Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుడిగాలి సుధీరూ వింటివా..? రష్మి కో-యాంకర్ టీవీ శోభన్‌బాబు మానస్ అట..!!

June 13, 2025 by M S R

.

మామూలుగా తెలుగు టీవీ షోలు, సీరియళ్లు చూసేవాళ్లు పరిటాల నిరుపమ్ (కార్తీక దీపం ఫేమ్) ను టీవీ శోభన్ బాబు అంటుంటారు… విచిత్రంగా అదే పేరుతో మానస్‌ను కూడా పిలుస్తుంటారు…

నిరుపమ్‌తో పోలిక అనవసరం… ఇద్దరూ అందగాళ్లే… కాకపోతే మానస్ మంచి డాన్సర్… విష్ణుప్రియతో కలిసి కొన్ని వీడియోలు, పలు షోలలో డాన్సులు చూశాం కదా… అదుగో అక్కడే ఈటీవీ వాళ్లకు నచ్చినట్టున్నాడు… వెంటనే రష్మికి సహ- యాంకర్‌గా సెలెక్ట్ చేసేశారు…

Ads

నిజానికి ఏదేని ప్రోగ్రామ్‌కు హోస్టుగా లేదా యాంకర్‌గా చేయడం అంత ఈజీ ఏమీ కాదు… ఇన్నేళ్లుగా చేస్తున్నాడు కదా, ఈరోజుకూ రవి మంచి యాంకర్ కాలేకపోయాడు… అదే సుడిగాలి సుధీర్ ఇట్టే ఆ పాత్రలోకి దూరిపోయాడు… అఫ్‌కోర్స్, ప్రదీప్ మేల్ యాంకర్లలో టాప్… అదే టీవీలో ఢీ షోలో గీతామాధురి భర్త నందు బాగానే ఇమిడిపోయాడు…

కానీ తనను జబర్దస్త్ రేటుకు యాంకర్‌గా పెట్టుకోవడం కుదరదు, పైగా ఈ బూతు షోకు తను అంగీకరిస్తాడా అనేదీ సందేహమే… శివాజీ, కృష్ణభగవాన్ వంటి జడ్జిలకు, రష్మి వంటి యాంకర్లకే అది సూటబుల్… ఎంత చేసినా, ఎంత దున్నినా ఆ షోకు రేటింగ్స్ రావడం లేదు…

ఆమధ్య ఎక్సట్రా జబర్దస్త్ షో తీసిపారేసి, వారానికి రెండు ఎపిసోడ్లుగా లాగిస్తున్నారు… బట్ నో యూజ్… ఆ స్కిట్లు మారడం లేదు… సద్దాం, రాఘవ స్కిట్లు మాత్రమే కాస్త బూతులకు అతీతంగా, కాస్త పద్ధతిగా ఉంటున్నాయి,.. మిగతావి సేమ్ జబర్దస్త్ మార్క్ అశ్లీలం, వెగటు, రోత… చివరకు ఆటో రాంప్రసాద్ స్కిట్లు సైతం.,.,

ఈ స్థితిలో ఏవో మార్పులు చేస్తున్నట్టు తాజా ప్రోమోలో చెప్పుకొచ్చింది యాజమాన్యం… అంతా డబుల్ డబుల్ అని ఏదో ఊదరగొట్టించారు ఖుష్బూతో… ఎలాగూ జడ్జిలు డబుల్… ఇక మిగిలింది డబుల్ యాంకర్స్ అంతే కదా…

అదే… ఒకాయన కళ్లద్దాలు పెట్టుకుంటూ, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోకుండా కనిపించాడు… అందరికీ సుడిగాలి సుధీర్ ఏమో అనే అనుమానాలు వచ్చి, అదీ కాస్త ప్రోమోకు పాపులారిటీ వస్తుందనుకున్నారేమో… ఆల్రెడీ తను ఫ్యామలీ స్టార్స్ చేస్తున్నాడు… ఆహాలో సర్కార్ చేస్తున్నాడు… డ్రామా జూనియర్స్ కూడా… ఫుల్ బిజీ…

అఫ్‌కోర్స్, రష్మితో కలిసి తను హోస్ట్ చేస్తే ఆ రేంజ్ వేరే ఉంటుంది గానీ… ఈటీవీ ప్లస్ మల్లెమాల మానస్‌ను ఓ ప్రయోగంగా ఎంచుకున్నట్టున్నారు… తను ఎప్పుడూ యాంకరింగు చేయలేదు… సో, ఎలా చేస్తాడో చూడాలే తప్ప అప్పుడే జడ్జ్ చేయలేం… తను యాక్టివ్, స్పాంటేనిటీ కూడా ఉంది… కానీ..?

శివాజీ హోస్టింగుకు తెరపడ్డట్టే ఉంది… నిజంగానే చిరాకెత్తించాడు… ఓవరాక్షన్… మళ్లీ కృష్ణ భగవాన్ జడ్జిగా వచ్చినట్టున్నాడు… తను పర్లేదు… ఖుష్బూ సరేసరి… చూడాలిక… జనం చూడటం మానేసిన జబర్దస్త్ ఈ డబుల్ ప్రయోగంతో ఏమైనా కాస్త మెరుగుపడుతుందేమో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మంత్రి సోదరుడికి అవార్డు..? ఈ హుడావుడి లేట్ ప్రకటన ఏమిటి..?
  • స్వాతి..! ఓ కుంతీపుత్రి కథ… మగాధిపత్యంపై ఓ ధిక్కారపతాక…!!
  • సూప‌ర్ స్టార్ కృష్ణ విశ్వప్రయత్నం చేసీ చేసీ ఓడిపోయిన ‘ప్రాజెక్టు’..!!
  • రేవంత్‌రెడ్డి సర్కారు నిజంగానే గద్దర్‌ను అవమానించిందా..?!
  • చావు తరుముకొచ్చింది… అది గొంతులో ఇరుక్కుని మరీ కుట్టి చంపింది…
  • మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు… ఓ పాత ఇంట్రస్టింగ్ స్టడీ ఇది…
  • ఆ అవార్డు అంటేనే అక్కినేనికి ఓ పరవశం… ఏంటది..? ఎవరిచ్చారు..?
  • విధి… ఆ సీటొక్కటే విరిగి దూరంగా పడి బతకడం అబ్బురమే…
  • అంతటి ఎన్టీయార్‌కే తప్పలేదు… పాపం కొమ్మినేని ఎంత..?
  • నీలి శివుడా… పాహిమాం… ఈ దిక్కుమాలిన క్రియేటివ్ ఫ్రీడం నుంచి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions