Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పుష్ప2 బ్యాటింగుతో బుల్లితెర పగిలిపోయింది… ఆల్ టైమ్ హై రేటింగ్స్…

June 15, 2025 by M S R

.

స్మగ్లర్ పుష్పరాజ్ హిందీ బుల్లితెరపై విధ్వంసమే క్రియేట్ చేశాడు… అంటే వీక్షణాల్లో…! పెద్ద తెరపై 1800 కోట్ల వసూళ్లు అనే వార్తలు చదివాం కదా… సరే, ఆ లెక్కల్లో కొన్ని మాయలు, అతిశయోక్తులు కూడా ఉన్నాయేమో గానీ స్థూలంగా మొత్తం హిందీ సినిమా పరిశ్రమ కూడా షాక్‌తో చూస్తుండిపోయింది పుష్ప గారి వసూళ్ల వీరంగం చూసి… అది మాత్రం నిజం…

తాజాగా బుల్లి తెర మీద కూడా అంతే… ఇప్పటిదాకా టీవీ రేటింగుల్లో తోపు రికార్డులు ఉన్న సినిమాలను దాటేసి, కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు పుష్పరాజ్…

Ads

pushpa

500 కోట్ల మూవీ వీక్షణాల్లో పైన చూశారుగా… పఠాన్, యానిమల్, హిందీ సాలార్, మొన్నటి స్త్రీ2 సినిమాలను కూడా దాటేసి పుష్ప2 ఏకంగా 21.42 మిలియన్ల ఇంప్రెషన్స్, 44.98 మిలియన్ల రీచ్… అంటే టీవీలో బ్లాక్ బస్టర్…

5.1 టీవీఆర్ అంటే మామూలు రేటింగ్ కాదు… ఒకసారి ఈ పోలిక చూడండి… హిందీ స్పీకింగ్ మార్కెట్‌లో ఇది ఆల్‌టైమ్ రికార్డు… బహుశా ఇప్పట్లో మరో సినిమా దీన్ని సాధించడం కష్టమే… (సరళమైన భాషలో చెప్పాలంటే 5.4 కోట్ల మంది ఈ సినిమాను చూశారని రఫ్ లెక్క)

పుష్ప

తన పుష్ప1 రికార్డును తనే బ్రేక్ చేశాడు… ఈ బుల్లి తెరపై విజృంభణను ఆ టీమ్ ఇలా ట్వీట్ చేసుకుంది…



A record breaking blockbuster on the big screens. 🔥
A record breaking blockbuster on the small screens. 🤙#Pushpa2TheRule (Hindi) has a record breaking viewership with 5.1 TVR with a massive reach of 5.4 CRORES ❤‍🔥
The iconic rule continues 💥#Pushpa2#WildFirePushpa

Icon… pic.twitter.com/yzAvykdNNM

— Pushpa (@PushpaMovie) June 14, 2025



ఎందుకు విశేషంగా చెప్పుకుంటున్నాం అంటే… అసలు టీవీల్లో జనం సినిమాలు చూడటమే మానేస్తున్నారు… ఎప్పుడైతే ఓటీటీలు బాగా అందుబాటులోకి వచ్చాయో, అందులోని పలు సౌకర్యాలు సినిమా వీక్షణాన్ని మరింత సులభతరం చేశాయో… ఒకేచోట కట్టేసి ఉన్నట్టుగా టీవీల్లో సినిమాలు చూడటం జనానికి నచ్చడం లేదు…

పెద్ద పెద్ద తోపు హీరోల భారీ సినిమాలు సైతం అందుకే బుల్లి తెర రేటింగ్స్‌లో ఢమాల్ అంటున్నాయి… ఈ స్థితిలో కూడా పుష్ప2 తెలుగు టీవీ ప్రీమియం 12.61 టీవీఆర్ సాధించి అబ్బురపరిచింది…

పుష్ప2

ఇటీవల ముగిసిన ఐపీఎల్, టీ20 లీగ్ టీవీఆర్‌‌లను కూడా మించిపోయింది హిందీ పుష్ప2 బ్యాటింగ్… ఒకవైపు తమిళంలో కమలహాసన్, శంకర్, మణిరత్నం, సూర్య తదితరుల సినిమాలు తన్నేస్తుంటే… ఓ తెలుగు సినిమా రీసెంట్ డేస్‌లో ఇంత వసూళ్ల విధ్వంసాన్ని చూపడం విశేషమే… (థియేటర్, ఓటీటీ, టీవీ తదితర రికార్డులను వివరించే డాక్యుమెంటరీని పుష్ప టీమ్ రిలీజ్ చేసినా ఇంట్రస్టింగుగానే ఉంటుంది…)

ఒక పోలిక… బాహుబలి 1 కన్నా బాహుబలి 2 ఎక్కువ వసూళ్లు చేసింది… నిజానికి కథ, కథనంలో గ్రిప్, పాటల కోణంలో బాహుబలి1 సీక్వెల్‌కన్నా చాలా బెటర్… సేమ్, పాటలు, కొత్త కథ, గ్రిప్పింగ్ కథనం కోణంలో పుష్ప2 కన్నా పుష్ప1 పాపులర్… కానీ పుష్ప1ను మించి సీక్వెల్ దున్నేసింది… సీక్వెల్ కోసం ఇంట్రస్టు, దానిపై క్రియేటయ్యే హైప్ కొన్నిసార్లు ఇలా కలిసొస్తుందేమో..!

అల్లు అర్జున్, అట్లీ, దీపిక పడుకోన్ కాంబినేషన్‌తో రాబోయే సినిమాపై మరింత హైప్ ఇప్పటి నుంచే పెరుగుతోంది ఈ పుష్ప2 రికార్డుల నేపథ్యంలో…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శ్రీశ్రీ… ఒక తీరని దాహం… మ హా ప్ర స్థా నం… A CLASSIC AND MASTERPIECE …
  • చిన్న కథే… చిన్న విషయాలే… ఐతేనేం, చీకట్లో చిరుదివ్వె చాలదా ఏం..?
  • రంగు పూసల దండల ఫేక్ జ్యోతిష్కులతో జాగ్రత్త; జాగ్రత్త; జాగ్రత్త…
  • కొన్ని పాత్రలు, కొన్ని పోరాటాలు ఎన్టీయార్‌కు మాత్రమే సాధ్యం..!!
  • నల్గొండ గోర్కీ… కృష్ణమూర్తి దేవులపల్లి… తెలంగాణ కథల తంగేడు చెట్టు…
  • ఎలెవన్..! 11 మార్కులు మాత్రమే… యాభైకా..? వందకా..? అదే ప్రశ్న..!!
  • పుష్ప2 బ్యాటింగుతో బుల్లితెర పగిలిపోయింది… ఆల్ టైమ్ హై రేటింగ్స్…
  • టెంబా బావుమా… నల్ల జాతి చేతిలో ఓ అపురూప విజయపతాక…
  • ఏమాటకామాట… కన్నప్ప భారీ నిర్మాణ విలువలకు తగినట్టే ట్రెయిలర్…
  • ఒక్క క్షణం…! ఎంత విలువైంది… ఓసారి పుతిన్ పుట్టుకను చదవండి… అర్థమౌతుంది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions