Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…

June 8, 2025 by M S R

.

థగ్ లైఫ్ సినిమా భారీ డిజాస్టర్ దిశగా సాగుతోంది… కన్నడంలో ఈ సినిమాపై బ్యాన్… కమలహాసన్ కన్నడం భాషపై చేసిన వ్యాఖ్యల వివాదం ఈ పాన్ ఇండియా సినిమాపై బాగా వ్యతిరేక ప్రభావం చూపించినట్టే కనిపస్తోంది…

కనీసం తమిళ ప్రేక్షకుల మద్దతును సంపాదించాలని… తమిళమే నా కుటుంబం, నా ఇల్లు అనే స్లోగన్ ఎత్తుకున్నాడు కాబట్టి… బేసిక్‌గా తన బేస్ తమిళనాడే కాబట్టి… కాస్తోకూస్తో తమిళనాడులోనే కొన్ని కలెక్షన్లు ఉన్నాయి తప్ప… తెలుగు, హిందీల్లో ఢమాల్…

Ads

మన సౌత్ స్టార్లు ఏది తీసి, హిందీలో రిలీజ్ చేసినా సరే, మస్తు ఆదరణ గ్యారంటీ అనే పిచ్చి భ్రమల్ని మరోసారి హిందీ ప్రేక్షకులు బద్దలు కొట్టారు… సరుకులో దమ్ముంటే తప్ప టకెట్ తెగేది లేదని తేల్చిచెప్పేశారు…

ఫస్ట్ డే జస్ట్ 65 లక్షలు మాత్రమే ఈ సినిమా హిందీ వసూళ్లు… తరువాత రోజు 30 లక్షలు… మూడోరోజు వీకెండ్ అయినా సరే జస్ట్ 24 లక్షలు… ఇక ఈ సండే వదిలేస్తే… ఇక హిందీ ఎడిషన్ కథ ఇంకెంత దారుణంగా ఉండబోతున్నదో అర్థం చేసుకోవచ్చు… ప్రతి పాన్ ఇండియా సినిమాను హిందీ వాడు ఆదరించడు అనే సత్యం సౌత్ ఇండస్ట్రీ గుర్తెరగాలి…

కమలహాసన్ అంటే తెలుగు ప్రేక్షకులు తమ స్ట్రెయిట్ హీరోగానే ఆదరిస్తారు… తనెంత తమిళ పిచ్చోడైనా సరే, కమలహాసన్‌ను తెలుగు వాడిగానే ఆదరిస్తుంటారు… ఈసారి తెలుగు ప్రేక్షకులు కూడా ఫోఫోవోయ్ అనేస్తున్నారు…

కలెక్షన్లకు పెట్టింది పేరైన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఫస్ట్ రోజు ఒకటిన్నర కోట్లు వచ్చినా, సెకండ్ డే అది ఏకంగా 50 లక్షలకు పడిపోయింది… వీకెండ్ రోజు, అంటే మూడోరోజున కేవలం 2 లక్షలు పెంచుకుని, 52 లక్షల వసూళ్లను చూపిస్తోంది… ఈ సండే దాటితే ఇక్కడా ఢమాల్…

కన్నడం లేదు, మలయాళం లేదు… తన సొంత భాషలో తమిళ అతిరథ మహారథులు ఆహా ఓహో అని ఊదరగొట్టినా సరే మొదటిరోజున 13.35 కోట్లు మాత్రమే వసూలు చేయగా, అది సెకండ్ డే 6.35 కోట్లకు పడిపోయింది… అంటే సగానికి సగం… థర్డ్ డే, వీకెండ్ అయినా సరే, మరో 3 లక్షలు కలుపుకుని 6.38 కోట్లు… ఈ సండే దాటాక చూడాలి దాని పరుగు ఎంతో…

అచ్చం పొన్నియన్ సెల్వన్ సినిమా సంగతే ఇదీ… అదే మణిరత్నం… ఆ సినిమాను తమిళ ప్రైడ్ అని చెప్పుకున్నారు, తమిళులు కాస్తోకూస్తో చూశారు… మిగతా భాషల్లో ఆ పేర్లూ ఎక్కలేదు, ఆ కథా ఎక్కలేదు… ఫ్లాప్… ఇప్పుడిక ఈ థగ్ లైఫ్ ఓ సాధారణ గ్యాంగ్ స్టర్ సినిమాను మరో నాయకుడు అని చెప్పినా, చివరకు భారతీయుడు-2 కథలాగే ఫ్లాప్… ఫాఫం, రెహమాన్ పరువు కూడా తీసింది ఈ సినిమా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇష్టసఖి త్రిష కాదు… తిరుచ్చి నుంచి బహుశా రాఘవ లారెన్స్…!
  • ప్రొఫెషనల్ ఆందోళనకారుల మ్యాపింగ్… ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ యాక్షన్…
  • జగమంత హాస్పిటల్ మాది… ఐసీయూ జీవితం మాది…
  • Konkona Sen … అమ్మతనానికి పెళ్లితే పనేంటి..? ప్రేమకు వయస్సుతో పనేంటి..?
  • ఈ దళపతి సీఎం జోసెఫ్ విజయ్ కాదు… రజినీకాంత్…
  • Drone Warfare … 5 లక్షల మందితో ‘డ్రోన్ ఆర్మీ’… ప్రత్యేక శిక్షణ…
  • నాటి ఆ స్వాతికిరణం గంగాధరం ఇప్పుడేం చేస్తున్నాడు..?
  • SCCL … సింగరేణి కుటుంబాలకు కోటి రూపాయల భరోసా…
  • ‘ఓటీటీలపై ఆశలు పెట్టుకుని సినిమాలు తీయకండి’… అల్లు ఉద్బోధ…
  • బాబును ఏమీ అనలేడు- పవన్‌ తప్పనలేడు- జగన్‌ను అనకుండా ఉండలేడు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions