Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

“ఊహలు గుసగుసలాడే… నా హృదయము ఊగిసలాడే…”

June 13, 2025 by M S R

.

“ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే…”

1963లో వచ్చిన బందిపోటు సినిమాలోని పాట “ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే…” ఘంటసాల ఎంత గొప్ప గాయకుడో అంత గొప్ప సంగీత దర్శకుడు. ఆయన తొలి హిట్ పాట(లు) కీలుగుఱ్ఱం సినిమాలోని స్వీయ సంగీతంలోనివే.

Ads

అటు తరువాత ఆయన పలు గొప్ప పాటలు చేశారు. వాటిల్లో ఒకటి ఈ “ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే…” పాట. బాణి, వాద్య సంగీతం రెండూ నిండైన సౌందర్యంతో అలరిస్తూంటాయి. ఇది ఒక చిక్కని పాట.

సమనేశ రంజని లేదా సముద్ర ప్రియ రాగంలో ఈ పాటను చేశారు ఘంటసాల. ఈ రాగం కర్ణాటక సంగీతంలో కూడా అరుదైంది. దక్షిణాదిలో సమనేశ రంజనిలో ఇదే మొదటి సినిమా పాట అయుంటుంది.

సుమనేశ రంజని రాగం హిందూస్థానీలో మధుకౌన్స్.
ఘంటసాల గానంలో కానీ సంగీతంలో కానీ తెలుగుతనమే ఉంటుంది. ఆయనలో హిందీ, ఇంగ్లిష్ సంగీతం ఛాయలు పెద్దగా ఉండవు. (నిర్మాతల, దర్శకుల బలవంతంవల్ల కొన్ని హిందీ సినిమా పాటల బాణీలను ఆయన వాడారు. అది పరిగణననీయం కాదు) ఘంటసాలకు గజల్ ధోరణి నచ్చేది కాదు అని ఆయన సతీమణి నాతో చెప్పారు.

ఈ “ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే…” పాట కొంత మేరకు పాశ్చత్య ధోరణిలో ఉంటుంది.
1960లో వచ్చిన ఛబీలీ హిందీ సినిమాలో స్నేహల్ భట్కర్ సంగీతంలో హేమంత్ కుమార్
“లహ్‌రోన్ పే లహ్‌ర్ ఉల్‌ఫత్ హై…” పాడిన పాట ఈ ఘంటసాల పాటకు ప్రేరణ అని అనిపిస్తుంది.

ఆ హిందీ పాటకు ఇంగ్లిష్ గాయకుడు Dean Martin పాడిన “The man who plays Mandolino…” పాట ప్రేరణ, ఆధారం.

హిందీ, ఇంగ్లిష్ ప్రేరణ లేదా ఛాయ ఉన్నా ఈ తెలుగు పాట కాపీ పాట కాదు. ఘంటసాల తన మేధతో చాలా గొప్పగా పాటను చేశారు. తన పాటను గొప్పగా నిర్మించారు ఘంటసాల. ఘంటసాల సంగీతం చేసిన పాటల్లో ఈ పాట ప్రత్యేకమైంది.

సుశీలతో కలిసి ఘంటసాల పాడారు.
వినండి…
ఊహలు గుసగుసలాడే
https://youtu.be/hlrhFTJBep8?si=HN7dOWYwMD4xVpj1
లహ్‌రోన్ పే లహ్‌ర్ ఉల్‌ఫత్ హై…
https://youtu.be/DzCVjtjPzCI?si=T09pYoGu86f2-ie1
The man who plays Mandolino
https://youtu.be/U9O-iXerZ0s?si=FrJuMdYnwFTFNOcn
……. [[ రోచిష్మాన్      9444012279  ]]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మంత్రి సోదరుడికి అవార్డు..? ఈ హుడావుడి లేట్ ప్రకటన ఏమిటి..?
  • స్వాతి..! ఓ కుంతీపుత్రి కథ… మగాధిపత్యంపై ఓ ధిక్కారపతాక…!!
  • సూప‌ర్ స్టార్ కృష్ణ విశ్వప్రయత్నం చేసీ చేసీ ఓడిపోయిన ‘ప్రాజెక్టు’..!!
  • రేవంత్‌రెడ్డి సర్కారు నిజంగానే గద్దర్‌ను అవమానించిందా..?!
  • చావు తరుముకొచ్చింది… అది గొంతులో ఇరుక్కుని మరీ కుట్టి చంపింది…
  • మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు… ఓ పాత ఇంట్రస్టింగ్ స్టడీ ఇది…
  • ఆ అవార్డు అంటేనే అక్కినేనికి ఓ పరవశం… ఏంటది..? ఎవరిచ్చారు..?
  • విధి… ఆ సీటొక్కటే విరిగి దూరంగా పడి బతకడం అబ్బురమే…
  • అంతటి ఎన్టీయార్‌కే తప్పలేదు… పాపం కొమ్మినేని ఎంత..?
  • నీలి శివుడా… పాహిమాం… ఈ దిక్కుమాలిన క్రియేటివ్ ఫ్రీడం నుంచి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions