.
Dear Customer your HYDERABAD METROPOLITAN WATER SUPPLY & SWERGE BOARD. connection will be disconnected tonight 9:30pm from HMWSSB office because your previous month bill was not updated Please immediately contact with our HMWSSB office Contact number, 9547025626 Thank you…
.
Ads
రాత్రి 9.30 గంటలకు మీ నల్లా కనెక్షన్ కట్ చేస్తున్నాం, లాస్ట్ మంత్, మీ బిల్లు అప్డేట్ కాలేదు… వెంటనే ఈ నంబరుకు కాల్ చేయండి… అని ఏమైనా మెసేజులు వస్తున్నాయా..?
జాగ్రత్త… నిజంగానే మీ బిల్లు చాన్నాళ్లుగా డ్యూ ఉంటే బిల్లు చెల్లించడానికి వాటర్ బోర్డు యాప్ ఉంది, వెబ్సైట్ ఉంది, కలెక్షన్ సెంటర్లున్నాయి… అంతే… ఫలానా నంబరు అనగానే కాల్ చేస్తే ఏదో ఏపీకే డౌన్లోడ్ చేసుకోమంటారు…
తెలుసు కదా… పక్కా సైబర్ క్రైమ్… మీ బ్యాంకు ఖాతాలో డబ్బు మొత్తం గల్లంతయ్యే ప్రమాదం ఉంది… డోన్ట్ రియాక్ట్… అసలు ఇది మరో బరితెగింపు ఫ్రాడ్… ఏకంగా పబ్లిక్ సర్వీస్ యుటిలిటీల పేర్లు వాడుకుని, లోగోలు కూడా దింపేసి, దొంగ సైబర్ క్రైమ్ నంబర్లు ఇచ్చి, ట్రాపులోకి లాగడం… ఇప్పుడు వాటర్ బోర్డు, రేప్పొద్దున ప్రాపర్టీ ట్యాక్స్, కరెంటు బిల్లులకూ మొదలు పెడతారు… అది వేరే నగరాల పబ్లిక్ యుటిలిటీలకూ వర్తింపజేస్తారు… అందుకే బహుపరాక్…
వాటర్ బోర్డు చాలా నయం… ఈ మెసేజులు తమ దృష్టికి రావడంతో వెంటనే సైబర్ క్రైమ్‌కు కంప్లయింట్ చేసింది… ఎవరూ స్పందించకూడదని బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ట్వీట్ చేయడమే కాదు, ఓ పబ్లిక్ నోట్ రిలీజ్ చేశాడు… గుడ్… స్పీడ్ రియాక్షన్…
ఒకటే నంబర్ నుంచి గాకుండా వేర్వేరు నంబర్ల నుంచి ఆపరేట్ చేస్తున్నట్టున్నారు… ఈ డొంకను, నేరగాళ్లను పట్టుకోవడం కష్టమే… అందుకే ఇలా రాత్రి కనెక్షన్ల కత్తిరింపు మెసేజులకు రియాక్ట్ గాకుండా ఉండటమే శ్రేయస్కరం…
అన్నట్టు… నిజంగానే కనెక్షన్లు కత్తిరించే పక్షంలో… బోర్డు గానీ, కరెంటోళ్లు గానీ అర్ధరాత్రి రారు… బాజాప్తా పగటి పూటే వస్తారు… ప్రస్తుతానికి ఈ పోస్టు మీ వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసి, కొందరినైనా మోసం బారినపడకుండా కాపాడండి… పుణ్యం మీకే…
Share this Article