Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ భీకరమైన శబ్దం విని, భయపడి, ఆ లింక్ నొక్కారో… అయిపోయారు..!!

June 20, 2025 by M S R

.

Alamuru Sowmya …… హెచ్చరిక: ఇవాళ ఫేస్బుక్ ఓపెన్ చెయ్యగానే… “You can’t open this page…your mobile is hacked” అని వచ్చింది. చూడగానే కంగారు పడిపోయాను. ఫేస్బుక్ యాప్ ఓపెన్ అవ్వలేదు.

కేవలం ఒక తెల్ల పేజీ, మధ్యలో ఈ మాటలు. ఒక్క క్షణం అలా చూస్తు ఉండిపోయా. వెంటనే పేజ్ మారి, ఫోన్ నుంచి ఒక వింత శబ్దం రావడం మొదలైంది. మళ్లీ వైట్ పేజ్… పైన ఎర్ర అక్షరాలతో “alert…” అని రాసి ఉంది.

Ads

మధ్యలో.. “at this moment, somebody is trying to hack your bank account. If you hear a strange sound, click on the below link…” అని అక్కడేదో లింక్ వచ్చింది. చాలా భయపడిపోయాను.

బుర్ర పనిచేయలేదు. ఆ లింక్ చూస్తూ ఉన్నా. ఫోన్ లోంచి శబ్దం పెరిగిపోతోంది. వెంటనే మొత్తం పేజ్ క్లోజ్ చేసేశా. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి, ఆన్ చేసా. తిరిగి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అంతా మామూలుగానే ఉంది. గూగుల్‌ని అడిగా ఏమిటి సంగతని?

“అది కచ్చితంగా scam. ఫేస్బుక్ ఇలాంటి అలర్ట్ ఇవ్వదు. లింక్ నొక్కావో చచ్చావే” అంది. హమ్మయ్య, బతికానురా బాబూ అనుకున్నా… నేను లింక్ నొక్కలేదుగా!

నేను చాలా గట్టి పిండాన్ననీ, ఇప్పటివరకూ స్కామర్ల బారిన పడలేదనీ నాకో గర్వం. అలాంటి నాకే ఒక్క క్షణం ఊపిరి సలపలేదు. ఆ శబ్దం బాగా భయపెట్టింది.

పారాహుషార్....ఇలాంటిది మీకూ జరిగితే ఏ లింకూ నొక్కకండి. వెంటనే ఆ app లేదా ఆ పేజ్ పీక నొక్కండి. శబ్దాలకు భయపడకండి. ఈ స్కాం screenshot తీసే టైం దొరకలేదు. అంతా క్షణాల్లో జరిగిపోయింది…

(స్మార్ట్ ఫోన్, రోజూవాడే రకరకాల యాప్స్ ఇప్పుడు సైబర్ నేరగాళ్ల మోసాలకు వేదికలు… ఇలాంటి ఉదాహరణలు షేర్ చేస్తే మరో పది మంది రక్షింపబడతారని ఈ పోస్టు షేర్ చేస్తున్నా…) 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అనితర సాధ్యమైన ఆద్యకళకు ఏది గుర్తింపు..? ఏది పట్టింపు..?!
  • 8 వసంతాలు… కంప్లీట్ అనంతిక షో… కానీ మేఘసందేశం రోజులు కావివి..!!
  • పెట్టుడు జనన ముహూర్తాలు నమ్ముతారా..? ఈ కథ చదవాలి మీరు..!!
  • ఆ భీకరమైన శబ్దం విని, భయపడి, ఆ లింక్ నొక్కారో… అయిపోయారు..!!
  • పెట్టుడు ముహూర్తాల్లో కృత్రిమ జననాలు జాతకాలను మారుస్తాయా..?!
  • బనకచర్ల ప్లాన్ బద్దలు… చంద్రబాబు ప్రణాళికలపై రేవంత్ పాశుపతం..!!
  • ఫాఫం కొనఊపిరి… పరుచూరి డైలాగుల దెబ్బకు వెంఠనే హరీమంది రోజా…
  • భేష్ శేఖర్ కమ్ముల… కుబేర ఓ క్లీన్ హిట్… ఆకట్టిపడేశావు పలు సీన్లలో…
  • ఇవి మాయ ఉంగరాలు కావు… మహత్తులూ ఉండవు… జస్ట్, స్మార్ట్ రింగ్స్…
  • ‘‘ఎందుకింత ఎక్కువ ఆయుష్షునిచ్చావ్ దేవుడా…? ఏడవడానికా..!’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions