.
సినిమాలకు సంబంధించి కొన్నిసార్లు భలే వివాదాలు తలెత్తుతుంటాయి… ఆశ్చర్యంగా కూడా ఉంటాయి… కన్నప్ప సినిమాలో పిలక- గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరాలు చెప్పాయి… దాంతో పాత్రల పేర్లు మార్చేసి సెన్సార్ సర్టిఫికెట్ తీసుకున్నట్టు ఓ సమాచారం…
మంచిదే… ప్రత్యేకించి ఒక సామాజికవర్గాన్ని కించపరిచేలా పాత్రలు గానీ, సీన్లు గానీ, సంభాషణలు గానీ ఎందుకు పెట్టాలి అసలు..? పైగా అదే సినిమాకు పనిచేసిన బ్రాహ్మణులతో కౌంటర్లు ఇవ్వడం దేనికో… ఒక కులం మా మనోభావాల్ని దెబ్బతీయకండి అనడిగినప్పుడు అంగీకరించడం సరైన పద్ధతి…
Ads
అలాగే 8 వసంతాలు సినిమాలో వారణాసిలో ఫైట్లు, అత్యాచారం సీన్లు పెట్టడానికి కబేళా కావల్సి వచ్చిందా అంటూ ఓ జర్నలిస్టు అభ్యంతరం చెప్పాడు… దానికి దర్శకుడు ఏదో వివరణ ఇచ్చాడు సోషల్ మీడియా ద్వారా… మరో ఇష్యూలో హీరో విజయ్ దేవరకొండ మీద ఎక్కడో ఏదో అన్నాడని ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదైంది…
గతంలోలాగా కాదు… సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, మీడియా, పొలిటిషియన్స్, ఎవరైనా సరే, ఎవరిని కించపరిచినా, దూషించినా ఎవరూ ఊరుకోరు ఇప్పుడు… సరే, మలయాళంలో లవ్లీ అనే ఓ సినిమా వచ్చింది రీసెంటుగా… రొమాంటిక్ ఫాంటసీ జానర్ అట… ఇదొకటి ఉందా..?
థియేటర్లలో రిలీజ్ చేసినా పెద్ద స్పందన లేదు, 3డీ కూడా రిలీజ్ చేశారు… ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది… కేవలం మలయాళ వెర్షన్…, ఈ సినిమాలోనూ ఓ ఈగ పాత్ర ఉంది… అవును, ఆమధ్య రాజమౌళి ఈగ సినిమా తీశాడు కదా… అదే హీరో… సాహసాలు గట్రా చేస్తుంది…
ఈ మలయాళ లవ్లీ సినిమాలో కూడా సేమ్, ఈగను అలాగే గ్రాఫిక్స్‌లో చిత్రీకరించారనేది తాజా వివాదం… మలయాళ ఈగ మేకర్స్‌కు తెలుగు ఈగ మేకర్స్ కాపీ రైట్ ఉల్లంఘన పేరిట లీగల్ నోటీసులు కూడా జారీ చేశారట… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..?
ఈగ పాత్రను ఎవరు క్రియేట్ చేసినా సరే, అది ఈగలాగే ఉంటుంది తప్ప మలయాళ ఈగలకూ, తెలుగు ఈగలకూ తేడాలు ఏముంటాయి..? ప్రాంతాలను బట్టి ఈగల రూపురేఖలు మారవు కదా… నో, నో, మా సినిమాలో ఉన్న ఈగను పోలిన ఈగనే మలయాళీలు క్రియేట్ చేశారంటారు వీళ్లు… అదెలా..?
పోనీ, కథ ఒక్కటా..? కాదు… తెలుగు ఈగ కథ వేరు… నాని, సమంత తదితరులు యాక్ట్ చేశారు… అదో వింత ప్రేమ కథ… మలయాళ ఈగ కథ వేరు… జైలుకు వెళ్లిన ఓ యువకుడిని అక్కడ మాట్లాడే ఈగ పరిచయం అవుతుందట… సరే, ఆ బంధం మీద అదో కథ… కాపీ లేదు, కాపీ రైట్ లేదు అని మలయాళ దర్శకుడు కొట్టిపారేస్తున్నాడట… సో, కేసు కోర్టు విచారణ దాకా వెళ్లేట్టు ఉందని ఎక్కడో చదివినట్టు గుర్తు… ప్చ్, మలయాళ ఈగకు కాస్త రెండు మీసాలు ఎక్స్ట్రా పెడితే సరిపోయేది…!
Share this Article