Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పార్టీ అమానవీయత ఖచ్చితంగా తప్పే… కానీ జగన్ ప్రత్యక్ష బాధ్యుడా..?!

June 23, 2025 by M S R

.

ఎస్, నిజమే… ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు, పోలీసుల వివరణల ప్రకారం చూస్తే… జగన్ కారు ఢీకొని సింగయ్య అనే దళితుడు మరణిస్తే వైసీపీ శ్రేణులు నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా పక్కకు తోసిపడేసి కాన్వాయ్, అభివాదాలు, జేజేలతో వీరంగం వేయగం ఖచ్చితంగా తప్పే…

వ్యక్తి పూజ అనేక దరిద్రాలకు కారణమయ్యే ధోరణి… హీరోలు, రాజకీయ నాయకులు కనిపిస్తే చాలు ఆవేశంతో ఊగిపోతారు అభిమానులు… మరీ ప్రత్యేకించి జగన్ కోసం వచ్చేవాళ్లను పట్టతరం కాదు… ఆ వీడియో చూశారు కదా… వాడెవడో మూర్ఖుడు ఏకంగా జగన్ కారు బానెట్ మీదకు ఎక్కి మరీ అరుస్తున్నాడు… జగన్ దాకా వచ్చి కొందరు పూలు జల్లుతున్నారు…

Ads

ఇక్కడ ఓ హెచ్చరిక… ఇలాంటి పరిస్థితి జగన్ వ్యక్తిగత భద్రతకే ప్రమాదం… పైగా జగన్ ఉనికే సహించలేనితనం ఏపీలో పెరుగుతోంది… పోలీసుల రోప్ పార్టీలు ఏవి..? భద్రత ఏది..? అవసరమైనంత సెక్యూరిటీ ఏది..? అని ప్రభుత్వాన్ని నిందించడం వల్ల ప్రయోజనం లేదు… ఉండదు… తన పర్యటనల్లో పార్టీ శ్రేణులు జాగ్రత్తలు తీసుకోవాలి…

అధికారంలో ఉన్నన్నాళ్లు జగన్ పెద్దగా జనంలోకి రాలేదు.,. ఇప్పుడు ఏదో ఓ ఇష్యూ కోసమో, ఏదయినా ఇష్యూ చేయడం కోసమో జనంలోకి పొలిటికల్ ఫాయిదా కోసం వస్తున్నాడనే అనుకుందాం… ఏకంగా తన కారు ఎక్కి ఫ్యాన్స్ అలియాస్ కార్యకర్తలు వీరంగం వేసేంత ‘ఉన్మాద స్థితి’ జగన్‌కే ప్రమాదం…

సరే, సింగయ్య విషయానికే వద్దాం… తనూ పూలు జల్లే క్రమంలో కారు కిందే పడ్డాడు… జగన్ కారే తన మీదకు ఎక్కిన తీరు వీడియోలో కనిపిస్తోంది… హృదయవిదారకంగా ఉంది ఆ దృశ్యం… చూస్తేనే కలుక్కుమంటోంది…

తను కారు కింద పడగానే అక్కడున్న వైసీపీ వాళ్లు వాహనాన్ని ఆపడానికి ట్రై చేయాలి, డ్రైవర్‌కు సూచించాలి… కాగా అమానవీయంగానే పక్కకు ఈడ్చి పారేసి కాన్వాయ్, అభివాదాలు నిరాటంకంగా సాగడానికి ట్రై చేశారు…

నిజానికి ఆ స్పీడ్‌లో మనిషి టైర్ల కింద పడితే కారు ఆగిపోవాలి… అంటే, డ్రైవర్ మరింత ఫోర్స్‌గా కారును ముందుకు తీసుకెళ్లడానికే ప్రయత్నించాడన్నమాట… సరే, కారు కింద ఎవరో పడ్డారని గమనించే స్థితీ లేదక్కడ… అరుపులు, కేకలు, జనం… ఐనా డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఇన్నిరోజుల తరువాత పోలీసులు కేసు పెట్టారు…

మొదట ఏదో వాహనం తగిలి మరణించాడని పోలీసులు చెప్పారు… తరువాత హఠాత్తుగా ఈ వీడియో ప్రత్యక్షం అయింది… (ఆ దృశ్యం విదారకంగా ఉన్నందుకు ఇక్కడ పెట్టడం లేదు…) ఇప్పుడు కేసు మార్చారు… ఏవేవో సెక్షన్లు పెట్టారు… ఇక్కడ పొలిటికల్ ట్విస్టు కనిపిస్తోంది… జగన్ మీద కూడా కేసు..?

తనెలా ప్రత్యక్షంగా బాధ్యుడు..? తను కారు నడిపించడం లేదు… కారు కింద ఎవరో పడ్డట్టు తనకు తెలిసే సిట్యుయేషన్ కూడా లేదక్కడ… తను ఆ మరణానికి, ఆ ప్రమాదానికి, ఆ నిర్లక్ష్యానికి నేరుగా బాధ్యుడు కాదు… ప్రేరణ కాదు… ఐనా కేసు పెట్టేశారు… అదీ కల్పబుల్ హోమిసైడ్… అంటే ఉద్దేశపూర్వక నేరపూరత నరహత్య… అసలు ఈ సెక్షన్ ఈ కేసులో వర్తిస్తుందా..?

జగన్ అక్రమాలపై కేసులు పెట్టొద్దనో, విచారణలు అవసరం లేదనో, తను కడిగిన ముత్యం అనో చెప్పడం లేదిక్కడ… మద్యం స్కాములు వంటి బోలెడున్నాయి… వాటికి పక్కాగా విచారించి, నిజంగా జగన్ దోషి అయితే అలా నిలదీయండి, కోర్టుల్లో శిక్షలు పడేలా చేయండి… అంతేతప్ప, ఇలాంటి కేసుల్లో ఆయన పేరు రపా రపా రాసిపారేయడం ఏమిటో మరి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 60 ఏళ్ల క్రితమే… ఈ గొంతు నులిమే కుట్ర… నరకం చూసి, చావును గెలిచింది…
  • అమెరికాలో… నా వాలుజడ కృష్ణవేణి, నా పూలజడ వెన్నెలా గోదావరి…
  • బిన్ లాడెన్ – కొండ గుహ – బంకర్ బ్లస్టర్…! మళ్లీ చెప్పుకోవాలి కథ…!!
  • పార్టీ అమానవీయత ఖచ్చితంగా తప్పే… కానీ జగన్ ప్రత్యక్ష బాధ్యుడా..?!
  • ఇజ్రాయిల్‌కు చేతకాలేదు… అమెరికాను అడిగింది… యుద్ధంలో ట్విస్టు..!!
  • ఎంతటి మంచి భరోసా ఆర్యా… ఇదొక జీవిత బీమా ధీమా…
  • ఫాఫం, ఈ బీసీ కెరటం చివరకు కవిత క్యాంపులో విరిగిపడిందా..?!
  • సితారే జమీన్ పర్..! గుడ్ టేస్ట్, గుడ్ స్టోరీ, గుడ్ ఎఫర్ట్… గుడ్ మూవీ..!!
  • మానస్ పేలవం… రష్మి, సుధీర్ కళకళ… సుమ, ప్రదీప్ డౌన్ ఫాల్…
  • రష్మిక మంధాన శుక్రమహర్దశ..! నాగార్జున చెప్పింది అక్షరసత్యం..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions