Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జస్‌ప్రీత్ బుమ్రా..! ఎంతకాలంలే అన్నారు… పదేళ్లుగా అదే జోరు ప్రయాణం..!!

June 24, 2025 by M S R

.

ఎప్పుడూ ఓ మాట అంటూనే ఉంటారు బుమ్రా గురించి… ఎనిమిది నెలలే అన్నారు, కానీ నడుస్తూనే ఉంది కెరీర్ పదేళ్లుగా… ఎప్పటికప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు… ఎన్ని ప్రెజర్స్ ఉన్నా సరే… ప్రస్తుతం వరల్డ్ క్లాస్ బౌలర్, ఇండియా జట్టుకు కీలక సభ్యుడు తను…

వర్తమాన టెస్టులో కూడా 5 వికెట్లు… ఎకానమీ కూడా జస్ట్ 3.36… నమ్మదగిన బౌలర్… సాధారణగా క్రికెట్ అంటేనే దంచుడు, అది కచ్చితంగా బ్యాటర్స్ గేమ్… మరీ ముఖ్యంగా ఉప ఖండంలోని నిర్జీవమైన పిచ్ లపై ఎప్పుడూ బ్యాటర్లదే ఆధిపత్యం…

Ads

అందుకే మనకి ఒక సచిన్, ఒక కోహ్లీ, ఒక ధోని, ఒక యువరాజ్ సింగ్, ఒక శుభమాన్ గిల్, ఒక జైస్వాలు… ఎప్పటికీ వీళ్లే స్టార్ క్రికెటర్లు.., కానీ ఈ ఒక్క క్రింది చార్ట్ చెపుతుంది జస్‌ప్రీత్ బుమ్రా అంటే ఏమిటో…

bumrah

.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ప్రపంచంలో మేటి బౌలర్లంటే అందరికీ ఆరివీర వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లే గుర్తుకొస్తారు కదా… వాళ్లందరినీ మించిన రికార్డు మన బుమ్రాది.

స్వతహాగా గొప్ప గొప్ప ఫాస్ట్ బౌలర్లు అందరూ వెస్టిండీస్ లేదా SENA కంట్రీసై్ నుంచే వస్తారు… అంటే South Africa, England, New Zealand, Australia… లేదంటే పాకిస్థాన్ (ఇమ్రాన్ ఖాన్, వసిమ్ అక్రమ్ ) అది కూడా వారి ఆహారపు అలవాట్లు వల్ల ఆ శరీర దారుఢ్యం అలా వుంటుంది వాళ్ళకు…

అదే మన ఫాస్ట్ బౌలర్లను చూసుకుంటే… జవగల్ శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్, అజిత్ అగార్కర్.., అందరూ బక్క పలుచని వాళ్లే…, బౌగోళిక సాంస్కృతిక నేపథ్యం వల్ల మనం ఇప్పటి వరకు ఒక్క ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్ ను తయారుచేయలేక పోయాం (కపిల్ దేవ్ మినహాయింపు )…

కానీ మిగతా ఫాస్ట్ బౌలర్లందరినీ తలదన్ని ఈ ఫీట్ సాధించిన బుమ్రా నిజంగానే మనకి దొరికిన ఆణిముత్యం… ఒక్కసారి పైన చార్ట్ లోని పేర్లు చూడండి.. వాళ్ల పేర్లు చెప్పితే ఇప్పటికీ బాటర్లకి వణుకే… అటువంటి బౌలర్లని తలదన్నేలా మనోడు లిస్ట్ లో టాప్‌గా ఉండటం చాలా గ్రేట్…

సింపుల్ గా చెప్పాలంటే మినిమం 200 వికెట్లు తీసి, అతి తక్కువ రన్స్ ఇచ్చిన 125 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో బుమ్రా నెంబర్ వన్. ఈ ఆణిముత్యాన్ని కాపాడుకోవటం కోసం ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి..

సంజనా గణేశన్ బుమ్రా వైఫ్… మాజీ మిస్ ఇండియా ఫైనలిస్టు… ప్రజెంటర్ గా తన అచీవ్మెంట్స్ టీవీలో ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆమె వాయిస్ లో ఒక చెప్పలేని గర్వం… ఒక ఉత్సకత… ఒక ఎమోషన్… ట్రూ రిలేషన్ షిప్ కి ఒక example…

ఒక మ్యాచ్ ఓడిపోతామా, గెలుస్తామా వేరు, చాలా కారణాలుంటాయి… ఈ టెస్ట్ మ్యాచులో బుమ్రా బౌలింగ్ చూసి, ప్రస్తుతం అన్ని దరిద్రాలకి కారణమైన (బ్రిటిషర్లు ) ఇంగ్లీష్ కామెంటర్స్ పొగుడుతుంటే, ఒక భారతీయుడిగా లోలోపల ఒక చిన్న సంతోషం… సాధారణంగా ఇంగ్లీష్ పీపుల్ వాళ్లే ప్రపంచంలో అన్ని విషయాలలో నెంబర్ వన్ అనుకుంటారు… అటువంటి మెంటాలిటీ వాళ్ళతో కూడా నువ్వు తోపు అనిపించుకోవడం నీకే చెల్లింది బుమ్రా…

అసలు బుమ్రా ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే సింపుల్.., వర్దమాన క్రికెటర్లలో బుమ్రాలాగా గేమ్ చదివే క్రికెటరే లేడు… ఒక ఓవర్లో ఆరు బంతులను ఒకేలా వేయగలడు, అదే ఆరు బంతులను ఆరు రకాలుగానూ వేయగలడు.., టెస్ట్ క్రికెట్ చరిత్రలో బుమ్రా సంధించే యార్కర్ కి ప్రత్యేక స్థానం ఉందంటే మనవాడి బంతుల వైవిధ్యం ఎలాంటిదో తెలుస్తుంది…

ఒక గొప్ప బౌలరే కాదు, మన దేశం నుంచి ప్రంచానికి క్రికెట్ అందించిన ఒక గొప్ప బ్రాండ్ అంబాసిడర్… ఈ మ్యాచులో బుమ్రా బౌలింగులో 4 క్యాచులు డ్రాప్ అయితే, ఒక్క ఫిల్డర్ మీద కూడా నోరు పారేసుకోలేదు… ఫేసులో ఒక బాడ్ ఎక్స్ప్రెషన్ లేదు,  just సింపుల్, మొహానికి రెండు చేతులు అడ్డు పెట్టుకొని ఒక చిన్న చిరునవ్వు… అంతే… అదే తన కారెక్టర్.

గొప్ప ప్లేయర్లందరూ బుమ్రాలాగా ఉండకపోవచ్చు… ఉదాహరణ కోహ్లీ, పాంటింగ్, స్మిత్… మనం మాత్రమ్ బుమ్రా బుమ్రాలాగే ఉండాలని కోరుకుందాం… వికెట్ పడ్డ తర్వాత పిచ్చి పిచ్చి సెలబ్రేషన్స్, ఓవరాక్షన్లు గట్రా ఏమీ ఉండవు… (గోపు విజయకుమార్ రెడ్డి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నాణ్యతకూ, నమ్మకానికి పేరు హెరిటేజ్… కానీ ఎందుకో ‘పగిలిపోతోంది…’
  • తన పిచ్చి ఆరాధకుడు వర్మకు శ్రీదేవి లీగల్ నోటీస్ ఎందుకిచ్చింది..?!
  • ఒంటి పేరూ అది కాదు, ఇంటి పేరూ కాదు… బతుకులో ప్రతి అడుగూ ఓ విశేషమే…
  • జస్‌ప్రీత్ బుమ్రా..! ఎంతకాలంలే అన్నారు… పదేళ్లుగా అదే జోరు ప్రయాణం..!!
  • ఆశ్చర్యమే… 9 వేల కోట్ల ఓ పెద్ద టాస్క్ రేవంత్ రెడ్డి సాధించాడు…
  • ప్రేమ భర్తలనే కాదు… కన్న తల్లులనూ క్రూరంగా చంపేస్తోంది…
  • అపూర్వ చరణ్..! హాలివుడ్ పై ‘జెండా’ పాతిన తెలుగింటి అమ్మాయి..!
  • శుకపికముల కలరవముల స్వర లహరులలో… ఏదో రసాన్వేషణ..!!
  • ఎవరీ కొత్త రఘువరన్..? తెలుగు తెరకు కొత్త విలన్..! భలే పట్టుకొచ్చారు..!!
  • పాకిస్థాన్ వెళ్లడానికి మిల్కాసింగ్ ససేమిరా… నెహ్రూ ఒత్తిడి… ఎందుకు..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions