.
దిగ్వేష్ సింగ్ రాఠీ… ఈ ఢిల్లీ క్రికెటర్ ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు… నిజానికి బాల్ దొరికితే దంచుడే అన్నట్టుగా సాగే టీ20, ఐపీఎల్ వంటి మ్యాచుల్లో అసలు హేట్రిక్ సాధించడమే గ్రేట్…
ఎంతో అద్భుతమైన బౌలింగ్ ఉంటే తప్ప, పిచ్ సహకరిస్తే తప్ప, ప్రత్యర్థి బ్యాటర్లు మరీ నాసిరకం అయితే తప్ప ఇవి సాధ్యం కావు… అసలే బ్యాటింగ్ పిచ్చులు కదా మనవి, మరీ ఈ టీ20 మ్యాచుల్లో… సో, హేట్రిక్ సాధనే గ్రేట్ అనుకుంటే…
Ads
రాఠీ వరుసగా అయిదు బాల్స్‌కు అయిదు వికెట్లు తీశాడు… అందులో నాలుగు క్లీన్ బౌల్డ్, మరొకటి ఎల్బీడబ్ల్యూ… సూపర్ కదా… అవునూ, ఇంతకీ వరుసగా మూడు వికెట్లు తీస్తే హేట్రిక్, మరి వరుసగా అయిదు వికెట్లు తీస్తే ఏమంటారు.?
ట్రిపుల్ హేట్రిక్… అదేమిటి, ట్రిపుల్ హేట్రిక్ అంటే వరుసగా 9 వికెట్లు పడాలిగా అంటారా..? ఎవరో విచిత్రమైన పేరు కాయిన్ చేశారు అలా… దీనికి ఒకాయన రెడిట్‌లో సమాధానం చెప్పాడు… 1-3 వికెట్లు అంటే హేట్రిక్, 1-4 వికెట్లు అంటే డబుల్ హేట్రిక్… 1-5 వికెట్లు అంటే ట్రిపుల్ హేట్రిక్ అట…
(ఇవి వరుస వికెట్లకు పేర్లు… కానీ ఒకే ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీస్తే ఫైఫర్ అంటారు, అంటే ఫైవ్ ఫర్ అని… ఫైవ్ వికెట్ హాల్ అనీ అంటారు… కానీ ట్రిపుల్ హేట్రిక్ వేరు…)
ఇది సరే, ఎవరైనా వరుసగా ఆరు వికెట్లు తీసినవాళ్లున్నారా..? ఆరు బాల్స్‌లో వరుసగా ఆరు వికెట్లు… అధికారికంగా ఐసీసీ రికార్డుల్లో ఏమీ లేదు, ఎవరూ లేరు… కానీ ఏదో దేశీయ మ్యాచులో గారెత్ మోర్గాన్ అనే ఆస్ట్రేలియన్ క్రికెటర్ సాధించాడు… నెట్లో కొన్ని వీడియోలు కూడా కనిపిస్తాయి… దానికి ఏం పేరుంది అంటారా..? ఏమో ఎవరూ పేరు పెట్టినట్టు లేదు…)
గల్లీ మ్యాచులోనైనా సరే, అది రేర్ ఫీట్… సరే, ఈ దిగ్వేష్ సింగ్ రాఠీ విషయానికి వద్దాం… తనను లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ 30 లక్షలను కొనుగోలు చేసింది మొన్నటి ఐపీఎల్ మ్యాచు కోసం… ఓవరాక్షన్, ఏదో నోట్‌బుక్‌లో ఏదో రాస్తున్నట్టు, బాల్ విసరడానికి ముందు దాన్ని దాచిపెట్టి, హఠాత్తుగా బయటికి తీసి విసిరినట్టు ఏదో ప్రదర్శిస్తాడు… జులపాల జుట్టు…
వికెట్ పడితే ఎదుటివాడు ఇబ్బందిపడేలా సెలబ్రేట్ చేస్తాడు, ఓ మ్యాచులో 50 శాతం జరిమానా, మరో మ్యాచ్ నిషేధమూ అనుభవించాడు… తను ఇండియా తరఫున ఏమీ ఆడలేదు, సో, టెస్టులు, టీ20, వన్డే లెక్కలేమీ లేవు… జస్ట్, ఐపీఎల్… అదీ పెద్ద ఇంప్రెసివ్ ఏమీ కాదు… కానీ ఈ ఐదు వరుస వికెట్లతో హఠాత్తుగా తెరపైకి వచ్చేశాడు…!!
అన్నట్టు… మన ప్లేయరే, అభిమన్యు మిథున్… కర్నాటక తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానా మీద సూరత్‌లో ఆడుతున్నప్పుడు… 2029 నవంబరు… ఒకే ఓవర్లో అయిదు వికెట్లు తీశాడు… కాకపోతే నాలుగు వరుస వికెట్లు, తరువాత వైడ్, తరువాత సింగిల్, చివరలో మరో వికెట్…)
Share this Article