బట్, స్థూలంగా సినిమా వోకే… తీసిపారేసేంత నాసిరకం మాత్రం కాదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions